చిరంజీవికి కౌంటర్ ఇచ్చి తలపట్టుకున్న యంగ్ ప్రొడ్యూసర్.. రాజుగారి మొదటి పెళ్ళాం బావుంది అంటే అర్థం..
సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు చిత్రాల ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి.
సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు చిత్రాల ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు చిత్రాలకు నిర్మాత దిల్ రాజునే. డాకు మహారాజ్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి కూడా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కావడం విశేషం.
అంటే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూడు చిత్రాలు దిల్ రాజు చేతుల్లోనే ఉన్నాయి. ఈ చిత్రాల బిజినెస్ ని, థియేటర్స్ అడ్జెస్ట్ మెంట్ ని, టికెట్ ధరల్ని దిల్ రాజు ఎలా మేనేజ్ చేస్తారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. నిర్మాత నాగవంశీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే ఆయన ఉన్న విషయాన్ని ముక్కు సూటిగా మాట్లాడేస్తారు. ప్రెస్ మీట్ లలో ఆయన వేసే కౌంటర్లు వైరల్ అవుతుంటాయి. డాకు మహారాజ్ ప్రమోషన్ లో భాగంగా నాగవంశీ చేసిన కొన్ని కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.
Nagavamsi
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీని డాకు మహారాజ్ ని పోల్చుతూ నాగవంశీ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యేలా చేశాయి. చిరంజీవి అభిమానులు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు.. వాల్తేరు వీరయ్య కంటే అద్భుతంగా డైరెక్టర్ బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అంటూ నాగవంశీ వ్యాఖ్యానించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బాబీ తన గత చిత్రాలకంటే ఈ మూవీని బాగా తీశారు అని అంటే సరిపోయేది. కానీ చిరంజీవి పేరెత్తి పోల్చడం వివాదం అయింది. ఈ చిన్న వివాదంతో నాగవంశీ తలపట్టుకునే పరిస్థితి వచ్చింది.
దీని గురించి నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చుకున్నారు. నేను చెప్పిన మాటని అంతా తప్పుగా అర్థం చేసుకున్నారు అని నాగవంశీ అన్నారు. ఏ దర్శకుడు అయినా తన గత చిత్రం కంటే తదుపరి చిత్రం బెటర్ గా ఉండాలని ప్రయత్నిస్తారు. డాకు మహారాజ్ చిత్రానికి ఇంకా ఆడియన్స్ చూడలేదు. నేను చూశాను. కాబట్టి సినిమా ఎలా ఉందో చెప్పే క్రమంలో డైరెక్టర్ బాబీ వాల్తేరు వీరయ్య కంటే బెటర్ సినిమా చేశాడు అని చెప్పాను. దాని అర్థం వాల్తేరు వీరయ్య బాగాలేదు అని కాదు. బ్లాక్ బస్టర్ అయిన వాల్తేరు వీరయ్య చిత్రాన్ని బాగాలేదు అని నేనెందుకు అంటాను.
నేను స్వయంగా వాల్తేరు వీరయ్య చిత్రాన్ని 15 సార్లు చూశాను. రాజుగారి మొదటి పెళ్ళాం బావుంది అంటే రెండో పెళ్ళాం బాగాలేదు అని కాదు అంటూ ఫన్నీగా నాగవంశీ సెటైర్లు వేశారు. బాలయ్య కెరీర్ లో ఇంతవరకు చూడని విజువల్స్ డాకు మహారాజ్ లో ఉంటాయి. బాబీ కొత్త స్టైల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అని నాగవంశీ తెలిపారు.