MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కరీనాకి అహంకారం, అమీర్ కి చులకన భావం.. లాల్ సింగ్ చడ్డాపై విరుచుకుపడ్డ విజయశాంతి.. నాగ్, చిరుపై కూడా

కరీనాకి అహంకారం, అమీర్ కి చులకన భావం.. లాల్ సింగ్ చడ్డాపై విరుచుకుపడ్డ విజయశాంతి.. నాగ్, చిరుపై కూడా

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం ఆగష్టు 11న విడుదలయింది. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఈ చిత్రం ఇండియన్ ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 14 2022, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం ఆగష్టు 11న విడుదలయింది. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఈ చిత్రం ఇండియన్ ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమీర్ ఖాన్ చిత్రానికి దారుణమైన కలెక్షన్స్ నమోదవుతున్నాయి. సినిమా విడుదలకు ముందు నుంచే తీవ్ర వ్యతిరేకత మొదలయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అమీర్ ఖాన్ యాంటీ ఫాన్స్, హిందూ వాదులు లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఈ ప్రభావం కూడా సినిమాపై పడింది. తాజాగా బీజేపీ నాయకురాలు, నటి విజయశాంతి తీవ్రమైన విమర్శలతో లాల్ సింగ్ చడ్డా చిత్రంపై, అమీర్ ఖాన్ పై విరుచుకుపడ్డారు. 

36

విజయశాంతి ట్విట్టర్ లో స్పందిస్తూ.. దేశంపై ద్వేషం, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత, హిందువులంటే చులకన భావంతో వ్యాఖ్యలు చేస్తూ సినిమాలు తీసే అమీర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చడ్డా ఇప్పుడు కూలబడి కుదేలైంది అని విజయశాంతి అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ ప్రేక్షకులకు అమీర్ ఖాన్ నైజం తెలుసు. దీనితో లాల్ సింగ్ చడ్డా పరిస్థితి ఏంటో అమీర్ ఖాన్ ముందే గ్రహించారు. 

46

కనీసం పెట్టుబడైనా తిరిగి తెచ్చుకోవడానికి దక్షిణాది రాష్ట్రాల మీద.. విదేశీ మార్కెట్ మీదే ఆధారపడ్డాడు. టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్ పప్పులు ఉడక లేదు అంటూ విజయశాంతి చిరంజీవి, నాగార్జునపై కూడా పరోక్షంగా విమర్శలు చేసింది. లాల్ సింగ్ చెడ్డా చిత్రం ఇంతలా డిజాస్టర్ కావడానికి కారణం ఒకటే. అమీర్ అసలు తీరుపై హిందూ సంస్థలు, మాతృదేశ మరియు బీజేపీ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ... వాస్తవాలపై అవగాహన కల్పిస్తూ వచ్చారు.

56

అంతేకాదు, తన సినిమాలు చూస్తే చూడండి, లేకుంటే లేదన్న లాల్ సింగ్ హీరోయిన్ కరీనా కపూర్ వ్యాఖ్యల్లోని అహంకారాన్ని కూడా అర్ధం చేసుకున్నారు. ప్రజల్ని అమాయకులుగా భావించి ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తే... ఫలితాలు ఇలాగే ఉంటాయని గ్రహించాలి అంటూ రాములమ్మ తీవ్ర విమర్శలతో విరుచుకు పడ్డారు. 

66

కొందరు అభిమానులు ఈ చిత్రంలో అమీర్ ఖాన్ నటన అద్భుతంగా ఉందని, ఇది ఒక ప్రత్యేకమైన చిత్రం అంటూ అభినందిస్తున్నారు. కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రం రుచించడం లేదు. ఒరిజినల్ వర్షన్ ఫారెస్ట్ గంప్ ని నాశనం చేసారు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూవీలో నాగ చైతన్య కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్
Recommended image2
Urvashi Rautela: కేన్స్ లో ఊర్వశీ రౌతేలా కళ్ళు జిగేల్ మనే లుక్.. తేడా కొట్టేసింది, దారుణంగా ట్రోలింగ్
Recommended image3
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved