సంధ్య థియేటర్ ఘటన: విజయశాంతి ఘాటు స్పందన
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విజయశాంతి స్పందించారు. ఈ ఘటనను రాజకీయ స్వార్థం కోసం బీజేపీ నాయకులు ఉపయోగించుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
సంధ్య థియేటర్‌లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసులు మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ నటుడు అల్లు అర్జున్‌ను ఈ కేసులో ఎ11గా పేర్కొన్నారు.
పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. ఈలోపు హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.
తాజాగా కేసు విచారణ కోసం పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. ఓ వైపు సంధ్య థియేటర్ ఘటనలో మహిళ చనిపోయిన విషయాన్ని ముందుగానే పోలీసులు అల్లు అర్జున్‌కు చెప్పారని ప్రభుత్వం చెబుతుండగా.. తనకు తరువాతి రోజు మహిళ మృతి చెందిందనే విషయం తెలిసిందని బన్ని చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు విచారణలో ఏయే ప్రశ్నలు అడగనున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపధ్యంలో సంధ్య థియేటర్ ఘటనపై సినీయర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు.
సంధ్య థియేటర్ ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పిన ఆమె..రాజకీయ స్వార్థం కోసం ఈ ఘటనను ఉపయోగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన ఇప్పుడు రాజకీయంగా సంచలనానికి తెర లేపింది. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ ఘటన గురించి మాట్లాడారో.. అప్పటినుంచి రాజకీయ నాయకులంతా దీని గురించే మాట్లాడుతూ అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
రాములమ్మ
తాజాగా ఈ ఘటనపై పై సినీయర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పిన ఆమె.. రాజకీయ స్వార్థం కోసం ఈ ఘటనను ఉపయోగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
Etela Rajender, Vijaya Shanthi
విజయశాంతి తన ఎక్స్ లో పోస్టు చేస్తూ.." సినిమా విడుదల సమయంలో జరిగిన ఈ సంఘటన దురదృష్టకరమే. ఈ దురదృష్టకర ఘటనను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని బీజేపీ నేతల ప్రకటనల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.
కొందరు కేంద్రమంత్రులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసి, సినిమా పరిశ్రమను నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది ఖండించదగిన విషయం. సినిమా పరిశ్రమకు ప్రజల అందరి మద్దతు అవసరం. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సమస్యలను సక్రమంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరగాలి.." అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
read more: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్, విచారణలో 12 ప్రశ్నలు!
also read: బాలకృష్ణ రాముడు కాదా? వెంకటేష్ నిర్మొహమాటంగా చెప్పేశాడు, నాలుగు స్థంభాల ప్రస్తావన