MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: విజయ్ దళపతి రీమేక్ చేసిన పవన్ కళ్యాణ్ ఏకైక సినిమా ఏదో తెలుసా ?

Pawan Kalyan: విజయ్ దళపతి రీమేక్ చేసిన పవన్ కళ్యాణ్ ఏకైక సినిమా ఏదో తెలుసా ?

తమిళనాట గెలిచిన విజయ్ దళపతి, ఆంధ్రాలో గెలిచిన పవన్ కళ్యాన్ ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. అయితే వీరిద్దరు ఒకరి సినిమాలు మరొకరు రీమేక్ చేసుకున్నారన్న సంగతి మీకు తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 07 2026, 06:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తమిళనాట విజయ దళపతి సంచలనం..
Image Credit : X

తమిళనాట విజయ దళపతి సంచలనం..

తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలల్లో గెలిచి అధికారం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ గురించి సోషల్ మీడియాలో చాలా విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో విజయ్, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలు, వారిద్దరి మధ్య ఉన్న సినిమా బంధం గురించి కూడా చర్చ జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్ ,పవన్ మధ్య పోలికలు..
Image Credit : Asianet News

విజయ్ ,పవన్ మధ్య పోలికలు..

దళపతి విజయ్ ,పవన్ కళ్యాణ్ ఇద్దరూ తమ తమ భాషల్లో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. ఇద్దరి వయసు ఇంచుమించు ఒకటే. సినిమాల పరంగా మాత్రమే కాకుండా అభిమానుల విషయంలో, అలాగే రాజకీయాల్లో కూడా వీరిద్దరి దారి ఒకటే. అంతే కాదు సినిమాలు చేస్తున్న టైమ్ లో కూడా ఇద్దరు ఒకరి సినిమాలను మరొకరు రీమేక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే విజయ్ దళపతి మూడు సినిమాలను పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే.. విజయ్ మాత్రం పవన్ కళ్యాణ్ నుంచి ఒకే ఒక్క సినిమాను రీమేక్ చేశాడు.

35
ఇద్దరి మధ్య సినిమా బంధం..
Image Credit : Asianet News

ఇద్దరి మధ్య సినిమా బంధం..

విజయ్ నటించిన మూడు తమిళ్ సినిమాలను పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేశారు. వాటిలో ‘లవ్ టుడే’ సినిమాను ‘సుస్వాగతం’గా, ‘ఖుషి’ సినిమాను అదే పేరుతో ‘ఖుషి’గా, ‘తిరుప్పాచ్చి’ సినిమాను ‘అన్నవరం’గా రీమేక్ చేశారు. ఈ సినిమాలు తెలుగులో మంచి గుర్తింపు పొందాయి. ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సుస్వాగతం కూడా హిట్ అవ్వగా.. అన్నవరం మాత్రం యావరేజ్ గా నిలిచింది.

45
పవన్ రీమేక్ సినిమాలో విజయ్..
Image Credit : Asianet News

పవన్ రీమేక్ సినిమాలో విజయ్..

ఇక పవన్ కళ్యాణ్ సినిమాలలో విజయ్ ఒక్క సినిమానే రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ను తమిళ్‌లో ‘బద్రి’ పేరుతో విజయ్ రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రీతీ జింటా హీరో హీరోయిన్లుగా నటించిన ఈమూవీ బాక్సింగ్ నేపథ్యంతో రూపొందింది.

55
విజయ్ రీమేక్ చేసిన తెలుగు సినిమాలు?
Image Credit : Thammudu Movie\Twitter

విజయ్ రీమేక్ చేసిన తెలుగు సినిమాలు?

తమ్ముడు’ సినిమా 1999లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అదే సినిమాను పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలోనే విజయ్, భూమికలతో తమిళ్‌లో 2001లో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ సాధించింది. అయితే విజయ్ దళపతి తెలుగు నుంచి చాలా సినిమాలను తమిళ్ లో రీమేక్ చేశారు. అందులో ఒక్కడు, నువ్వునాకు నచ్చావ్, పెళ్లి సందడి, పోకిరి లాంటి హిట్లు ఉన్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Vijay Fitness: 50 లో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఎలా ? దళపతి విజయ్ డైట్ సీక్రెట్ ఇదే
Recommended image2
55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం, 12 మందితో ఎఫైర్ రూమర్స్, క్యాన్సర్ జయించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved