MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘లైగర్’ దెబ్బకు ట్రోలింగ్ మెటీరియల్ గా మారిన విజయ్ దేవరకొండ.. ‘జబర్దస్త్’లో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నరుగా?

‘లైగర్’ దెబ్బకు ట్రోలింగ్ మెటీరియల్ గా మారిన విజయ్ దేవరకొండ.. ‘జబర్దస్త్’లో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నరుగా?

‘లైగర్’ ఇచ్చిన ఫలితాలతో సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పరిస్థితి ఊహించని మలుపు తిప్పింది. విజయ్ ఇచ్చిన స్పీచ్ ను ఏకంగా ట్రోలింగ్ మెటీరియల్ గా మార్చుతున్నారు. తాజాగా జబర్దస్త్ కామెడీ షోలోనూ ఇదే కనిపించింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 10 2022, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ - స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘లైగర్’ (Liger). పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేశారు. రిలీజ్ కు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసినా.. రీచ్ కాలేక బోల్తా కొట్టింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దీంతో ఇటు పూరీ జగన్నాథ్ అభిమానులు, అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయ్యారు. మరోవైపు ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాను ఎక్స్ పెక్ట్ చేయలేదంటూ సినిమాపై దారుణంగా రివ్యూలు ఇచ్చారు. అయితే ‘లైగర్’ రిలీజ్ అయిన తొలిరోజు నుంచే విజయ్ పై, చిత్రంపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. మీమ్స్ కూడా ట్రెండ్ అయ్యాయి.
 

37

అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ స్పీచ్ ను ఓ రేంజ్ లో వాడుతున్నారు. విజయ్ అటిట్యూడ్, స్లాంగ్, స్పీచ్ ప్రస్తుతం ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది. ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ (Jabardasth)లోనూ తెగ వాడేస్తున్నారు. తాజాగా విజయ్ స్పీచ్ ను వాడటం గమనార్హం. లేటెస్ట్ ఎపిసోడ్ లో విజయ్ గతంలోని మాటలను రిపీట్ చేస్తూ స్కిట్ చేశారు.
 

47

కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ బుల్లెట్ భాస్కర్ (Bullet Baskar) లేటెస్ట్ ఎపిసోడ్ లో ‘లైగర్’ ప్రమోషన్స్ ను ఆధారంగానే స్కిట్ చేశాడు. హైదరాబాద్ లో నిర్వహించిన లైగర్ ప్రమోషన్స్ లో విజయ్ ఓ రేంజ్ లో స్పీచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘అరేయ్ ఏందీరా క్రేజ్.. మా తాత తెల్వదు, మా నాన్న తెల్వదు, ఎవ్వడు తెల్వదు.. అయినా ఇంత ప్రేమ ఇస్తున్నరు’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
 

57

ఈ కామెంట్స్ తో అదే సమయంలోనే విజయ్ పై పలువురు కాస్తా మండిపడ్డారు. తాజాగా ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ లేటెస్ట్ ఎపిసోడ్ లోనూ బుల్లెట్ భాస్కర్ విజయ్ కామెంట్స్ ను రిపీట్ చేశాడు. ‘మా అయ్యా ఆర్టిస్టు కాదు.. మా నాన్న ఆర్టిస్టు కాదు.. నేను ఆర్టిస్టు కాదు.. దీనమ్మ ఏందీ క్రేజ్’ అని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

67

మరోవైపు ఆర్టిస్టులు వర్ష ముంబయి హీరోయిన్ అనన్య పాండేలా స్పీచ్ ఇవ్వడం, ఇమాన్యుయెల్ కామన్ ఆడియెన్స్ లా సినిమాపై సెటైరికల్ గా పంచులు పేల్చడం ‘లైగర్’ సినిమా పరిస్థితిని సూచిస్తున్నాయి. ‘మ్యాట్నీ’ కల్లా సినిమా సర్దేస్తుందంటూ, పాన్ ఇండియా స్టార్ అంటూ ఆర్టిస్టులు చెప్పిన డైలాగ్ పై నెటిజన్లు కూడా ఇంట్రెస్టింగ్ గా స్పందిస్తున్నారు.
 

77

భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్’ ఫ్లాప్ ను మూటగట్టుకోవడంతో.. నిర్మాతలకు నష్టాలూ వచ్చి చేరాయి. ప్రస్తుతం పూరీ, ఛార్మీ వాటిని క్లియర్ చేసే పనిలోనే ఉన్నారు. మరోవైపు విజయ్ ‘జన గణ మన’ను పక్కనెట్టి.. ‘ఖుషి’ షూటింగ్ ను ప్రారంభించారు. మళ్లీ పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందోనన్నది ఆసక్తిగా మారింది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Heroines: సమంత ఈజ్‌ బ్యాక్‌, సాయిపల్లవి, శ్రీలీలకు షాక్‌.. రష్మిక, నయనతార, కాజల్ స్థానాలు ఇవే
Recommended image2
Raj Nidimoru: మా ఇద్దరి మధ్య భలే సింక్ కుదిరింది, సమంతపై రాజ్ నిడిమోరు ప్రశంసలు.. ఆమె సెల్ఫ్‌ మేడ్‌ యాక్టర్‌
Recommended image3
Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved