Brahmamudi: కావ్య చెయ్యి కాల్చేసిన రాజ్.. రాహుల్ తో వెన్నెల పెళ్లి?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. మోసం చేసిన వ్యక్తిని పదేపదే నమ్ముతున్న ఒక ప్రేమికురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు మారిపోయావు ఇన్నాళ్ళు లేనిది నన్ను లెక్కలు అడుగుతున్నావు అంటాడు రాహుల్. నేను అడుగుతున్నది లెక్కలు కాదు వివరణ. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను ఇది మన ఇద్దరికీ సంబంధించిన సంపద కాదు అంటాడు రాజ్. నువ్వు బాగా మారిపోయావు రాజ్.ఎవరి మాటలో నమ్మి నన్ను అపార్థం చేసుకుంటున్నావు.
నేను ఇంతకుముందు ఇంతకన్నా ఎక్కువే ఖర్చు పెట్టాను అయినా ఏ రోజు నన్ను లెక్కలు అడగలేదు నువ్వు మారిపోయావు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాహుల్. నేను అడిగినదానికి వాడు చెప్పిందానికి ఏమైనా సంబంధం ఉందా అంటూ కన్ఫ్యూజ్ అవుతాడు రాజ్. మీకు అనుమానం వచ్చింది నిలదీశారు అతని దగ్గర సమాధానం లేదు తప్పించుకున్నాడు రెండిటికి సంబంధం ఉంది.
మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు అంటుంది కావ్య. మరోవైపు అప్పు కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది. నువ్వు చేసినప్పుడు బిజీగా ఉన్నాను విషయం ఏంటి అని అడుగుతుంది. మీ కావ్య అక్క స్వప్న కథ ఏదో మాట్లాడాలంట నువ్వు ఫోన్ మీ స్వప్న అక్కకి ఇవ్వు నేను ఫోన్ మీ కావ్య అక్కకి ఇస్తాను అంటాడు కళ్యాణ్. ఫోన్ తీసుకెళ్లి స్వప్న కి ఇస్తుంది అప్పు.
కళ్యాణ్, కావ్యకి ఫోన్ ఇచ్చి విషయం చెప్తాడు. కావ్య, స్వప్నతో రాహుల్ నిన్ను మోసం చేస్తున్నాడు అంటుంది. మరో అమ్మాయితో పెళ్లికి ఒప్పుకున్నాడా ఇప్పుడు నేను వచ్చి ఆ ఇంట్లో నిలదీయాలా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది స్వప్న. నాకు రాహుల్ అంతా చెప్పాడు ఎందుకు నేనంటే నీకు ఎందుకు అంత జలస్.
నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వవా అంటూ కావ్యని కసురుకొని ఫోన్ పెట్టేస్తుంది. మీ అన్నయ్య కి సాక్షాలు కావాలి మా అక్కకి అబద్ధాలు కావాలి వీళ్ళిద్దరి నమ్మకాన్ని రాహుల్ వాడుకుంటున్నాడు అని కళ్యాణ్ కి చెప్పి బాధపడుతుంది కావ్య. మరోవైపు అరుంధతి అరుంధతి కూతురు అపర్ణ ఇంటికి వస్తారు. పరిచయాలు అయిన తర్వాత కావ్య టీ తీసుకొస్తుంది. టీ చాలా బాగుంది అని మెచ్చుకుంటుంది అరుంధతి.
ఈరోజుల్లో ఇలాంటి సర్వెంట్ మీద దొరకడం చాలా అదృష్టం అంటూ ఆమెకి కొంత మనీ ఇవ్వబోతుంది. నిజం చెప్పటానికి ప్రయత్నిస్తారు చిట్టి, రాజ్. వద్దని వారిస్తుంది అపర్ణ. కానీ రుద్రాణి ఊరుకోకుండా నిజం చెప్తుంది. తన తప్పు తెలుసుకుని కావ్యకి క్షమాపణ చెప్తారు అరుంధతి, వెన్నెల. ఏం పర్వాలేదు నేనేమీ అనుకోను స్నాక్స్ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది కావ్య.
నీ భార్యని బయట వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు చేస్తుంటే నువ్వు ఏమి మాట్లాడలేదు ఇదేమి బాగోలేదు అంటూ రాజ్ ని మందలిస్తుంది అరుంధతి. ఆ మాటలకి హర్ట్ అవుతాడు రాజ్. నేరుగా కావ్య దగ్గరకు వెళ్లి ఎందుకు ఇలాంటి చీరలు కట్టుకుంటున్నావు నేను ఇచ్చిన చీరలు కట్టుకోవచ్చు కదా అంటాడు. మీరు మీ స్టేటస్ కోసం మా చీరలు కొన్నారు ఎప్పుడైతే ప్రేమతో మీ భార్య కోసం కొంటారో అప్పుడే ఆ చీరలు కట్టుకుంటాను అంటుంది కావ్య.
అది వచ్చే జన్మకి కూడా జరగదు అంటాడు రాజ్. అలా మాటల్లో కావ్య చేయి పట్టుకోబోతే అనుకోకుండా కావ్య చేయి కాలిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మి ఇంట్లో మనుషులకి మరీ దయాదాక్షి నేను లేకుండా పోతున్నాయి అంటూ కావ్య చేతికి ఆయింట్మెంట్ రాస్తుంది. నేనేమీ కావాలని చేయలేదు పిన్ని కావాలంటే మీరే అడగండి అంటాడు రాజ్.
అంటే నాకు నేనే కాల్చుకున్నానా అంటుంది కావ్య. ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది లేదంటే పెద్ద పంచాయతీ పెట్టేదాన్ని అంటుంది ధాన్యలక్ష్మి. మరోవైపు స్వప్న ని పెళ్లి చేసుకుంటానంటూ స్వప్న ఫ్రెండ్ అరుణ్ వస్తాడు. నిన్ను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు అంటుంది స్వప్న. ఆ దృష్టితో చూడకుండానే వాడితో అన్ని కొనిపించుకున్నావా అంటూ నిలదీస్తుంది అప్పు.నిన్ను చేసుకునే ఉద్దేశం నాకు లేదు అంటుంది స్వప్న.
నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అంటూ అరుణ్ ని కూర్చొని ఉంటుంది కనకం. ఇతనిని కాదనటానికి ఇంట్లో వాళ్లకి కారణాలు లేవు అర్జెంటుగా రాహుల్ తో మాట్లాడి ఏదో ఒకటి తేల్చుకోవాలి అని లోపలికి వెళ్ళిపోతుంది స్వప్న. తరువాయి భాగంలో వెన్నెలని రాహుల్ కి ఇవ్వటానికి ఇష్టపడుతున్నట్లుగా చెప్తుంది అరుంధతి. మా అమ్మాయిని చేసుకోవడం నీకు ఇష్టమేనా అని రాహుల్ ని అడుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందో రేప్ ఎపిసోడ్ లో చూద్దాం.