- Home
- Entertainment
- విజయ్, కమల్, రజినీకాంత్ లకు విలన్‌గా విజయ్ సేతుపతి, ఆ ఒక్క హీరోతో ఛాన్స్ మిస్సయ్యిందంటూ ఆవేదన
విజయ్, కమల్, రజినీకాంత్ లకు విలన్‌గా విజయ్ సేతుపతి, ఆ ఒక్క హీరోతో ఛాన్స్ మిస్సయ్యిందంటూ ఆవేదన
విజయ్, కమల్, రజినీ లాంటి స్టార్ హీరోలకు విలన్‌గా నటించిన విజయ్ సేతుపతి, ఒక్క హీరో సినిమాలో మాత్రం అవకాశం మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో..?

అజిత్‌తో విజయ్ సేతుపతి
కోలీవుడ్ లో చిన్న సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ సేతుపతి వరుసగా హిట్ సినిమాలు చేశారు. హీరోగానే కాకుండా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మెప్పించారు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి స్టార్ హీరోలకు విలన్‌గా నటించిన సేతుపతి, ఇప్పటివరకు అజిత్‌తో మాత్రం నటించలేదు.
Also Read: 50 వేల కోట్ల ఆస్తి ఉన్న హీరో, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు కారణం ఏంటి..?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి
అజిత్‌తో ఎప్పుడు నటిస్తారనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇప్పటివరకు ఏదీ ప్లాన్ ప్రకారం జరగలేదని, మంచి అవకాశం వస్తే నటిస్తానని, గతంలో ఓ సినిమాలో నటించాల్సి ఉండగా అది కుదర్లేదని, త్వరలోనే అజిత్‌తో నటిస్తానని ఆశిస్తున్నానని చెప్పారు.
Also Read: సినిమాలు మానేసి, డాక్టర్ గా ప్రాక్టీస్ చేయబోతున్న హీరోయిన్? షాక్ లో ఫ్యాన్స్
అజిత్‌కు విలన్‌గా సేతుపతి
ఏ సినిమాలో అవకాశం మిస్సయ్యిందో చెప్పడానికి మాత్రం విజయ్ సేతుపతి నిరాకరించారు. గతంలో అజిత్, విఘ్నేష్ శివన్ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్లాన్ అయ్యి ఆగిపోయింది. ఆ సినిమాలో అజిత్‌కు విలన్‌గా సేతుపతిని అనుకున్నారట. ఆ విషయాన్నే సేతుపతి చెప్పి ఉండొచ్చు.
Also Read: మహేష్ బాబుకు సారి చెప్పిన స్టార్ డైరెక్టర్, కారణం ఏంటి? నిజం ఎంత?
సేతుపతికి ఇష్టమైన విలన్
హీరోగా నటించడం ఇష్టమా అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు, అన్ని క్యారెక్టర్స్ ఇష్టమేనని, కానీ విలన్ పాత్రలు చేయడం ఇష్టమని, ఎందుకంటే వాటిలో స్వేచ్ఛ ఉంటుందని, హీరో పాత్రల్లో కొన్ని పరిమితులు ఉంటాయని విజయ్ సేతుపతి చెప్పారు.
Also Read: హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?
Also Read: ఒక్క ఏడాదిలో 36 సినిమాల్లో నటించిన హీరో, ఎవరికి సాధ్యం కాని రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ ఎవరు?