‘నేను చెప్పిందే జరిగింది’.. ప్రభాస్ జాతకంపై వేణు స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) జాతకంపై సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆధారాలు చూపిస్తూ మరీ స్పందించడం ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా క్రేజ్ ను పెంచుతూ పోతున్నారు మన డార్లింగ్ ప్రభాస్. ‘బాహుబలి’, ‘సలార్’ Salaar.. త్వరలో రాబోతున్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ వంటి చిత్రాలతో వరల్డ్ వైల్డ్ గా మరింతగా పాపులారిటీని దక్కించుకుంటున్నారు.
సౌత్ లోనే కాదు... ఇండియా మొత్తంలోనే హాలీవుడ్ కటౌట్ అంటే డార్లింగ్ పేరు వినిపించేలా చేశారు మన యంగ్ రెబల్ స్టార్. కెరీర్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అదరగొడుతున్నారు. కానీ ఆయా చిత్రాలు మాత్రం ఆశించిన మేర ఫలితానివ్వడం లేదు.
వరల్డ్ వైడ్ క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్ కూ డిజాస్టర్లు తప్పడం లేదు. రీసెంట్ గా మాత్రం ‘సలార్’తో మంచి సక్సెస్ అందుకున్నారు... అయితే డార్లింగ్ జాతకం ఏమీ బాగోలేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని సెలెబ్రెటీ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి కామెంట్స్ చేశారు.
Prabhas
ఇప్పటికే వేణు స్వామి ప్రభాస్ సినిమాలు, ఆయన ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘సలార్’పైనా జ్యోతిష్యం చెప్పారు. కానీ కాస్తా రివర్స్ అయ్యింది. అయినా తను చెప్పినట్టే జరుగుతోందని వేణు స్వామి మరోసారి స్పందించారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ... ‘ప్రభాస్ సినిమాల విషయంలో నేను చెప్పినట్లే జరిగింది. ఆదిపురుష్ ఫ్లాప్ అని చెప్పాను. అలాగే జరిగింది. సలార్.. ఫ్యాన్స్ తప్ప ఎవరు చూడరని చెప్పాను చివరు అదే అయ్యింది. ఇప్పుడు కూడా చెబుతున్నాను.
Venu swamy
ప్రభాస్ జాతకం అస్సలు ఏమాత్రం బాలేదు. భారతదేశంలోనే నాలా చెప్పే వారులేరు’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వేణు స్వామి కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారాయి. ఇక దీనిపై మళ్లీ డార్లింగ్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.