MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kushi WW Collections : మొదటిరోజు ‘ఖుషి’వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. విజయ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్..

Kushi WW Collections : మొదటిరోజు ‘ఖుషి’వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. విజయ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్..

మొదటిరోజు పాజిటివ్ టాక్ తో థియేటర్లలో సందడి చేసిన ‘ఖుషి’ చిత్రం మొదటిరోజు కలెక్షన్ల పరంగానూ దుమ్ములేపింది. ప్రపంచ వ్యాప్తంగా సాలిడ్ గా వసూళ్లు చేసింది. ఇక విజయ్ కెరీర్ లోనే సెన్సేషనల్ ఓపెనింగ్స్ గా ఈ చిత్రం నిలిచింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 02 2023, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (VIjay Deverakonda)  - సమంత (Samantha) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi) నిన్న విడుదలైన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం తొలిరోజు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. విజయ్, సమంతల క్రేజ్ కు ఫస్ట్ డే థియేటర్లు హౌజ్ ఫుల్ అయ్యాయి. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తోపాటు బాక్సాఫీస్ వద్ద కూడా ‘ఖుషి’ సూపర్ రిజల్ట్ ను అందింది. మొదటి రోజు కలెక్షన్స్ సర్ ప్రైజింగ్ గా ఉన్నాయి. 
 

26

 Kushi Day 1 Collectionsను మేకర్స్ తాజాగా ప్రకటించారు. సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ కలెక్షన్స్ లో దూసుకెళ్తోందని తెలిపారు. "ఖుషి" తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.30.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని వెల్లడించారు. ఈ సినిమా వసూళ్లు షో బై షో పెరుగుతూ వచ్చిందన్నారు. నైజాం ఏరియాతో పాటు వైజాగ్ ఇతర ఏపీ సిటీస్ లో ఖుషికి సూపర్బ్ ఓపెనింగ్స్ వచ్చాయి.  ఇక యూఎస్ బాక్సాఫీస్ వద్ద 8 లక్షల డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. వన్ మిలియన్ మార్క్ వైపు వేగంగా పరుగులు పెడుతోందన్నారు. 
 

36

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్స్ ను సాధించింది. ఏరియా వైజ్ గా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.  నైజాం : 5.15 కోట్లు, సీడెడ్ : 91 లక్షలు, యూఏ : 1.13  కోట్లు, ఈస్ట్ : 66 లక్షలు, వెస్ట్ : 63 లక్షలు, గుంటూరు : 66 లక్షలు, కృష్ణ : 44 లక్షలు, నెల్లూరు : 29 లక్షలు వసూల్ చేసింది. ఏపీ మరియు తెలంగాణలో మొత్తంగా.... 9.87 కోట్లు కలెక్ట్  చేసిందని తెలుస్తోంది. 

46

దీంతో తెలుగు స్టేట్స్ లో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హ్యయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రం ‘ఖుషి’ నిలిచింది. చివరిగా వచ్చిన లైగర్ రూ.9.57 కోట్లు సాధించి తర్వాత స్థానంలో ఉంది. ఇక ఇవ్వాళ, రేపు వీకెండ్ కావడంతో ‘ఖుషి’  కలెక్షన్స్ మరింత సర్ ప్రైజింగ్ గా ఉంటాయని అంటున్నారు. వీకెండ్ పూర్తయ్యే వరకు బ్రేక్ ఈవెన్  టార్గెట్ కూడా పూర్తి చేసుకోనుందని అంచనా వేస్తున్నారు. 
 

56

మరోవైపు నార్త్, తమిళం, కర్ణాటక, మలయాళంలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్  దక్కిందని తెలుస్తోంది. బుక్సింగ్స్ జోరుగా సాగుతున్నాయని, అక్కడా మంచి కలెక్షన్సే రాబట్టనుంది. అన్నీ చోట్ల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రేక్షాకదరణ దక్కుతోందని తెలుస్తోంది. విజయ్ కెరీర్ లో ఇలా తొలి రోజు ఇంత భారీ వసూళ్లు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 
 

66

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఈ చిత్రం నిన్న (సెప్టెంబర్ 1)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలాంటి క్లీన్ లవ్,  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఇటీవల కాలంలో రాలేదనే ప్రశంసలు ఈ మూవీకి దక్కాయి. హేషమ్ అబ్దుల్ వహబ్ అందించిన సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
జీవితంలో కచ్చితంగా సక్సెస్ కావాలని రూల్‌ ఏం లేదు బాసూ.. పూరీ చెప్పిన జీవిత స‌త్యం
Recommended image2
విజయ్ - సంగీత మళ్లీ కలిశారా? దళపతి సీఎం అయితే.. ప్రమాణ స్వీకారానికి కలిసే వస్తారా?
Recommended image3
Nandamuri Balakrishna: గెస్ట్ రోల్ అనగానే ముఖం మీద వద్దని చెప్పేశా.. కానీ బాలయ్య సినిమా అనేసరికి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved