- Home
- Entertainment
- Jana Nayakudu: విజయ్ `జన నాయకుడు`కి దెబ్బ మీద దెబ్బ.. ఓటీటీ సంస్థ ఝలక్, బయ్యర్ల ఒత్తిడి.. భారీ నష్టం?
Jana Nayakudu: విజయ్ `జన నాయకుడు`కి దెబ్బ మీద దెబ్బ.. ఓటీటీ సంస్థ ఝలక్, బయ్యర్ల ఒత్తిడి.. భారీ నష్టం?
దళపతి విజయ్ నటించిన `జన నాయకుడు` మూవీస్ కి దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. ఈ చిత్రం సెన్సార్ వివాదంతో ఆగిపోయింది. ఇప్పుడు ఓటీటీ సమస్య కూడా స్టార్ట్ అయ్యింది.

సెన్సార్ సమస్యలతో వాయిదా పడ్డ `జన నాయకుడు`
నటుడు విజయ్ 'జన నాయకుడు' సినిమా చిక్కుల్లో పడింది. సెన్సార్ బోర్డు కేసు వేయడంతో సినిమాను రిలీజ్ చేయలేక టీమ్ ఇబ్బంది పడుతోంది. సినిమాలోని కొన్ని సీన్లు, డైలాగ్‌లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఉండటంతో సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపింది. ఇది కాస్త కోర్ట్ కి చేరింది. దీంతో సంక్రాంతికి జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. ఇప్పటికీ సెన్సార్ క్లీయర్ కాలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు.
కోర్ట్ లో కేసు మళ్లీ వాయిదా
నిన్న హైకోర్టులో ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, తీర్పు తేదీ చెప్పకుండా కేసును వాయిదా వేశారు. ఒకవేళ తీర్పు సినిమాకు అనుకూలంగా వస్తే, సెన్సార్ బోర్డు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
భారీ రేటుకి `జన నాయకుడు` ఓటీటీ హక్కులు
సినిమా ఓటీటీ హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్, 'జననాయగన్' టీమ్‌పై కేసు పెట్టే ప్రమాదం ఉంది. సినిమా రిలీజ్ డేట్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ రూ.120 కోట్లకు కొనుగోలు చేసింది. తిరిగి డబ్బులు ఇవ్వాలని, రైట్స్ ప్రైజ్ తగ్గించాలనే ఒత్తిడి పెరిగిందట.
డబ్బుల కోసం బయ్యర్ల ఒత్తిడి
మరోవైపు, సినిమా పంపిణీ హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అప్పులు చేసి హక్కులు కొనడంతో, ఈ ఆలస్యం వారికి రుణ భారాన్ని పెంచుతోంది. థియేటర్లు కేటాయించిన యజమానులు కూడా నష్టపోయారు. దీంతో వారంతా నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నారట. తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలనే డిమాండ్ వస్తుందట. ఇదిప్పుడు సినిమాకి పెద్ద దెబ్బగా మారుతుంది. ఇప్పటికే రిలీజ్ వాయిదా పడి నిర్మాతలు నష్టపోయారు. ఇప్పుడు బయ్యర్లు, ఓటీటీ సంస్థ నుంచి ఒత్తిడి పెరగడంతో అయోమయంలో నిర్మాత ఉన్నారు. ఇది ఆయనకు భారీగా నష్టాలను తీసుకురాబోతుందని టాక్. మరి ఈ వివాదం ఎప్పుడు సాల్వ్ అవుతుందో చూడాలి.

