- Home
- Entertainment
- Liger Digitalrights:విజయ్ దేవరకొండ క్రేజ్... భారీ ధరకు లైగర్ డిజిటల్ రైట్స్?.. ఇంతకీ ఎవరు దక్కించుకున్నారంటే!
Liger Digitalrights:విజయ్ దేవరకొండ క్రేజ్... భారీ ధరకు లైగర్ డిజిటల్ రైట్స్?.. ఇంతకీ ఎవరు దక్కించుకున్నారంటే!
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ఫేమ్ పాపులారిటీకి ఇది ఒక ఉదాహరణ. ఆయన లేటెస్ట్ మూవీ లైగర్ విడుదలకు నెలల సమయం ఉండగానే డిజిటల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయని సమాచారం అందుతుంది. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

లైగర్ మూవీతో విజయ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లైగర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం లైగర్. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
లైగర్ (Liger) షూటింగ్ పూర్తి కాగా... పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానుంది. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో లైగర్ విడుదల కానుంది. ఇక మొదటి కాపీ కూడా సిద్ధం కాకముందే లైగర్ కి ఓ భారీ ఆఫర్ తగిలింది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ ధర చెల్లించి లైగర్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందట.
లైగర్ చిత్రానికి మార్కెట్ లో ఉన్న బజ్ రీత్యా ఈ మూవీ కోసం ఓటిటి సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ. 60కోట్లు చెల్లించి లైగర్ డిజిటల్ రైట్స్ (Liger digital rights)సొంతం చేసుకుందట. ఈ మేరకు లైగర్ మేకర్స్ తో ఒప్పందం కూడా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో లైగర్ తెరకెక్కుతుంది. అంటే డిజిటల్ రైట్స్ ద్వారానే సగం పెట్టుబడి లాగేసినట్టే అని చెప్పాలి.
లైగర్ డిజిటల్ రైట్స్ న్యూస్ టాలీవుడ్ వర్గాలను విస్మయపరుస్తుంది. విజయ్ దేవరకొండ గత రెండును చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏమంత ప్రభావం చూపలేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ నెగటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కమర్షియల్ గా కూడా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ ఈ స్థాయిలో ఆ మూవీ డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవడం నిజంగా విశేషం.
Liger
ఈ మధ్య టాలీవుడ్ చిత్రాలకు బాలీవుడ్ లో మంచి ఆదరణ దక్కుతుంది. బాహుబలి సిరీస్ తో పాటు సాహో, పుష్ప వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి. లైగర్ మూవీకి అంత ధర పెట్టడానికి ఇది కూడా ఒక కారణం. అలాగే పూరి-విజయ్ కాంబినేషన్ పై మంచి హైప్ ఏర్పడింది.
దర్శకుడు పూరి జగన్నాధ్(Puri jaganndh).... బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ తెరకెక్కిస్తున్నారు. విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ గా నటిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. మెలోడీ కింగ్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి కెరీర్ లో అత్యధిక కాలం ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. కరోనా కారణంగానే షూటింగ్ ఆలస్యమైంది.