విజయ్ దేవరకొండ-రష్మిక కలిసే ఉంటున్నారా? మరోసారి తెరపైకి అనుమానాలు!
రష్మిక మందాన-విజయ్ దేవరకొండ మధ్య ఏం నడుస్తుంది ఎవర్ ఎండింగ్ హాట్ టాపిక్. వాళ్ళు ప్రేమికులనే ప్రచారం జరుగుతుండగా కాదని ఖండిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి.
Vijay Devarakonda-Rashmika Mandanna
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కలిసి రెండు చిత్రాలు చేశారు. కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. రెండుసార్లు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ పలుమార్లు కెమెరా కంటికి చిక్కారు.
Vijay Devarakonda-Rashmika Mandanna
విజయ్ తో మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లినట్లు రష్మిక ఒప్పుకుంది కూడా. విజయ్ నాకు గుడ్ ఫ్రెండ్, అతనితో ట్రిప్ కి వెళితే తప్పేంటని ఆమె ఎదురు ప్రశ్నించారు. ఆమె విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులకు కూడా దగ్గరయ్యారు. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు, బర్త్ డే ఫంక్షన్స్ కి రష్మిక హాజరవుతారు. ఇదంతా స్నేహంలో భాగమే. మా మధ్య ఎఫైర్, లవ్ లేదని రష్మిక పలుమార్లు వెల్లడించారు. తమపై వచ్చే రూమర్స్ ని కూడా చదివి ఎంజాయ్ చేస్తానని రష్మిక ఓ సారి చెప్పారు.
Vijay Devarakonda-Rashmika Mandanna
జనాలు మాత్రం వాళ్ళది కేవలం ఫ్రెండ్షిప్ అంటే నమ్మడం లేదు. ఇటీవల విజయ్ దేవరకొండ ధరించిన షర్ట్ ని పోలిన షర్ట్ ధరించి రష్మిక కనిపించారు. దాంతో విజయ్ దేవరకొండ బట్టలు కూడా రష్మిక వాడేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.
Vijay Devarakonda-Rashmika Mandanna
వారు ఒకరి దుస్తులు మరొకరు వేసుకుంటున్నారు. ఇంత కంటే ఆధారం ఏం కావాలన్న వాదన వినిపించింది. తాజాగా మరోసారి ఎఫైర్ వార్తలకు బలం చేకూరింది. అసలు విజయ్ దేవరకొండ, రష్మిక కలిసే ఉంటున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. రష్మిక, విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు ఇందుకు కారణం అయ్యాయి.
Vijay Devarakonda-Rashmika Mandanna
విజయ్ దేవరకొండ తన ఇంటి ఆవరణలో దిగిన ఫోటోలు పోస్ట్ చేశారు. అలాగే రష్మిక పోస్ట్ చేసిన ఫోటోల బ్యాక్ గ్రౌండ్ చూస్తే అది విజయ్ ఇంట్లో దిగిన ఫోటోలని క్లారిటీ వచ్చింది. అంటే రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుందా? ఇద్దరు కలిసి ఉంటున్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Vijay Devarakonda-Rashmika Mandanna
తన మేకప్ ఆర్టిస్ట్ పెళ్ళికి హాజరైన రష్మిక హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలో విజయ్ ఇంట్లో స్టే చేసి ఉండొచ్చు. లేదా ఆమె విజయ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లి ఉండవచ్చు. అంత మాత్రాన ఇద్దరు కలిసి జీవిస్తున్నారని ప్రచారం చేయడం సరికాదని కొందరి వాదన.
rashmika mandanna
గతంలో రష్మిక అభిమానులతో వీడియో చాట్ చేస్తుండగా... ఫోన్ మాట్లాడుతున్న విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. దాంతో విజయ్-రష్మిక ఒకే హోటల్ గదిలో ఉన్నారన్న క్లారిటీ వచ్చింది. ఈ జంట ఓపెన్ కాకపోవడంతో కన్ఫ్యూషన్ కొనసాగుతుంది...