MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Nandamuri Balakrishna: గెస్ట్ రోల్ అనగానే ముఖం మీద వద్దని చెప్పేశా.. కానీ బాలయ్య సినిమా అనేసరికి..

Nandamuri Balakrishna: గెస్ట్ రోల్ అనగానే ముఖం మీద వద్దని చెప్పేశా.. కానీ బాలయ్య సినిమా అనేసరికి..

Balakrishna: సినీ పరిశ్రమలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే శివకృష్ణ, నేటి తరం నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాత్ర చిన్నదైనా, పెద్దదైనా ఆత్మసంతృప్తి ముఖ్యం అనే ఆయన సిద్ధాంతం సినిమా పట్ల ఆయనకున్న అంకితభావాన్ని చాటిచెబుతోంది. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 21 2026, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
'వీరసింహారెడ్డి'లో నటించిన సందర్భం..
Image Credit : Nandamuri Balakrishna\Instagram

'వీరసింహారెడ్డి'లో నటించిన సందర్భం..

టాలీవుడ్ సీనియర్ నటుడు శివకృష్ణ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన, తాజాగా తన సినీ ప్రయాణం, బాలకృష్ణ సినిమా 'వీరసింహారెడ్డి'లో నటించిన సందర్భం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిలిటరీ క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తిత్వం
Image Credit : Pinterest

మిలిటరీ క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తిత్వం

శివకృష్ణ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలిటరీ ఏరియాలో పెరిగారు. చిన్నప్పటి నుండి మిలిటరీ వాతావరణంలో పెరగడం వల్ల ఆయనలో క్రమశిక్షణ, దేశభక్తి, సమయపాలన రక్తంలోనే కలిసిపోయాయి. ఈ క్రమశిక్షణే ఆయన సినీ కెరీర్‌లో కూడా ప్రతిబింబించింది. మనసుకు నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తానని, ఇప్పటివరకు దాదాపు 40-50 సినిమాలను కేవలం నచ్చకపోవడం వల్లే వదులుకున్నానని ఆయన వెల్లడించారు.

35
సెల్ఫ్ మేడ్ హీరో, ప్రొడ్యూసర్
Image Credit : Pinterest

సెల్ఫ్ మేడ్ హీరో, ప్రొడ్యూసర్

సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, శివకృష్ణ తనను తాను పరిచయం చేసుకుని హీరోగా ఎదిగారు. 'మరో మలుపు' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన, తన స్వంత డబ్బుతో సినిమాలు నిర్మించి నిర్మాతగా కూడా విజయం సాధించారు. ఆర్థిక లాభాల కంటే ఆత్మసంతృప్తికే తాను ప్రాధాన్యం ఇస్తానని, అందుకే తక్కువ సినిమాల్లో నటించినా మంచి గుర్తింపు తెచ్చుకున్నానని ఆయన పేర్కొన్నారు.

45
బాలయ్య సినిమా కోసం..
Image Credit : Facebook/Nandamuri Balakrishna

బాలయ్య సినిమా కోసం..

సాధారణంగా శివకృష్ణ చిన్న పాత్రలు లేదా గెస్ట్ రోల్స్ చేయడానికి అంతగా ఇష్టపడరు. కానీ 'వీరసింహారెడ్డి' సినిమా విషయంలో మాత్రం ఆయన తన నిబంధనను పక్కన పెట్టారు. మేకప్ మ్యాన్ ఫోన్ చేసి ఒక గెస్ట్ రోల్ ఉందని చెప్పినప్పుడు మొదట వద్దన్నారట. అయితే అది బాలకృష్ణ సినిమా అని తెలియగానే, ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నట్లు శివకృష్ణ వెల్లడించారు. బాలకృష్ణపై ఉన్న గౌరవంతోనే ఆ పాత్ర చేసినట్లు ఆయన వివరించారు.

55
కృష్ణతో సాన్నిహిత్యం.. నాగేశ్వరరావుతో లోటు
Image Credit : Superstar Krishna\Twitter

కృష్ణతో సాన్నిహిత్యం.. నాగేశ్వరరావుతో లోటు

తన కెరీర్‌లో సూపర్ స్టార్ కృష్ణతో 7-8 సినిమాల్లో నటించానని, ఆయన తనను ఎంతగానో ఇష్టపడేవారని శివకృష్ణ గుర్తు చేసుకున్నారు. అయితే తన సినీ ప్రయాణంలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించలేకపోవడం ఒక పెద్ద అసంతృప్తిగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా వారితో మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, వెండితెరపై కలిసి కనిపించే అవకాశం రాలేదని ఆయన చెప్పుకొచ్చారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
వినోదం
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
VV Vinayak: రాఘవేంద్రరావు రిజెక్ట్ చేసిన పాటతో చంద్రబోస్ నంది అవార్డు గెలిచాడు.. వినాయక్ కామెంట్స్
Recommended image2
VV Vinayak: ఆది బడ్జెట్ 2 కోట్లే.. కానీ మార్నింగ్ షో పడగానే కోట్ల ఆఫర్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved