MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Varma Dating: విజయ్ వర్మ కొత్త ప్రియురాలు ఎవరో తెలుసా ? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే

Vijay Varma Dating: విజయ్ వర్మ కొత్త ప్రియురాలు ఎవరో తెలుసా ? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే

సింగర్, నటి ఆలియా ఖురేషీ మ్యూజిక్ లాంచ్‌లో విజయ్ వర్మ సందడి చేయడంతో వీరిద్దరి డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ జవాన్ నటి ఎవరు? వీళ్ల పెళ్లి వార్తల్లో నిజమెంత? ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 14 2026, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్ వర్మ రిలేషన్‌షిప్
Image Credit : instagram

విజయ్ వర్మ రిలేషన్‌షిప్

విజయ్ వర్మ మరోసారి డేటింగ్ వార్తలతో హాట్ టాపిక్ అయ్యాడు. ఈసారి సింగర్, నటి ఆలియా ఖురేషీతో ఆయన పేరు వినిపిస్తోంది. ఆలియా తన మ్యూజిక్ ప్రాజెక్ట్ 'ఝల్లీ' లాంచ్ ఈవెంట్ చేయగా, విజయ్ అక్కడికి వెళ్లి ఆమెను ఎంకరేజ్ చేశాడు. తన జీవితంలో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడంటూ ఆలియా రీసెంట్‌గా చెప్పడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం ఆమె బయటపెట్టలేదు. వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అసలు ఆలియా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వీళ్ల పెళ్లి వార్తల్లో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
'జవాన్' నటి ఆలియా ఖురేషీ ఎవరు?
Image Credit : instagram

'జవాన్' నటి ఆలియా ఖురేషీ ఎవరు?

ఆలియా ఖురేషీ ఒక సింగర్, సాంగ్ రైటర్, అలాగే నటి కూడా. ఆమెకు 'ఝల్లీ' అనే స్టేజ్ నేమ్ కూడా ఉంది. షారుఖ్ ఖాన్ బ్లాక్‌బస్టర్ మూవీ 'జవాన్'తో ఆమె హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆజాద్ గ్యాంగ్ మెంబర్‌గా ఆలియా నటించింది. యాక్టింగ్ మాత్రమే కాకుండా మ్యూజిక్, సాంగ్ రైటింగ్ మీద కూడా ఆమెకు ఆసక్తి ఉంది. ఆమె ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రాజెక్ట్ 'ఝల్లీ' ఆమెలోని క్రియేటివిటీని బయటపెట్టింది. జవాన్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చినా, మ్యూజిక్ ద్వారానే ఆమె తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు పర్సనల్ లైఫ్ వార్తలతో ఆమె కెరీర్ మరోసారి ఫోకస్‌లోకి వచ్చింది.
35
'ఝల్లీ' లాంచ్‌లో విజయ్ వర్మ సందడి
Image Credit : instagram

'ఝల్లీ' లాంచ్‌లో విజయ్ వర్మ సందడి

ఆలియా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌లో విజయ్ వర్మ కనిపించడంతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఆలియా స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తుంటే, విజయ్ చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ ఎంజాయ్ చేశాడు. ఒక వీడియోలో అయితే తన ఫోన్‌లో ఆమె పర్ఫార్మెన్స్‌ను రికార్డ్ చేస్తూ కనిపించాడు. అతని ఉత్సాహం చూసి అభిమానులు వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందని ఫిక్స్ అవుతున్నారు. దానికి తోడు తన లైఫ్‌లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడని ఆలియా చెప్పడం ఈ చర్చను మరింత పెంచింది. కానీ ఆ వ్యక్తి విజయ్ అని ఆమె ఎక్కడా చెప్పలేదు. వీళ్లిద్దరూ చాలాసార్లు బయట కలిసి కనిపించడంతో డేటింగ్ రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై విజయ్ గానీ, ఆలియా గానీ అఫీషియల్‌గా స్పందించలేదు.

45
విజయ్ వర్మ, ఆలియా ఖురేషీ పెళ్లి చేసుకుంటారా?
Image Credit : instagram

విజయ్ వర్మ, ఆలియా ఖురేషీ పెళ్లి చేసుకుంటారా?

విజయ్ వర్మ పర్సనల్ లైఫ్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ముఖ్యంగా నటి తమన్నా భాటియాతో రిలేషన్‌లో ఉన్నప్పుడు ఆయన గురించి చాలా చర్చ జరిగింది. వాళ్లు విడిపోయారనే వార్తల తర్వాత, ఇప్పుడు మళ్లీ విజయ్ లవ్ లైఫ్ హాట్ టాపిక్ అయింది. ఆలియాతో ఆయన క్లోజ్‌గా ఉండటంతో, విజయ్ మరో సీరియస్ రిలేషన్‌షిప్‌కు రెడీ అయ్యాడా అనే ప్రశ్నలు వస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి కూడా కొన్ని రిపోర్ట్స్ మాట్లాడుతున్నాయి. ఇద్దరి మధ్య 11 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ వీళ్లు మాత్రం ఈ రూమర్స్‌పై స్పందించలేదు. ఎంగేజ్‌మెంట్, పెళ్లి గురించి విజయ్ లేదా ఆలియా నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అలాగే పెళ్లి కోసం ఆలియా మతం మారుతుందనే వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు. వాళ్లు స్వయంగా చెబితే తప్ప ఈ పెళ్లి, మతం మార్పిడి వార్తలన్నీ కేవలం పుకార్లే.

55
విజయ్ వర్మ కెరీర్
Image Credit : instagram

విజయ్ వర్మ కెరీర్

హిందీ సినిమా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విజయ్ వర్మ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గల్లీ బాయ్, డార్లింగ్స్ లాంటి సినిమాలతో పాటు మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఆయన స్పెషాలిటీ. థియేటర్, ఓటీటీ రిలీజ్‌లలో ఆయనకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆలియా ఖురేషీతో ఆయన రిలేషన్‌షిప్ వార్తలు జనాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Ramayana Look: 'రామాయణం'లో యశ్ రావణుడి గెటప్‌పై బాలీవుడ్ నటుడి షాకింగ్ కామెంట్స్.. ఏం మారలేదు అంటూ..
Recommended image2
Ranabaali Target: రణబాలి మూవీ హిట్‌ టార్గెట్‌, విజయ్‌ దేవరకొండ, రష్మిక ఎంత తీసుకున్నారంటే?
Recommended image3
కృష్ణ, శోభన్ బాబు నుంచి సూర్యకాంతం వరకు, లెజెండ్స్ అంతా ఉన్నారు.. దర్శకుడే ఫ్లాప్ అన్నారు, కట్ చేస్తే
Related Stories
Recommended image1
కృష్ణ, శోభన్ బాబు నుంచి సూర్యకాంతం వరకు, లెజెండ్స్ అంతా ఉన్నారు.. దర్శకుడే ఫ్లాప్ అన్నారు, కట్ చేస్తే
Recommended image2
Rajamouli: రాజమౌళి సినిమాల్లో వరస్ట్ మూవీ అదే, తేల్చేసిన కార్తికేయ.. బెస్ట్ మూవీస్ ఆర్ఆర్ఆర్, బాహుబలి కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved