- Home
- Entertainment
- ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీకి వేణు స్వామి హెచ్చరిక.. స్టార్ కపుల్ భవిష్యత్ పై సంచనల వ్యాఖ్యలు..
ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీకి వేణు స్వామి హెచ్చరిక.. స్టార్ కపుల్ భవిష్యత్ పై సంచనల వ్యాఖ్యలు..
కోలీవుడ్ స్టార్ కపుల్ ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ ఇటీవల బంధువులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ అస్ట్రాలజర్ వేణు స్వామి మాత్రం వీరిద్దరి భవిష్యత్ ను హెచ్చరిస్తున్నారు.

ప్రముఖ అస్ట్రాలజర్ వేణు స్వామి యూట్యూబ్ లో బాగా ఫేమస్. పొలిటీషన్స్, సినీ స్టార్స్, పబ్లిక్ ఐకాన్స్ భవిష్యత్ పై జోస్యం చెబుతూ పాపులారిటీని దక్కించుకున్నాడు. ఆయన చెప్పిన వాటిలో కొన్ని జరగడంతో ఈయన జోస్యంపై అటు స్టార్స్, ఇటు పొలిటీషన్స్ కు నమ్మకం ఏర్పడింది.
గతంలో నాగ చైతన్య, సమంత (Samantha) విడిపోతారని కూడా వేణు స్వామి తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కు కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు తప్పవని కూడా వేణు స్వామి తెలిపారు. అలాగే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ జాతకంపైనా ‘రాధే శ్యామ్’ చిత్ర రిలీజ్ సమయంలో స్పందించారు.
అదేవిధంగా జూన్ 9న అత్యంత వైభవంగా వివాహాం చేసుకున్న కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార - విఘ్నేష్ శివన్ విషయంలోనూ గతంలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సమంత జీవితంలో జరిగిన ఘటనలే నయనతార జీవితంలో జరగబోతున్నాయని అందరినీ షాక్ కు గురిచేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మరోస్టార్ కపుల్ ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ భవిష్యత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా తమిళ హీరోయిన్ నిక్కీ గల్రానీ (Nikki Galrani)తో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ప్రేమలో మునిగితేలారు. వారిప్రేమ కాస్తా పెళ్లి పీటల వరకూ చేరుకుంది. ఈ ఏడాది మార్చిలో ఈ ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ జరగగా.. మే 18న గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకున్నారు.
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం వీరి దాంపత్య జీవితం సాఫీగానే కొనసాగుతోంది. అయితే ఉన్నట్టుడి ప్రముఖ అస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy) నవదంపతుల భవిష్యత్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ జతకాలను పోల్చి చూసి ఆశ్చర్యపరిచే విషయాలను బయటపెట్టారు.
ఆది పినిశెట్టిది ఆశ్లేష నక్షత్రమని, నిక్కీ జతాకంతో పోల్చితే షష్టాష్టకాలు అవుతున్నాయని వెల్లడించారు. ఈ జాతకాల ప్రకారం.. వీరికి పెళ్లి తర్వాత సమస్యలు తప్పవన్నారు. అసలు వీరు పెళ్లికి దూరంగా ఉంటేనే ఇద్దరికి మంచిదని హెచ్చరించారు. ప్రేమ అనే మైకంలో పెళ్లి చేసుకుంటున్నారని, కానీ భవిష్యత్ పరిణామాలపై ఫోకస్ పెట్టడం లేదని అభిప్రాయపడ్డారు.
జాతకాల ద్వారా విశ్లేషణ చేసి పరిహారాలు చేసుకోగలితే ఫలితం తప్పకుండా ఉంటుందని సూచించారు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ భవిష్యత్ గురించి తనకు చాలా అవగాహన ఉందని, అందుకే చెప్పాల్సి వచ్చిందన్నారు. అంతేకానీ వారు విడిపోవాలనే ఉద్దేశం తనకేమీ లేదని, మున్ముందు వచ్చే సమస్యలను దూరం చేసుకోగలిగితే సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని తెలిపారు. ప్రస్తుతం వేణు స్వామి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.