- Home
- Entertainment
- Vidaamuyarchi Collection Day 2: `విడాముయార్చి` రెండో రోజు కలెక్షన్లు.. అజిత్‌కి పెద్ద షాక్
Vidaamuyarchi Collection Day 2: `విడాముయార్చి` రెండో రోజు కలెక్షన్లు.. అజిత్‌కి పెద్ద షాక్
Vidaamuyarchi Collection Day 2: అజిత్, త్రిష కలిసి నటించిన `విడాముయర్చి` చిత్రానికి రెండో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మరి ఆ కథేంటో చూద్దాం.

విడాముయార్చి
Vidaamuyarchi Collection Day 2: అజిత్, త్రిష జంటగా నటించిన `విడాముయార్చి` మూవీ మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్‌ని తెచ్చుకుంది. ఈ సినిమా ఇటీవల కాలంలో అజిత్ సినిమాల ఓపెనింగ్స్ కంటే తక్కువగానే ఓపెనింగ్స్ సాధించడం గమనార్హం. మొదటి రోజు 26 కోట్లతో ప్రారంభమైన ఈ చిత్రం రెండవ రోజు 67% కంటే ఎక్కువ తగ్గి 8.75 కోట్లు సంపాదించింది.
విడాముయార్చి అడ్వాన్స్ బుకింగ్
ఇటీవలి కాలంలో సూర్య `కంగువ`, కమల్ హాసన్ `ఇండియన్ 2` వంటి ఇతర పెద్ద-టికెట్ చిత్రాలతో పోల్చితే అడ్వాన్స్ బుకింగ్స్ లో అంతగా తగ్గలేదు. `విడాముయార్చి` అజిత్ `తునివు` కంటే బాగా ప్రారంభమైంది, కానీ అది రెండవ రోజు ఎక్కువగా పడిపోయింది. అయితే, `తునివు` సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. అదే సమయంలో విజయ్ `వారిసు`తో బాక్సాఫీస్ వద్ద పోటీపడింది.
విడాముయార్చి
`విడాముయర్చి` మూవీ కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా లేదు. మన ఆడియెన్స్ కి ఎక్కేలా లేదు. అందుకే ఆ ప్రభావం ఫలితం పై పడింది. రెండో రోజు దారుణంగా పడిపోయింది. ఇది తెలుగులో `పట్టుదల` డబ్ అయ్యింది. తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం 15.11% ఆక్యుపెన్సీని కలిగి ఉంది. రెండో రోజు కేవలం రూ.35 లక్షలు వసూలు చేసింది, ఇది మొదటి రోజు సంపాదించిన 50 లక్షల కంటే కొంచెం తక్కువ. అయితే నిర్మాతలు ఈ మూవీని ప్రమోట్ చేయలేదు. దీంతో ఆ ప్రభావం కూడా గట్టిగా పడింది.
విడాముయార్చి
`విడాముయర్చి`లో అజిత్, త్రిషతోపాటు అర్జున్, రెజీనా, ఆరవ్‌లు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ మూవీకి తమిళంలో పెద్దగా పోటీ లేదు. అయినా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతుంది. మరి క్రమంగా పుంజుకుంటుందా? పడిపోతుందా అనేదిచూడాలి. కానీ ఇప్పటి వరకు కలెక్షన్లని బట్టి చూస్తే సోమవారం నుంచి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విడాముయార్చి
`వాలెంటైన్స్ డే` తర్వాతి వారం, తమిళ సినిమాలో ధనుష్ దర్శకత్వం వహించిన `నిలవుక్కు ఎనాడి ఎన్మెల్ కోబం`, ప్రదీప్ రంగనాథన్-అశ్వత్ మారిముత్తుల `డ్రాగన్` విడుదలవుతాయి. అవి వస్తే ఈ మూవీపై గట్టి ప్రభావం చూపిస్తాయని చెప్పొచ్చు.
read more: పాకిస్తాన్‌లో అల్లు అర్జున్ అభిమాని కోరిక నుంచి పుట్టిన `తండేల్`.. అసలేం జరిగిందంటే?
also read: `స్పిరిట్` విషయంలో సందీప్ రెడ్డి వంగా కండీషన్, ప్రభాస్ అయినా సరే ఆ రూల్ పాటించాల్సిందేనా?