ఖుషి మ్యూజిక్ ఈవెంట్ లో.. విజయ్ దేవరకొండ వేసుకున్న డ్రెస్ ధర ఎంతో తెలుసా? ఎన్ని లక్షలంటే?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాషన్ పరంగా ట్రెండ్ సెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నిన్న ‘ఖుషి మ్యూజిక్ కన్సర్ట్’లో విజయ్ ధరించిన డ్రెస్ అందరి కంట పడింది. తాజాగా దాని ధర వైరల్ గా మారింది.
డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) డ్రెస్సింగ్ స్టైల్ ఎంత అట్రాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. నానితో కలిసి చేసిన సినిమాకు సరైన అవుట్ ఫిట్లలేవన్న స్టేజ్ నుంచి ప్రస్తుతం రౌడీ హీరో ఎలాంటి అవుట్ ఫిట్ ధరించిన ట్రెండ్ లోకి వచ్చేలా చేస్తున్నారు.
‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి విజయ్ ధరించే క్లాథ్స్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అవుట్ ఫిట్స్ ఫ్యాన్స్ నే కాకుండా ఫ్యాషన్ ప్రియులకు చాలా నచ్చుతుందనే చెప్పాలి. మరోవైపు విజయ్ తన ఈవెంట్ల కోసం సెపరేట్ గా డ్రెస్ లను డిజైన్ చేయిస్తారంట. అందుకే అంత స్టైలిష్ గా, అట్రాక్టివ్ గా కనిపిస్తుంటాయి.
ఇదిలా ఉంటే.. అర్జున్ రెడ్డి తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’ మ్యూజిక్ కన్సర్ట్ నిన్న హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్ కోసం విజయ్ దేవరకొండ ధరించిన డ్రెస్ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అది చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది.
పాయింట్ గానీ, సూట్ గానీ, ధరించే విధానం అన్నీ ఆకట్టుకున్నాయి. సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ గ్రాండ్ లుక్ తో ఈవెంట్ లో అందరి చూపు విజయ్ పైనే పడేలా చేసింది. దీంతో ఆ అవుట్ ఫిట్ ధర ఎంత ఉంటుందని నెటిజన్లు వెతికి చూస్తున్నారు. అక్షరాల రూ.2 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఆ ప్రత్యేకమైన అవుట్ ఫిట్ లో విజయ్ దేవరకొండ సమంతతో కలిసి లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. తమ డాన్స్ తో యువతను ఉర్రూతలూగించారు. సంగీతంతోనే సినిమాపై చాలా హైప్ తీసుకొచ్చారు. చివర్లో తమ ప్రసంగాలతోనూ ఆకట్టుకున్నారు.
‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు.