శోభన్ బాబుని 5000 కోట్లకు అధిపతిని చేసిన ఒక్క సలహా ఎవరిచ్చారో తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన నటుడు శోభన్ బాబు, తన నటనా ప్రతిభతోనే కాదు, తన ఆర్థిక నియంత్రణతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. శోభన్ బాబు వేలకోట్లు సంపాదించడానికి ఒక్క సలహా ఉపయోగపడిందని మీకు తెలుసా? ఆ సలహా ఇచ్చింది ఎవరంటే?

శోభన్ బాబు ఆంధ్రా అందగాడు, సోగ్గాడు,అందాల నటుడు. తన అభిమానులు తనను హీరోగా మాత్రమే చూడాలని కోరుకున్న శోభన్ బాబు.. 60 ఏళ్ల తరువాత నటనకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆర్ధిక క్రమశిక్షణకు మారుపేరులా నిలిచిన శోభన్ బాబు, తను సినిమాల్లో సంపాదించిన ప్రతీ పైసా వ్యాపారంలో పెట్టాడు. అంతే కాదు ఆయన రియల్ ఎస్టేట్ ద్వారా తన బిజినెస్ ను విస్తరించి దాదాపు 5 వేల కోట్ల వరకూ ఆస్తులు సంపాదించారు. ఈవిషయాన్ని రాజకీయ నాయకుడు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు రీసెంట్ గా వెల్లడించారు. ఆయన శోభన్ బాబుపై ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ, ఆయనను వేల కోట్ల ఆస్తుల అధిపతిగా మార్చిన సీక్రేట్ సలహా గురించి మాట్లాడారు.
ఈవిషయాన్ని రాజకీయ నాయకుడు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు రీసెంట్ గా వెల్లడించారు. ఆయన శోభన్ బాబుపై ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ, ఆయనను వేల కోట్ల ఆస్తుల అధిపతిగా మార్చిన సీక్రేట్ సలహా గురించి మాట్లాడారు.రఘురామకు శోభన్ బాబుతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఇక ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, శోభన్ బాబుకు ప్రస్తుతానికి ఉన్న ఆస్తుల విలువ 4000 కోట్ల నుంచి 5000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.
ఈ అపార సంపద వెనుక ఒక సలహా ఉంది. శోభన్ బబు ఎదుగుదలకు ఆయన తండ్రి ఇచ్చిన ఒకే ఒక్క సలహా ప్రధాన కారణమని తెలిపారు. శోభన్ బాబుకు చిన్నప్పుడే ఆయన తండ్రి ఓ విషయాన్ని క్లియర్ గా చెప్పారు. “భూమి స్థిరంగా ఉంటుంది, జనాభా మాత్రం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి సంపాదించిన ప్రతీ రూపాయిని భూమి మీదే పెట్టు”అని శోభన్ బాబు తండ్రి చెప్పారని రఘురామ వెల్లడించారు. ఆయన సలహా వల్లే శోభన్ బాబు 5000 కోట్ల వరకూ సంపాదించగలిగారట.
ఈ మాటను జీవిత సూత్రంగా మార్చుకున్న శోభన్ బాబు, చిన్నదశలో పదివేల పారితోషికం తీసుకునే రోజుల్లోనూ, తదుపరి సినిమా అడ్వాన్స్‌తో భూములు కొనేవారట. ఈ అర్థశాస్త్ర విధానం ఆయనను సంపన్నుడిగా తీర్చిదిద్దిందని, అదే తీరును నటుడు మురళీ మోహన్ కూడా అనుసరించారని రఘురామ గుర్తు చేశారు. శోభన్ బాబు జీవితం నిబద్ధతకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. ఆయన సినిమా జీవితాన్ని వ్యక్తిగత జీవితం నుంచి పూర్తిగా వేరు చేసేవారట. ఇంట్లో ఒక్క సినిమా మ్యాగజైన్ కూడా ఉండదట. తన పిల్లలను సినిమాల్లోకి తీసుకురావాలన్న ఆలోచన కూడా చేయలేదని చెప్పారు.
నటుడు హరనాథ్ అందం, అభినయాన్ని చూసి భయపడ్డానని, కానీ ఆయన వ్యసనాల వల్ల ఆయన కెరీర్ ఎలా కోల్పోయారో చూసిన తరువాత మరింత జాగ్రత్తగా ఉండాలని శోభన్ బాబు భావించారని కూడా రఘురామ చెప్పినట్టు తెలిపారు. బయటకి పిసినారి అనే పేరు ఉన్నా, శోభన్ బాబు అనేక గుప్త దానాలు చేసేవారని రఘురామ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అంటే శోభన్ బాబుకు అపార గౌరవం ఉండేదని, తన కెరీర్ ఆరంభంలో ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఎన్నో అవకాశాలు వచ్చాయని ఆయన గుర్తుచేసుకున్నారు.