- Home
- Entertainment
- Janaganamana Update : విజయ్ న్యూ లుక్ అదిరింది.. ‘జనగణమన’పై పూరీ ఫోకస్.. రెగ్యూలర్ షూట్ అప్పుడేనంట..
Janaganamana Update : విజయ్ న్యూ లుక్ అదిరింది.. ‘జనగణమన’పై పూరీ ఫోకస్.. రెగ్యూలర్ షూట్ అప్పుడేనంట..
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Jagannadh), విజయ్ దేవరకొండ క్రేజీ కాంబినేషనల్ లో త్వరలో ‘జనగణమన’ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు కోసం విజయ్ న్యూ లుక్ అట్రాక్టివ్ గా ఉంది. ప్రస్తుతం ఆయన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) బ్యాక్ టు బ్యాక్ మూవీలతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్న.. ఒక్కో మూవీలో ఒక్కో రకంగా లుక్ ను ఛేంజ్ చేసుకుంటూ తెలుగు ఆడియెన్స్ ను షాక్ కు గురిచేస్తున్నాడు విజయ్.
ఇప్పటికే యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోల జాబితాలోకి విజయ్ దేవరకొండ పేరు పేరు ఎక్కేసింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈయన హవా వేరే లెవెల్ ఉంటోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ దర్శకత్వంలో ‘లైగర్’మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ఆగస్టు 25న ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు తమిళం, మాలమాళం, కన్నడ భాషల్లో డబ్ వర్షన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు. 2020 నవంబర్ లోనే రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేసినా.. కరోనా పరిస్థితుల మూలంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేళలకు ఆగస్టులో రిలీజ్ చేయనున్నారు.
ఇక ‘లైగర్’ మూవీలో అనన్యపాండే (Ananya Pandey) విజయ్ సరసన ఆడిపాడనుంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై కరన్ జోహార్, చార్మీ కౌర్, అపూర్వ మెహత, హిరో యష్ జోహార్, పూరీ జగన్నాథ్ కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ చేస్తున్న ఈ మూవీ కోసం ఇప్పటికే ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
లైగర్ విషయాన్ని అటుంచితే విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ‘జనగణమన’ మూవీ రాబోతున్నట్టు అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. లైగర్ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఆడియెన్స్.. మరోపక్క ‘జనగణమన’ అప్డేట్స్ పై ఆసక్తి చూపుతున్నారు.
‘జనగణమన’ను పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్‌ను నిర్మించనున్నారు. అయితే ఈ మూవీని తెరకెక్కించేందుకు పూరీ జగన్నాథ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏప్రిల్‌లో స్టార్ట్ చేసేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోందని టాక్. మేజర్ షూటింగ్ అమెరికాలో జరుగుతుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఇక ఈ మూవీలో విజయ్ ఒక మిలిటరీ పర్సన్ గా కనిపించనున్నారు. ఇది హై ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ అని, ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూడాలని పూరీ జగన్నాథ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈ మూవీ కోసం ఇప్పటికే న్యూ లుక్ కు రెడీ అయ్యాడు విజయ్. మిలిటరీ హెయిర్ కట్ లో అట్రాక్ట్ చేస్తున్నాడు. న్యూ లుక్ ను కవర్ చేసేందుకు క్యాప్ మెయిన్ టెయిన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.