- Home
- Entertainment
- Pattudala Collections: 100 కోట్ల క్లబ్‌లోకి `పట్టుదల`, అజిత్ సినిమాకి బాక్సాఫీసు స్ట్రగుల్
Pattudala Collections: 100 కోట్ల క్లబ్‌లోకి `పట్టుదల`, అజిత్ సినిమాకి బాక్సాఫీసు స్ట్రగుల్
Pattudala Collections: అజిత్ నటించిన 'విడాముయార్చి' సినిమా మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, కేవలం నాలుగు రోజుల్లోనే కొత్త వసూళ్ల రికార్డు సృష్టించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ajith kumar
Pattudala Collections: నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ అజిత్ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఆ స్థానంలో `విడాముయర్చి` (పట్టుదల) సినిమాని చేశారు అజిల్.
ajith kumar
అజిత్ సినిమాల్లో మాస్ సన్నివేశాలతో పాటు ఒక మంచి సందేశం ఉండాలని కోరుకుంటారు. ఆయన లేటెస్ట్ గా నటించిన `విడాముయర్చి` చిత్రంలోనూ అలాంటి ఎలిమెంట్లని జోడించారు. ఆర్గాన్స్ అక్రమ రవాణా చూపించారు.
డిసెంబర్‌లో షూటింగ్ పూర్తి
అజిత్‌కి జోడీగా త్రిష నటించిన `పట్టుదల` సినిమా గతేడాది డిసెంబర్‌లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్, సరైన డేట్ కోసం వాయిదా వేశారు.
విడుదల తేదీ మార్పు
సంక్రాంతికే రావాల్సి ఉండగా, కానీ బిజినెస్ కారణాలతో వాయిదా పడినట్టు సమాచారం. మొత్తం 'విడాముయార్చి' ఈ నెల 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
విడాముయార్చి వసూళ్లు
'విడాముయార్చి' వసూళ్ల వివరాలు చూస్తే గురువారం విడుదలైన ఈ చిత్రానికి ప్రారంభం నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. సినిమాలో లవ్ ట్రాక్ బాగున్నా, ఆ తర్వాత సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. మన ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేవు. దీనికితోడు స్లోగానూ రన్ కావడం మరింత మైనస్‌గా నిలిచింది.
4 రోజుల్లో 100 కోట్లు
దీంతో సినిమా బాక్సాఫీసు వద్ద డీలా పడిపోయింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. నెగటివ్ టాక్‌తోనూ వంద కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. అయితే సోమవారం నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయినట్టు సమాచారం.
read more: Anasuya Ari Movie: అనసూయ సినిమాని ముందే చూసే ఛాన్స్.. అయితే ఈ పని చేయండి
also read: Ramya Krishnan: రమ్యకృష్ణ నెల సంపాదన ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్, స్టార్ హీరోలు కూడా జుజూబీనే