MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • రెమ్యూనరేషన్‌ విషయంలో భానుమతికి మోసం.. ఎన్టీఆర్‌కి దిమ్మతిరిగే ఝలక్‌ ఇచ్చిన నటి..

రెమ్యూనరేషన్‌ విషయంలో భానుమతికి మోసం.. ఎన్టీఆర్‌కి దిమ్మతిరిగే ఝలక్‌ ఇచ్చిన నటి..

లెజెండరీ నటీమణి భానుమతి అంటే అప్పట్లో అందరికి హడల్‌. కానీ ఆమెని బురిడీ కొట్టించాలనుకున్నాడు ఎన్టీఆర్‌. ఆమె ఇచ్చిన ఝలక్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యిందట.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 31 2024, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తెలుగు తెరపై మొదటితరం నటీమణుల్లో భానుమతి ఒకరు. అప్పట్లోనే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీఆర్‌ లకు ధీటుగా రాణించిన నటి. ఇంకా చెప్పాలంటే లేడీ సూపర్ స్టార్‌గా అని పిలవొచ్చు. లెజెండరీ నటుల్లో నిలిచే భానుమతి అప్పట్లోనే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకు ధీటుగా పారితోషికాలు కూడా తీసుకునేది. కేవలం నటిగానే కాదు, దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో హోనర్‌గా, సింగర్‌గా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, రైటర్‌గా రాణించింది. మల్టీటాలెంటెడ్‌, జీనియన్‌ యాక్ట్రెస్‌ అని అంతా ప్రశంసించేవారు. అందుకే ఆమె సూపర్‌ స్టార్స్ ని మించిన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

భానుమతితో అంటే అంతా వణికిపోయేవాళ్లు. అందులో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌లు కూడా ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఓ సందర్భంలో భానుమతిని బురిడి కొట్టించాలనుకున్నారు ఎన్టీఆర్‌. ఇద్దరు కలిసి చేస్తున్న సినిమాకి పారితోషికం విషయంలో కుట్ర చేశారు. ఆమెకి తక్కువ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో విషయం తెలుసుకుని ఎన్టీఆర్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా చేసిందట భానుమతి. 
 

37

ఎన్టీఆర్‌, భానుమతి మధ్య జరిగిన ఓ గమ్మత్తైన విషయాన్ని పంచుకున్నారు సీనియర్‌ జర్నలిస్ట్ ఎస్వీ రామారావు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ అరుదైన విషయాలను షేర్‌ చేసుకున్నారు. భానుమతి అంటే అందరికి ఎలా దడ ఉండేదో చెబుతూ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని చెప్పాడు. ఎన్టీఆర్‌, భానుమతి కలిసి `తాతమ్మ కల` చిత్రంలో నటించారు. ఇందులో బాలకృష్ణ, హరికృష్ణ కూడా నటించారు. ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీకి డీవీ నరసరాజు రైటర్‌. 
 

47

ఇందులో భానుమతిని బామ్మ పాత్రకి తీసుకున్నారు. ముసలయ్యగా ఎన్టీఆర్‌ నటించారు. ఆయన డబుల్‌ రోల్‌ చేశారు. సినిమా జరుగుతుంది. పారితోషికం విషయాలు చర్చకు వచ్చాయి. భానుమతికి ఎంత పారితోషికం ఇవ్వాలనేది చర్చ. రైటర్‌ వెళ్లి భానుమతిని పారితోషికం గురించి అడిగారు. దీంతో ఆమె.. ఎన్టీఆర్‌కి ఎంత పారితోషికం ఇస్తారో అందులో ఐదు వేలు తగ్గించి ఇవ్వండి అని తెలిపింది. 
 

57

ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ వద్ద చెప్పారు రైటర్‌ నరసరాజు. దీంతో ఎలాగైనా భానుమతిని బురిడీ కొట్టించాలని ప్లాన్‌ చేశారు. ఎన్టీఆర్‌కి రెండు లక్షల పారితోషికం ఇస్తున్నారని చెప్పి, లక్షా తొంబై ఐదు వేల చెక్‌ రాసి పంపించారట. అది చూసిన భానుమతి.. ఆ అమౌంట్‌కి మరో ఐదు వేలు కలిపి రెండు లక్షలు చేసి ఆమె నెక్ట్స్ మూవీ `అమ్మాయి పెళ్లి`లో ఆయన్ని యాక్ట్ చేయమని చెప్పండి అని అన్నదట. దెబ్బకి ఇటు నరసరాజుకి, అటు ఎన్టీఆర్‌కి ఫ్యూజులు ఎగిరిపోయాయట. 
 

67

భానుమతి దెబ్బకి మైండ్‌ బ్లాక్‌ అయిన ఎన్టీఆర్‌ సచ్చినట్టు `అమ్మాయి పెళ్లిలో` అదే పారితోషికానికి నటించాల్సి వచ్చిందట. మాట చెప్పాం కదా, అసలు విషయం తెలిస్తే దొరికిపోతారు, పరువు పోతుందని, దీంతో మరో మాట లేకుండా ఆ సినిమాలో ఎన్టీఆర్‌ నటించాడట. అది భానుమతి దెబ్బ, ఆమెతో పెట్టుకుంటే అలా ఉంటుందని జర్నలిస్ట్ ఎస్వీరామారావు వెల్లడించారు. ఆమెతో పెట్టుకుంటే అంతే అని, అందుకే ఎవరూ ఆమెని టచ్‌ చేసే సాహసం చేసేవాళ్లు కాదని తెలిపారు. 
 

77

ఎన్టీఆర్‌, భానుమతి కలిసి ఎన్నో సినిమాలు చేశారు. ఇద్దరు జోడీగా నటించారు. అలాగే ఎన్టీఆర్‌కి అమ్మగా, బామ్మగా, ఇలా విభిన్న పాత్రల్లో ఆమె నటించి మెప్పించింది. వందకుపైగా సినిమాల్లో నటించింది. తెలుగులో సినిమాకి దర్శకత్వం వహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఆమె భారతీయ సినిమాకి అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. అలాగే ఆమె పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ని కూడా విడుదల చేయడం విశేషం.  
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Irumudi Day 2 Collections: రెండో రోజు ఇరుముడి కి దిమ్మతిరిగే కలెక్షన్లు, బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న రవితేజ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved