- Home
- Entertainment
- తాగి సెట్స్ కి వచ్చిన విజయ్ దేవరకొండ... మత్తులో డైలాగ్స్ చెప్పలేక పిచ్చి నవ్వులు ఏకంగా షూటింగ్ ఆపేసిన టీమ్
తాగి సెట్స్ కి వచ్చిన విజయ్ దేవరకొండ... మత్తులో డైలాగ్స్ చెప్పలేక పిచ్చి నవ్వులు ఏకంగా షూటింగ్ ఆపేసిన టీమ్
తాను తాగి షూటింగ్ సెట్స్ కి వెళ్లినట్లు విజయ్ దేవరకొండ స్వయంగా వెల్లడించాడు. మత్తులో డైలాగ్స్ మర్చిపోయి, పిచ్చి నవ్వులు నవ్వుతుంటే ఆ రోజు షూటింగ్ ఆపేశారని చెప్పుకొచ్చాడు.

Vijay Devarakonda
హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) డైనమిక్ హీరో అనడంలో సందేహం లేదు. పరిశ్రమలో గాడ్ ఫాదర్స్ లేకున్నా ఓ లెవెల్ ఆఫ్ ఆటిట్యూడ్ మైంటైన్ చేస్తూ ఉంటాడు. ఆయన డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్ చాలా ఇండిపెండెంట్, కాన్ఫిడెంట్ గా ఉంటుంది. లవ్, డ్రింకింగ్ వంటి పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకోవడానికి ఏనాడూ సంకోచించడు.
కాగా బాలీవుడ్ ఫేమస్ టాక్ షో కాపీ విత్ కరణ్ లేటెస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్స్ గా విజయ్ దేవరకొండ, అనన్య పాండే వెళ్లడం జరిగింది. అత్యంత బోల్డ్ షోగా పేరున్న కాఫీ విత్ కరణ్ విజయ్ దేవరకొండ ఎపిసోడ్ లో అనేక పర్సనల్ విషయాలు చర్చకు వచ్చాయి. లవ్, రిలేషన్, సెక్స్, నెపోటిజం, లింగ సమానత్వం వంటి బోల్డ్ టాపిక్స్ పై విజయ్ దేవరకొండ స్పందించారు. తన సమాధానాలు చెప్పారు.
ఈ క్రమంలో హోస్ట్ కరణ్ జోహార్.. తాగిన మత్తులో సెట్స్ కి ఎప్పుడైనా వెళ్ళావా? అని అడగడం జరిగింది. అలా జరిగిందని దేవరకొండ నిర్మొహమాటంగా చెప్పారు. ఓ సినిమా షూట్ ముందు రోజు బర్త్ డే పార్టీలో ఫుల్ గా తాగడం జరిగింది. ఆ హ్యాంగ్ ఓవర్ లో నెక్స్ట్ డే షూట్ కి వెళ్ళాను. అక్కడ కూడా రోల్ కోసం తాగడం జరిగింది. దీనితో నాకు ఎక్కువైపోయింది.
డైలాగ్స్ మరచిపోయాను, పిచ్చినవ్వులు నవ్వుతున్నాను. చేసేది లేక ఆరోజు షూట్ క్యాన్సిల్ చేశారు. అంతకు మించి పెద్దగా నష్టం జరగలేదు. అలా జరిగిపోయింది అంటూ సెట్స్ కి తాగెళ్ళిన తన అనుభవం అభిమానులతో విజయ్ దేవరకొండ పంచుకున్నారు. అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ మోడరన్ దేవదాసు రోల్ చేశాడు. వృతి రీత్యా డాక్టర్ అయిన అర్జున్ రెడ్డి రోజంతా తాగి, మత్తులో డాక్టర్ డ్యూటీ చేస్తూ ఉంటాడు.
నిజజీవితంలో కూడా తనకు ఆల్కహాల్ అలవాటు ఉందని విజయ్ దేవరకొండ ఓపెన్ గా తెలియజేశారు. హీరోగా ఎర్లీ స్టేజిలో ఉన్న విజయ్ దేవరకొండ తాగి సెట్స్ కి వెళ్లడం నిజంగా సాహసమే. తాగి షూట్ కి వెళ్లే హీరోలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అయితే విజయ్ దేవరకొండ లాంటి ఎదుగుతున్న హీరోలు ఇలా చేస్తే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కలదు.
ఇక విజయ్ దేవరకొండ నటించిన లైగర్(Liger) మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 25న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేస్తున్నాడు.
కాగా లైగర్ విడుదల కాకుండానే... పూరి దర్శకత్వంలో జనగణమన టైటిల్ తో మరో భారీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ మూవీలో విజయ్ కి జంటగా సమంత నటిస్తున్నారు.