MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Venkatesh Family Movies: వెంకటేష్ కెరీర్ లో టాప్ 6 ఫ్యామిలీ మూవీస్.. వీటిల్ని కొట్టే సినిమాలు ఉన్నాయా?

Venkatesh Family Movies: వెంకటేష్ కెరీర్ లో టాప్ 6 ఫ్యామిలీ మూవీస్.. వీటిల్ని కొట్టే సినిమాలు ఉన్నాయా?

వెంకటేష్ అంటే ఫ్యామిలీ సినిమాలకు బ్రాండ్. వెంకటేష్ సరైన కుటుంబ కథా చిత్రం చేస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. గతంలో ఇది చాలా సార్లు రుజువైంది. వెంకీ కెరీర్ లో అద్భుతమైన టాప్ 6 ఫ్యామిలీ మూవీస్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 31 2026, 07:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Venkatesh
Image Credit : Asianet News

Venkatesh

విక్టరీ వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడతారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కి ఉండే క్రేజ్ ఇతర టాలీవుడ్ హీరోలకు లేదు. అందుకే వెంకీ కూడా తన కెరీర్ లో ఎక్కువగా కుటుంబకథా చిత్రాలు చేస్తూ వచ్చారు. వెంకటేష్ చేసిన ఫ్యామిలీ మూవీస్ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేశాయి. వెంకటేష్ కెరీర్ లో టాప్ 6 బెస్ట్ ఫ్యామిలీ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
పవిత్ర బంధం
Image Credit : Asianet News

పవిత్ర బంధం

ఇది ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. భార్య భర్తల మధ్య అనుబంధాన్ని తెలియజేసే ఈ చిత్రం 1996లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో వెంకటేష్ తో పాటు సౌందర్య కూడా నట విశ్వరూపం ప్రదర్శించింది.

37
సూర్యవంశం
Image Credit : Asianet News

సూర్యవంశం

వెంకటేష్, మీనా జంటగా నటించిన మూవీ ఇది. భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకుడు. వెంకటేష్ డ్యూయెల్ రోల్ లో నటించారు. రెండు పాత్రల్లో వెంకటేష్ నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వినోదం, సెంటిమెంట్ రెండూ ఈ చిత్రంలో ఉంటాయి.

47
కలిసుందాం రా
Image Credit : stockPhoto

కలిసుందాం రా

ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ చిత్రం. వెంకటేష్, సిమ్రాన్ మధ్య కెమిస్ట్రీ, సాంగ్స్ అప్పట్లో యువతని ఊపు ఊపేశాయి. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే సన్నివేశాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

57
నువ్వు నాకు నచ్చావ్
Image Credit : Nuvvu Naaku Nachav

నువ్వు నాకు నచ్చావ్

ఇది ఒక స్పెషల్ మూవీ. కామెడీకి కొత్త అర్థం చెప్పిన సినిమా ఇది. ఇప్పటికీ బుల్లితెరపై, యూట్యూబ్ లో మోత మోగిస్తూనే ఉంటుంది. ఇది కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన అద్భుతమైన చిత్రం. వెంకటేష్ - ప్రకాష్ రాజ్ మధ్య కామెడీ సీన్లు, బ్రహ్మానందం కామెడీ, వెంకీ- ఆర్తి అగర్వాల్ కెమిస్ట్రీ ఈ మూవీలో హైలైట్ గా నిలిచాయి.

67
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
Image Credit : Seethamma Vakitlo Sirimalle Chettu

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ మల్టీస్టారర్ కుటుంబ కథా చిత్రం ఇది. వెంకటేష్, మహేష్ బాబు కలసి నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

77
సంక్రాంతికి వస్తున్నాం
Image Credit : our own

సంక్రాంతికి వస్తున్నాం

వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే ఎలా ఉంటుందో మరో సారి నిరూపించిన చిత్రం ఇది. ఈ మూవీ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల గ్రాస్ రాబట్టింది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Recommended image2
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Related Stories
Recommended image1
Kriti Sanon: టాలీవుడ్ లో ఆ హీరోతో నటించడమే నా డ్రీమ్, ఎందుకంటే.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
Recommended image2
Naga Chaitanya: ఎలాంటి పాటని ఎలా చేశావు బ్రో.. నాగ చైతన్య సాంగ్ తో నవ్వులే నవ్వులు, సోషల్ మీడియా షేకింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved