ఎన్టీఆర్ కి ఉన్న దోషాన్ని రహస్యంగా ఉంచారు.. డైరెక్ట్ గా వాళ్ళ అమ్మగారికి చెప్పా, భయపెడుతున్న వేణు స్వామి
ఇక వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి తరచుగా ఎన్టీఆర్ జాతకాన్ని కూడా పైకి తీసుకువస్తుంటారు. తారక్ కి రాజయోగం ఉందని వేణు స్వామి పలు సందర్భాల్లో తెలిపారు.
తాతగారి వారసత్వానికి ఏమాత్రం తక్కువ కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనలో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో తారక్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తారక్ వార్ 2 చిత్రంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా నటించాల్సి ఉంది.
yamadonga
ఇక వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి తరచుగా ఎన్టీఆర్ జాతకాన్ని కూడా పైకి తీసుకువస్తుంటారు. తారక్ కి రాజయోగం ఉందని వేణు స్వామి పలు సందర్భాల్లో తెలిపారు. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది.కొన్నిసార్లు తాను చెప్పిన జాతకాలు బెడిసి కొట్టి ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నారు.
అయితే తాజాగా మరోసారి వేణు స్వామి ఎన్టీఆర్ జాతకం గురించి మాట్లాడి ఫ్యాన్స్ ని కంగారు పెట్టేశాడు. ఆయన చెబుతున్న ఒక విషయం భయపెట్టే విధంగానే ఉంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో నేను ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ గారు షాలిని కూర్చుని మాట్లాడుకున్నాం. అప్పటికే ఎన్టీఆర్ జాతకాన్ని నేను చాలా సార్లు చెప్పా.
తిరుమల ఆలయంలో ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగారు. తారక్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఆ దోషం తెలియకుండానే తారక్ జాతకం అంత కరెక్ట్ గా ఎలా చెబుతున్నారు అని ప్రశ్నించింది. ఆ సమస్య ఏంటో నాకు తెలుసు తల్లి అని.. తారక్ కి ఉన్న పుట్టుక దోషం గురించి చెప్పా. ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆ దోషం గురించి నాకు, తారక్ కి, పెద్ద ఎన్టీఆర్ కి మాత్రమే తెలుసు. నాలుగో వ్యక్తికి తెలియదు. అలాంటిది మీకు ఎలా తెలుసు అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు వేణు స్వామి అన్నారు. నాకు అన్ని విషయాలు తెలుసు అమ్మా అని చెప్పా. అయితే ఆ సమస్య ఏంటనేది వేణు స్వామి బయట పెట్టలేదు.
జూ. ఎన్టీఆర్ ది మకా నక్షత్రం. జయలలిత గారిది కూడా అదే నక్షత్రం. కానీ తారక్ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉంది. 2030 వరకు తారక్ ని రాజకీయాల్లోకి రానివ్వకండి అని వాళ్ళ అమ్మగారికి చెప్పినట్లు వేణు స్వామి తెలిపారు.
అయితే తారక్ కి ఉన్న ఆ దోషం ఏంటి ? అంత రహస్యంగా ఎందుకు ఉంచారు అనే చర్చ మొదలైంది. వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానుల్లో కంగారు పెంచుతున్నాయి. ఎన్టీఆర్ కి ఉన్న దోషం కారణంగా ఏం జరగబోతోంది అనే విషయాలేవీ వేణు స్వామి ప్రస్తావించలేదు.