ఎన్టీఆర్ కాదు.. విజయ్ దేవరకొండతో ఆ భారీ ప్రాజెక్ట్! సూపర్ మ్యాన్ టైప్ లో ...?
ఎన్టీఆర్ కు అనుకున్న ఓ భారీ ప్రాజెక్టు విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే...
ntr, Vijaydevarkonda
ఒక హీరోకు అనుకున్న ప్రాజెక్టు మరో హీరో చేయటం ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరిగే సంగతి. కథ తమ ఇమేజ్ తగ్గట్లు లేకపోవటమో లేక డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటమో , ఇంకా పైకి చెప్పలేని రకరకాల కారణాలతో ప్రాజెక్టులు హీరోలు మారుతూంటాయి. అలా ఇప్పుడు ఎన్టీఆర్ కు అనుకున్న ఓ భారీ ప్రాజెక్టు విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే...
ntr, Vijaydevarkonda
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు...దీనితో పాటు రాబోయే రోజుల్లో పాన్ ఇండియా రేంజ్ లో పలు భారీ ప్రాజెక్ట్ లు చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వాటిలో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'జటాయు' కూడా ఉంది. ఈ క్రమంలో మైథలాజికల్ టచ్ ఉన్న ఈ భారీ సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారనే చర్చ కూడా జరిగింది.
Vijaydevarkonda
అయితే ఈ ప్రాజెక్టుకు ఫెరఫెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ సెట్ అవుతారని భావించి ఆయన దగ్గరకు తీసుకు వెళ్లారట. ఎవరూ ఊహించనంత భారీగా ఈ ప్రాజెక్టు ని తెరకెక్కిస్తానని చెప్పారట. అయితే తను వరస సినిమాలతో బిజిగా ఉండటంతో ఇప్పుడిప్పుడే డేట్స్ ఇచ్చే అవకాసం లేదని ఎన్టీఆర్ చెప్పటం జరిగింది. దాంతో ఎవరు ఆ పాత్రకు చేయగలరు అన్నప్పుడు ...లైగర్ తో పాన్ ఇండియాకు పరిచయం అయిన విజయ్ దేవరకొండ అయితే బెస్ట్ అనే డెసిషన్ కు వచ్చారట. అలా ఊహించనివిధంగా విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది.
హిట్ ,ఫ్లాఫ్ లకు విజయ్ దేవరకొండ క్రేజ్ కు సంభందం లేదు. ఎంత పెద్ద ఫ్లాప్ వచ్చినా విజయ్ దేవరకొండ క్రేజ్, రేంజ్ తగ్గలేదు. సెప్టెంబర్ 1న సమంతో కలిసి నటించిన ఖుషీ విడుదల కాబోతోంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. రిలీజైన పాటల్లో చూస్తేనే సమంత, విజయ్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరినట్టు కనిపిస్తోంది.
Vijaydevarkonda
విజయ్ దేవరకొండ ప్రస్తుతం మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ సినిమాతో పాటు దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. గౌతమ్ సినిమాలో సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నాడు విజయ్. ఈ తరహా పాత్ర అతనికి ఇదే మొదటిసారి. ఇక పరశురామ్ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందట. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.
Vijaydevarkonda
ఇప్పుడు ‘జటాయు’ అనే ఈ ప్యాన్ ఇండియన్ రేంజ్ కంటెంట్ కు ఓకే చెప్పాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ ఇప్పటి వరకూ మీడియం, లో బడ్జెట్ సినిమాలు మాత్రమే చేశాడు. కానీ బ్రిలియంట్ డైరెక్టర్ అనే పేరు మాత్రం ఉంది. చివరగా సుధీర్ బాబుతో చేసిన వి డిజాస్టర్ అయినా.. దిల్ రాజు అతన్ని నమ్మాడు. అందుకే ఇంత పెద్ద ప్రాజెక్ట్ తో వస్తున్నాడు
ఇప్పటికే విజయ్, ఇంద్రగంటి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని.. ఈ సినిమా చేయడానికి విజయ్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కు భారీగా ఉంటాయట.
ఇక జటాయు ఎవరూ అంటే? రామాయణంలోని అరణ్యకాండలో రావణుడు సీతను ఎత్తుకుపోతున్నప్పుడు ఆమెను కాపాడేందుకు ప్రాణాలు అడ్డుపెట్టి మరీ పోరాటం చేస్తుంది జటాయువు అనే పక్షి. ఈ పోరాటంలో అతను మరణిస్తాడు. ఆ త్యాగానికి చలించిన శ్రీ రాముడు స్వయంగా తనే దహన సంస్కారాలు చేస్తాడు. ఆ పక్షి మరు జన్మలో మానవుడుగా పుట్టడం...ఆ శక్తులు ఉండటం, అక్కడ నుంచి సూపర్ మ్యాన్ తరహాలో ప్రజలను రక్షించటం వంటి ఎలిమెంట్స్ తో కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
పరశురామ్ దర్శకత్వంలో విజయ్ చేయనున్న 'VD 13'కి కూడా దిల్ రాజే నిర్మాత. ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే విజయ్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయడానికి దిల్ రాజు సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది. అన్ని అనుకున్నట్లు జరిగితే 'జటాయు' వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది అంటున్నారు.