MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో ముచ్చటగా మూడో సినిమా, రౌడీ ఫ్యాన్స్ కు పండగే

విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో ముచ్చటగా మూడో సినిమా, రౌడీ ఫ్యాన్స్ కు పండగే

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్ మళ్లీ తెరపై సందడి చేయబోతోంది. . గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నా జంట ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 05 2025, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : Vijay Deverakonda, Rashmika Mandanna/ Facebook

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ ఇద్దరూ యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో నటించబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభమైందని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Image Credit : Vijay Devarakonda Rashmika

ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి హడావిడి లేకుండా, ఓపెనింగ్ జరిగిపోయిందని, ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైందని తెలుస్తోంది. కథ వినగానే రష్మిక వెంటనే అంగీకరించిందట. సినిమా కథకు సంబంధించి విశేషాలు కూడా ఆసక్తికరంగా మారాయి. సీనియర్ సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం 1854–1878 మధ్యకాలంలో బ్రిటిష్ పాలన నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందున్నట్టు సమాచారం. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడే పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నాడు. ఇది ఆయనకు పూర్తిగా కొత్త తరహా పాత్రగా ఉండనుందని తెలుస్తోంది.

Related Articles

Related image1
శోభన్ బాబుని 5000 కోట్లకు అధిపతిని చేసిన ఒక్క సలహా ఎవరిచ్చారో తెలుసా?
Related image2
500 కోట్లు వసూలు చేసిన సినిమా బడ్జెట్ కేవలం 14 కోట్లు, 3 ఏళ్లుగా ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తోన్న మూవీ
34
Image Credit : Instagram/ Rashmika

ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ప్రధానంగా నిలవనున్నాయి. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఇప్పటికే ట్యాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ సినిమాలతో వైవిధ్యమైన సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా ప్రత్యేకమైన స్క్రీన్‌ప్లే సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక విజయ్, రష్మిక కాంబినేషన్ గురించి మాట్లాడితే, 2018లో వచ్చిన గీత గోవిందం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ జంట తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా చేసింది. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయింది. అయినప్పటికీ, విజయ్–రష్మిక మధ్య ఉన్న కెమిస్ట్రీకి అప్పట్లో మంచి మార్కులు పడ్డాయి.

44
Image Credit : Instagram

ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ కలసి నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి , అంచనాలు రెండు భారీగా పెరిగాయి. సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండటంతో పాటు, కథ, పాత్రలు, దర్శకత్వం అన్నీ కలిపి టాలీవుడ్ గర్వించదగ్గ సినిమా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈసినిమాపై నిజానిజాలను టీమ్ ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి. ఇప్పటికే విజయ్, రష్మికల మధ్య సమ్ థింగ్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈసినిమాపై క్యారియాసిటీ జనాల్లో ఇంకాస్త ఎక్కువైపోయింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
శోభన్ బాబుని 5000 కోట్లకు అధిపతిని చేసిన ఒక్క సలహా ఎవరిచ్చారో తెలుసా?
Recommended image2
500 కోట్లు వసూలు చేసిన సినిమా బడ్జెట్ కేవలం 14 కోట్లు, 3 ఏళ్లుగా ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తోన్న మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved