- Home
- Entertainment
- 59000 టిక్కెట్లు, 12 లక్షల కలెక్షన్స్, రీరిలీజ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరో సినిమా ఏదో తెలుసా?
59000 టిక్కెట్లు, 12 లక్షల కలెక్షన్స్, రీరిలీజ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరో సినిమా ఏదో తెలుసా?
ఈమధ్య రీరిలీజ్ ల ట్రెండ్ గట్టిగ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు ఏదో ఒక అకేషన్ చూసుకుని రిలీజ్ చేస్తున్నారు. కొన్నిసినిమాలు 10 ఏళ్లు, 20 ఏళ్ళు అయిన సందర్భంగా కూడా రీరిలీజ్ అవుతున్నాయి. అలా రిలీజ్ అయిన ఓ సినిమా.. భారీ రెస్పాన్స్ ను సాధించింది. అంతే కాదు ఒక్క సారిగా 59000 టికెట్లు అమ్ముడు పోవడంతో పాటు 12 లక్షల కలెక్సన్స్ కూడా సాధించింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎవరా స్టార్ హీరో..?
- FB
- TW
- Linkdin
Follow Us
)

sachin movie
ఎప్పటికీ క్రౌడ్ పుల్లర్ అయిన విజయ్ నటించిన సచిన్ సినిమా మళ్ళీ థియేటర్లలోకి వచ్చింది. విజయ్ నటించిన సచిన్ సినిమా 2005లో విడుదలైంది. తాజాగా ఈసినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో తిరిగి విడుదల చేశారు. సచిన్ సినిమా పునఃవిడుదల సందర్భంగా నిన్న రాత్రి ప్రత్యేక ప్రీమియర్ షో కూడా వేశారు.
రొమాంటిక్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ టైటిల్ పాత్ర పోషించారు. జెనీలియా హీరోయిన్ గా నటించారు. జాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బిపాషా బసు, వడివేలు, సంతానం, రఘువరన్, తలైవాసల్ విజయ్, మోహన్ శర్మ, బేబీ శర్మి వంటి వారు నటించారు. ప్రపంచ వ్యాప్తంగా రీరిలీజ్ అయిన ఈసినిమా బుక్ మై షో ద్వారా 59000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి, ఒక్క సారిగా దాదాపు 12 లక్షలు వసూలైందని తెలుస్తుంది.
Vijay Thalapathy 69 upcoming film update out
విజయ్ దళపతి ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా జూన్ నాటికి పూర్తవుతుందని అంచనా. అనిరుధ్ సంగీత అందిస్తున్న ఈసినిమాలో బాబీ డియోల్, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరేన్, ప్రియమణి, మమతా వంటి స్టార్స్ నటిస్తున్నారు. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లోకేష్ కనకరాజ్, అట్లీ, నెల్సన్ వంటి దర్శకులు ఈ సినిమాలోని ఒక పాటలో కనిపిస్తారని సమాచారం. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్ పార్ట్ ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని తెలుస్తుంది.