వెంకీని తక్కువగా అంచనా వేస్తే అంతే..సంక్రాంతి పోటీలో బాలయ్య రెండుసార్లు దెబ్బైపోయాడు
మూడు సార్లు సంక్రాంతికి బాలయ్య, వెంకటేష్ పోటీ పడ్డారు. 2 సార్లు వెంకటేష్ దే విక్టరీ కావడం విశేషం.
పుష్ప 2 తర్వాత బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ చిత్రాల హంగామా అంతగా లేదు. క్రిస్టమస్ సీజన్ ఓ చెప్పుకోదగ్గ చిత్రాలు రావడం లేదు. దీనితో ఇప్పుడు అందరి ఫోకస్ సంక్రాంతి చిత్రాలపైనే ఉంది. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఈ మూడు చిత్రాల్లో ఏ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది అనే ఉత్కంఠ నెలకొంది.
రాంచరణ్, బాలయ్య, వెంకీ ముగ్గురూ సంక్రాంతికి పోటీ పడడం ఇది రెండోసారి. గతంలో 2019లో వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎఫ్ 2 చిత్రాలు విడుదలయ్యాయి. రాంచరణ్, బాలయ్య నటించిన చిత్రాలు డిజాస్టర్ కాగా ఎఫ్ 2 మాత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది. అంతకు ముందు రెండుసార్లు బాలయ్య, వెంకీ సంక్రాంతికి పోటీ పడ్డారు.
2000 సంవత్సరం సంక్రాంతికి బాలయ్య వంశోద్ధారకుడు, వెంకటేష్ కలిసుందాం రా చిత్రాలు విడుదలయ్యాయి. వంశోద్ధారకుడు మెప్పించలేకపోయింది. కలిసుందాం రా చిత్రం మాత్రం వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అదే టైంలో విడుదలైన చిరంజీవి అన్నయ్య చిత్రం కూడా విజయం సాధించింది.
2001 సంక్రాంతికి బాలయ్య నరసింహ నాయుడు చిత్రంతో వచ్చారు. వెంకటేష్ దేవి పుత్రుడు చిత్రం కూడా రిలీజ్ అయింది. నరసింహ నాయిడు చిత్రం బాలయ్య కెరీర్ లో తిరుగులేని విజయం సాధించింది. దేవిపుత్రుడు వైవిధ్యమైన కాన్సెప్ట్ తో వచ్చి బోల్తా పడింది. మొత్తంగా మూడు సార్లు సంక్రాంతికి బాలయ్య, వెంకటేష్ పోటీ పడ్డారు. 2 సార్లు వెంకటేష్ దే విక్టరీ కావడం విశేషం.
అందుకే వెంకటేష్ ని తక్కువగా అంచనా వేయకూడదు అని నెటిజన్లు అంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు.