- Home
- Entertainment
- Vijay Devarakonda-Rashmika mandanna:పెళ్లికి సిద్ధమైన విజయ్ దేవరకొండ -రష్మిక... ముహూర్తం ఫిక్స్?
Vijay Devarakonda-Rashmika mandanna:పెళ్లికి సిద్ధమైన విజయ్ దేవరకొండ -రష్మిక... ముహూర్తం ఫిక్స్?
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)- రష్మిక మందాన త్వరలో తమ రిలేషన్ బయటపెట్టనున్నారా? ఏకంగా పెళ్లి ప్రకటన చేయనున్నారా? అవుననే అంటున్నాయి కొన్ని మీడియా వర్గాలు. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారని సదరు కథనాల సారాంశం.

విజయ్ దేవరకొండ, రష్మిక(Rashmika Mandanna)లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ జంటగా నటించిన గీత గోవిందం ఇండస్ట్రీని షేక్ చేసింది. భారీ బడ్జెట్ మూవీ రేంజ్ వసూళ్లు సాధించిన గీత గోవిందం నయా రికార్డ్స్ నమోదు చేసింది. ఈ మూవీలో విజయ్, రష్మిక కెమిస్ట్రీ అద్భుతంగా పండింది.
డియర్ కామ్రేడ్ అంటూ రెండోసారి జతకట్టిన ఈ జంట మరింతగా సిల్వర్ స్క్రీన్ పై కెమిస్ట్రీ పండించారు. లిప్ లాక్ సన్నివేశాల్లో ఇద్దరూ ఏమాత్రం మొహమాటం లేకుండా నటించారు. చాలా సహజంగా తెరపై పండిన ఆ సన్నివేశాల వెనుక... అసలు కారణం వేరే ఉందని టాలీవుడ్ వర్గాల బోగట్టా.
విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ డియర్ కామ్రేడ్ చిత్ర విడుదల నాటి నుండి వినిపిస్తున్నాయి. ఈ రూమర్లను బలపరిచేదిగా వాళ్ళ ప్రవర్తన కూడా ఉంది. రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి రష్మిక చాలా దగ్గరయ్యారు. విజయ్ పేరెంట్స్ తో రష్మిక చాలా క్లోజ్ అండ్ కంఫర్ట్ ఫీల్ అవుతారు.
దేవరకొండ ఫ్యామిలీలో జరిగే ప్రతి చిన్న వేడుకకు రష్మిక పనిగట్టుకొని హాజరవుతారు. తీరికలేని షెడ్యూల్స్ తో బిజీగా ఉండే రష్మిక ఆ ఇంట్లో బర్త్ డే పార్టీలకు కూడా హాజరవుతారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే జరుపుకునే ఫంక్షన్స్ లో రష్మిక ఒక్కరికే ఆహ్వానం ఉంటుంది.
ఇక ఈ ఏడాది న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ దేవరకొండ బ్రదర్స్ తో గోవాలో జరుపుకుంది రష్మిక. విజయ్ తో న్యూ ఇయర్ ని చాలా ప్రత్యేకంగా జరుపుకుంది. ఫ్యామిలీ గ్యాథరింగ్స్ పక్కనపెడితే విజయ్, రష్మిక డిన్నర్ డేట్స్, షాపింగ్స్ ఏకాంతంగా చేస్తారు. తరచుగా ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు.
ఒకటి రెండు సందర్భాల్లో విజయ్-రష్మిక తమ రిలేషన్ గురించి నోరు విప్పారు. మేము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. జనాలు, మీడియా మాత్రం వారి మాటలు నమ్మడం లేదు. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం రీత్యా... మీరు ప్రేమికులే అంటున్నారు.
తాజా మీడియా కథనాల ప్రకారం 2022 చివర్లో లేదా 2023 ప్రారంభంలో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం చేసుకోనున్నారట. విజయ్, రష్మిక మధ్య వివాహ చర్చలు కూడా జరిగాయట. ఈ పెళ్లి వేడుకను గ్రాండ్ గా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.
ప్రస్తుతం రష్మిక, విజయ్ తమ తమ చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ షూటింగ్ ఇటీవల కంప్లీట్ చేశారు. లైగర్ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. అనంతరం విజయ్ దర్శకుడు సుకుమార్ తో మూవీ ప్రకటించారు.
ఇక రష్మిక విషయానికి వస్తే ఆమె నటిస్తున్న హిందీ చిత్రాలు మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. శర్వానంద్ కి జంటగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదలకు సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ తో పుష్ప 2 త్వరలో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ వయసు 32 కాగా.. రష్మిక వయసు కేవలం 26 మాత్రమే.