MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • కింగ్డమ్ ట్విట్టర్ రివ్యూ, విజయ్ దేవరకొండ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినట్లేనా.. మూవీ హిట్టా ఫట్టా

కింగ్డమ్ ట్విట్టర్ రివ్యూ, విజయ్ దేవరకొండ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినట్లేనా.. మూవీ హిట్టా ఫట్టా

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ప్రీమియర్స్ నుంచి ఈ చిత్రానికి ట్విట్టర్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 31 2025, 01:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ
Image Credit : X/Sithara Entertainments

విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం నేడు జూలై 31న రిలీజ్ అవుతోంది. ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు పొందిన గౌతమ్ తిన్ననూరి జెర్సీ తర్వాత తెరకెక్కించిన చిత్రం ఇదే. సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాత. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ అన్న పాత్రలో హీరో సత్యదేవ్ నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడా ?
Image Credit : X/Sithara Entertainments

విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడా ?

విజయ్ దేవరకొండ చివరగా నటించిన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరిగ్గా వర్కౌట్ కాలేదు. దీనితో అభిమానులు కింగ్డమ్ చిత్రం విజయ్ దేవరకొండకి సాలిడ్ కంబ్యాక్ మూవీ కావాలని ఆశిస్తున్నారు. ట్రైలర్, టీజర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మంచి బజ్ తో ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోల నుంచి కింగ్డమ్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ? ప్రీమియర్ షోలు చూస్తున్న ఆడియన్స్ ట్విట్టర్ లో ఈ చిత్రం గురించి ఏమంటున్నారు ? విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రంతో హిట్ కొట్టాడా లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

36
కింగ్డమ్ ట్విట్టర్ రివ్యూ
Image Credit : X/Sithara Entertainments

కింగ్డమ్ ట్విట్టర్ రివ్యూ

కింగ్డమ్ కథ బ్రిటిష్ టైం పీరియడ్ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది.ఫస్ట్ హాఫ్ బావుంది అంటూ నెటిజన్లు ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతున్నారు. తొలి 30 నిమిషాలు దర్శకుడు నెమ్మదిగా కథని బిల్డ్ చేస్తూ ఆ వరల్డ్ లోకి తీసుకువెళ్లాడు. విజయ్ దేవరకొండ ప్రతి ఫ్రేమ్ లో తన నటనతో కట్టిపడేస్తున్నాడు. 

46
విజయ్ మెచ్యూర్ యాక్టింగ్
Image Credit : X/Sithara Entertainments

విజయ్ మెచ్యూర్ యాక్టింగ్

విజయ్ దేవరకొండ గత చిత్రాల కంటే ఈ మూవీలో అతడి నటన కాస్త భిన్నంగా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ లో కూడా మార్పులు చూడొచ్చు. అనిరుద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయినట్లు ఆడియన్స్ చెబుతున్నారు. సత్యదేవ్, విజయ్ దేవరకొండ మధ్య ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయినట్లు చెబుతున్నారు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ పరిణితి చెందిన నటుడిగా మారినట్లు ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

56
మూవీలో హైలైట్స్ ఇవే
Image Credit : X/Sithara Entertainments

మూవీలో హైలైట్స్ ఇవే

కానీ సినిమా లెన్త్, స్లోగా సాగే నెరేషన్ మైనస్ అని చెబుతున్నారు. దర్శకుడు మంచి కథ ఎంచుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే అంతగా వర్కౌట్ కాలేదని అంటున్నారు. శ్రీలంక ఫారెస్ట్ నేపథ్యంలో సాగే కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగింది. టెక్నికల్ గా ఈ చిత్రం చాలా బావుంది. విజువల్స్, మ్యూజిక్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. 

66
ఓవరాల్ గా ఎలా ఉందంటే
Image Credit : X/Sithara Entertainments

ఓవరాల్ గా ఎలా ఉందంటే

సెకండ్ హాఫ్ కి కూడా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో బోట్ సన్నివేశం అద్భుతంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఓవరాల్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వానికి మరోసారి ప్రశంసలు దక్కుతున్నాయి.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
సినిమా సమీక్షలు
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image2
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Recommended image3
Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ
Related Stories
Recommended image1
నా భర్త, పిల్లలు నన్ను జడ్జ్ చేయరు.. ఆ బట్టలు వేసుకుంటే తల్లిగా బిహేవ్ చేయనట్లేనా, అనసూయ బోల్డ్ కామెంట్స్
Recommended image2
సినిమా చూడకుండా హరిహర వీరమల్లు రివ్యూ, నా అన్వేష్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా..దెబ్బకి నష్టాలు అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved