MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు శిరీష్ బ్రేకప్ లవ్ స్టోరీ, గతంలో ఎన్నిసార్లు ప్రేమలో పడ్డాడంటే?

అల్లు శిరీష్ బ్రేకప్ లవ్ స్టోరీ, గతంలో ఎన్నిసార్లు ప్రేమలో పడ్డాడంటే?

మార్చ్ 6న ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు అల్లువారబ్బాయి శిరీష్. పెళ్లికి ముందు ఈయంగ్ హీరో ఎన్నిసార్లు ప్రేమలో పడ్డాడో తెలుసా? అల్లు శిరీష్ బ్రేకప్ లవ్ స్టోరీ ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 17 2026, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెళ్లి పీటలెక్కబోతున్న అల్లు శిరీష్..
Image Credit : instagram

పెళ్లి పీటలెక్కబోతున్న అల్లు శిరీష్..

టాలీవుడ్ యంగ్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గత మూడేళ్లుగా తాను ప్రేమించిన నయనికతో శిరీష్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చ్ 6న వీరి పెళ్లి గ్రాండ్ గా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వీరి పెళ్లి పనులు మొదలయ్యాయి. రీసెంట్ గా పసుపు దంపుడు కార్యక్రమంతో పనులు మొదలు పెట్టి.. మొదటి పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందించారు. మిగిలిని కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అల్లు శిరీష్ లవ్ స్టోరీ..
Image Credit : Asianet News

అల్లు శిరీష్ లవ్ స్టోరీ..

వరుణ్ తేజ్ పెళ్లితో మొదలయ్యింది అల్లు శిరీష్ లవ్ స్టోరీ. వరుణ్ తేజ్ భార్య.. హీరోయిన్ లావణ్య త్రిపాటి స్నేహితురాలు కావడం.. పెళ్లిలో మొదలైన పరిచయం.. ప్రేమగా మారి.. పెళ్లి వరకూ వచ్చింది. దాదాపు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటవబోతున్నారు.

ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ గతంలో వెల్లడించిన ఒక ప్రేమకథ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గతంలో ఆయన ప్రేమలో పడటం బ్రేకప్ చెప్పండ గురించి పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు.

35
బ్రేకప్ లవ్ స్టోరీ..
Image Credit : Instagram/allu sirish

బ్రేకప్ లవ్ స్టోరీ..

అల్లు శిరీష్ పలు ఇంటర్వ్యూలలో తన లవ్ బ్రేకప్ గురించి ప్రస్తావించారు. గతంలో ఆయన ఓ పెద్దింటి అమ్మాయితో ప్రేమలో పడ్డినట్టు ఒప్పుకున్నారు. అప్పుడు కొన్ని పరిణామాల వల్ల బ్రేకప్ జరిగి చాలా బాధపడ్డానన్నారు. అందులోంచి బయటపడటానికి చాలా రోజులు టైమ్ పట్టిందన్నారు శిరీష్. అయితే అంతకు ముందు కూడా శిరీష్ ప్రేమలో పడ్డారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాడట. కానీ అప్పుడు బ్రేకప్ చెప్పడం పెద్ద ఇబ్బందిగా అనిపంచలేదని ఆయన అన్నారు.

45
కాలేజీ రోజుల్లో శిరీష్ లవ్ స్టోరీ..
Image Credit : Asianet News

కాలేజీ రోజుల్లో శిరీష్ లవ్ స్టోరీ..

గతంలో అల్లు శిరీష్ ప్రముఖ యాంకర్ ప్రదీప్ నిర్వహించిన కొంచెం టచ్ లో ఉంటే చెపుతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తన చదువుకునే రోజులలో జరిగిన ప్రేమకథ గురించి వివరించారు. శిరీష్ మాట్లాడుతూ, తాను ముంబైలో చదువుకుంటున్న సమయంలో ఒక మోడల్‌ను ప్రేమించానని తెలిపారు. 

ఆమె వీకెండ్‌లలో తరచూ పబ్‌లు, పార్టీలకు తీసుకెళ్లేదని చెప్పారు. అటువంటి అవుటింగ్స్‌కి వెళ్లినప్పుడు నాలుగు నుండి ఐదు వేల రూపాయలు ఖర్చవుతాయని పేర్కొన్నారు. ఆమె ముందు తన స్థాయిని తగ్గించుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో డబ్బు అవసరమయ్యేదని వెల్లడించారు.

55
ఖర్చులు భరించలేక బ్రేకప్..
Image Credit : Instagram/allu sirish

ఖర్చులు భరించలేక బ్రేకప్..

డబ్బుల కోసం ఇంటికి ఫ్లైట్‌లో వస్తానని చెప్పి 8,000 రూపాయలు తీసుకుని, వాస్తవానికి బస్సులో వెళ్లి రావడం ద్వారా కేవలం 1,500 రూపాయలతో ప్రయాణం పూర్తి చేసేవాడినని చెప్పారు. మిగిలిన డబ్బును గర్ల్‌ఫ్రెండ్‌ను మెయింటైన్ చేయడానికి ఖర్చు చేసేవాడినని తెలిపారు. అయితే ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు భరించలేక ఆరు నెలలకే ఆ సంబంధం ముగిసిందని వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
రాజమౌళి ఫ్యామిలీలో పెత్తనం ఎవరిది, తేడా వస్తే తాట తీస్తారని జక్కన్న చెప్పింది ఎవరి గురించి?
Recommended image2
చిరంజీవి రిటైర్మెంట్ తరువాత ఎక్కడ ఉండబోతున్నారు? మెగాస్టార్ మెచ్చిన సిటీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved