- Home
- Entertainment
- అందుకే నరేష్ పెళ్లి నా చేతుల మీదుగా చేయలేదు, చెప్పినా వినలేదు.. విడాకులు, చావు అంటూ వేణు స్వామి కామెంట్స్
అందుకే నరేష్ పెళ్లి నా చేతుల మీదుగా చేయలేదు, చెప్పినా వినలేదు.. విడాకులు, చావు అంటూ వేణు స్వామి కామెంట్స్
టాలీవుడ్ లో జాతకాల ప్రస్తావన గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది. ఏ సెలెబ్రటీ జాతకం ఎలా ఉంది అంటూ కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు.

టాలీవుడ్ లో జాతకాల ప్రస్తావన గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది. ఏ సెలెబ్రటీ జాతకం ఎలా ఉంది అంటూ కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు. సంచలన వ్యాఖ్యలతో, వివాదాలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా వేణు స్వామి నటుడు నరేష్ వైవాహిక జీవితంలో నెలకొన్న వివాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వేణు స్వామి తరచుగా యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతూ తాను చెప్పినవి ఎక్కువగా జరుగుతున్నాయని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆ మధ్యన తాను చెప్పిన విధంగానే నాగ చైతన్య, సమంత విడిపోయారని పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల పాటు రాజకీయాల్లో ఇబ్బంది పడతారని కూడా చెప్పినట్లు వేణు స్వామి పేర్కొన్నారు.
తాజాగా ఆయన నటుడు నరేష్ ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేష్ ఫ్యామిలీకి తాను బాగా క్లోజ్ అని పేర్కొన్నారు. నరేష్ ఇంట్లో ఏ వ్రతం జరిగినా నేనే చేస్తాను. అలాగే వాళ్ళ ఫ్యామిలిలో అందరి జాతకాలు చెప్పాను. నరేష్ ఫ్యామిలిలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నాకు ముందే తెలుసు అని వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కృష్ణ గారి ఇంట్లో నేను రెగ్యులర్ గా పూజలు చేస్తుంటాను. 2014లో ఓ వ్రతం కోసం కృష్ణ గారి ఇంటికి వెళ్లాను. వ్రతం పూర్తయ్యాక కృష్ణ, విజయనిర్మల జాతకాలు చూశాను. జాతకం ప్రకారం 2020లోపు మీరు ఫ్యామిలిలో ఒకరు మరణిస్తారు అని ఆమెకి చెప్పాను. వారు భయపడాలని నేను ఎలా చెప్పలేదు. జాతకంలో ఉన్న విషయాన్ని హెచ్చరించాను. కానీ విజయనిర్మల గారు చాలా భయపడ్డారు.
నేను చెప్పిన విధంగానే ఆమె మరణించారు. అదే సమయంలో నరేష్, రమ్య రఘుపతి వివాహానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడు వాళ్ళిద్దరి జాతకాలు చూశాను. వీళ్లిద్దరి జాతకాలు కలవలేదని.. పెళ్లి జరిగినా విడాకులు అవుతాయని చెప్పాను. అప్పుడు నరేష్ కూడా అక్కడే ఉన్నారు.
నా మాట వినకుండా జాతకాలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. అది వారి వ్యక్తిగతం. వారిద్దరూ విడిపోతారని నాకు తెలుసు.. అందుకే వారి పెళ్లి నా చేతుల మీదుగా చేయలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నాం కదా అని వేణు స్వామి అన్నారు. నేను ఓపెన్ గా చెప్పడంతో వారు నన్ను దూరం పెట్టారు. అప్పటి నుంచి నరేష్ ఇంటికి నేను వెళ్లడం లేదు అని వేణు స్వామి అన్నారు.
రమ్యరఘుపతి, నరేష్ మధ్య ప్రస్తుతం తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు. ఈ గొడవలో సీనియర్ నటి పవిత్ర లోకేష్ మరింత చిచ్చు రాజేసింది. పవిత్ర లోకేష్, నరేష్ ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నారు.