MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘ఫ్యామిలీ స్టార్’కలెక్షన్స్ ఎంత? దిల్ రాజు కు ఎంత నష్టం

‘ఫ్యామిలీ స్టార్’కలెక్షన్స్ ఎంత? దిల్ రాజు కు ఎంత నష్టం

ఈ సినిమా పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివిటీ వ్యాప్తి చెందడంతో కలెక్షన్స్ కి భారీ నష్టం వచ్చి పడింది. మొదటి రోజు నుంచే కలెక్షన్ విషయంలో ఎదురు దెబ్బ ఎదురుకుంది.

3 Min read
Surya Prakash
Published : Apr 16 2024, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
the family star telugu movie 10 day box office collection

the family star telugu movie 10 day box office collection


 
అనుకున్నట్లుగానే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘ది ఫ్యామిలీ స్టార్'(The Family Star)కలెక్షన్స్ పూర్తి స్దాయిలో డ్రాప్ అవుతూ వచ్చాయి. వీకెండ్ లో పికప్ కాలేదు. చూస్తుంటే శ్రీరామ నవమి కూడా పెద్దగా కలిసి వచ్చేలా కనపడటం లేదు. నిర్మాత దిల్ రాజు (Dil Raju)ప్రమోషన్స్ తో  మొదటి నుండి సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. కానీ ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. సో సో ఓపెనింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత, ఎంత కలెక్ట్ చేసింది. ఎంత నష్టం వచ్చిందనేది హాట్ టాపిక్ గా మారింది.

29

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ...‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకు రూ.41.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.41.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.16.98 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ 24.52 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

39


ట్రేడ్ టాక్ ప్రకారం అన్ని  లెక్కలు వేసుకుంటే పది కోట్లకు పైగా నష్టం ఖాయమని చెప్పుకుంటున్నారు. నిర్మాత  దిల్ రాజు సైతం ప్రమోషన్స్ ని ఆపేసారు.  దాంతో  శ్రీరామనవమితో పాటు  లాంగ్ వీకెండ్ వస్తున్నా ఎగ్జిబిటర్లు ఈ సినిమాపై హోప్ పెట్టుకోలేదు. ఈ సినిమాకన్నా ముందు రిలీజైన టిల్లు స్క్వేర్ వసూళ్లు మెరుగ్గా ఉండటం ఇక్కడ గమనించదగ్గ విషయం.  

49
Family Star Review

Family Star Review

ఈ సినిమా పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివిటీ వ్యాప్తి చెందడంతో కలెక్షన్స్ కి భారీ నష్టం వచ్చి పడింది. మొదటి రోజు నుంచే కలెక్షన్ విషయంలో ఎదురు దెబ్బ ఎదురుకుంది. అయితే మొదటి వారం పూర్తి అయ్యేపాటికీ కొంచెం పుంజుకున్నా లాభం లేకుండా పోయింది. కొత్త సినిమాల రిలీజ్ లతో ఈ మూవీకి దెబ్బ ఎదురైంది. 

59
Family Star Review

Family Star Review


మరో ప్రక్క ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోందనే వార్తలు వస్తున్నాయి.  అమెజాన్ ప్రైమ్ లో ఓటిటి ప్రీమియర్ కూడా అనుకున్న ముందే జరగొచ్చని చెప్పుకుంటున్నారు. రెగ్యులర్ గా ఉన్న  నాలుగు వారాల ఎగ్రిమెంట్  ప్రకారం మే 3 రావాలి. అలా కాకుండా మరో వారం అడ్వాన్స్ గా వచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. 

69
Family Star Review

Family Star Review


 విజయ్ దేవరకొండ కు ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదు. ఖుషీ తో ఒడ్డునపడతాడుకుంటే అదీ మొహం చాటేసింది. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీస్టార్ పై నమ్మకం పెట్టుకుంటే అదీ చీదేసింది. లైగర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ నేఫధ్యంలో విజయ్ దేవరకొండకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ లు చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్ ని,లైగర్ కలెక్షన్స్ ని పోల్చి చూపుతూ వేకప్ కాల్ వచ్చినట్లే జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చిందంటున్నారు.

79
Family Star Review

Family Star Review


విజయ్ దేవరకొండ కెరీర్లోనే డిజాస్టర్ గా మిగిలిపోయిన లైగర్ మూవీ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్లకుపైగా వసూలు చేసింది.ఫస్ట్ వీక్ అంతా చూసినా మొదటి రోజు లైగర్ కలెక్షన్స్ దగ్గరకు కూడా రాకపోవటం ట్రేడ్ కు షాక్ ఇచ్చింది.  మొత్తంగా ఫ్యామిలీ స్టార్ తెలుగు వెర్షన్ నెట్ కలెక్షన్లు రూ.16.83 కోట్లుగా ఉండగా..తమిళంలో వీకెండ్ మొత్తం కలిపి రూ.1.42 కోట్లు మాత్రమే వచ్చాయి.ఇండియా గ్రాస్ కలెక్షన్లు రూ.21.15 కోట్లుగా, ఓవర్సీస్ లో రూ.9.5 కోట్లు వచ్చాయి.  

89
Family Star Review

Family Star Review

ఈ నేపధ్యంలో గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ సినిమా స్క్రిప్టులో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా హిట్ కొట్టాల్సిన సిట్యువేషన్ లో విజయ్ ఒకటికి నాలుగు సార్లు స్క్రిప్టు చెక్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. జూన్ నుంచి గౌతమ్ తిన్ననూరి సినిమాను స్టార్ట్ చేస్తాడు విజయ్.
 

99
Family Star Review

Family Star Review


 పీరియాడిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు విజయ్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను శ్రీలంకలో ప్లాన్ చేశారు. దాదాపు 40శాతం షూటింగ్ ను అక్కడే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. లైగర్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ఖుషీ సినిమాతో కొంత తేరుకున్నప్పటికీ, అతడు ఆశించిన విజయాన్ని మాత్రం ఖుషీ అందించలేకపోయింది. అందుకే ఫ్యామిలీ స్టార్, గౌతమ్ తిన్ననూరి సినిమాలపై ఆశలు పెట్టుకున్నాడు విజయ్. ఫ్యామిలీస్టార్ కూడా దెబ్బ కొట్టడంతో గౌతమ్ మీదే పూర్తి డిపెండ్ అయ్యారు. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved