- Home
- Entertainment
- Janaki kalaganaledu: జానకి ఐపీఎస్ చదవకపోవడానికి కారణం తెలుసుకున్న రామచంద్ర.. ఏ నిర్ణయం తీసుకోనున్నాడు?
Janaki kalaganaledu: జానకి ఐపీఎస్ చదవకపోవడానికి కారణం తెలుసుకున్న రామచంద్ర.. ఏ నిర్ణయం తీసుకోనున్నాడు?
Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామచంద్ర (Ramachandra) ఐపీఎస్ అవుతాను అని జానకి ను మాటివ్వమని అడుగుతాడు.

దాంతో జానకి (Janaki) చదువు విషయంలో జ్ఞానాంబ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని అక్కడ్నుంచి ఏడ్చుకుంటూ వెళుతుంది. మరోవైపు మల్లిక డమ్మీ నోట్ల కట్టల ను తన ఒంటి పై అతికించుకుని హడావిడి చేస్తూ వాళ్ల భర్తను విసిగిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దిలీప్, వెన్నెల (Vennela) దగ్గరకు వచ్చి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తాడు.
ఇక అది చూసిన జ్ఞానాంబ (jnanaamba) ఈ అబ్బాయి ఎవరు అని ఆరా తీస్తుంది. దాంతో జానకి అక్కడికి వచ్చి ఇతనే నేను చెప్పిన వ్యక్తి నేనే రమ్మని చెప్పాను అని కవర్ చేస్తుంది. ఇక తర్వాత దిలీప్ కి మర్యాదలు చేసి జ్ఞానాంబ దిలీప్ వాళ్ళ కుటుంబ వివరాలు అడుగుతుంది. ఇక తరువాత దిలీప్ (Dilip) ఇంటికి వెళ్ళి పోతాడు.
ఆ తరువాత పోలీసులు జ్ఞానాంబ (Jnanaamba) కు కాల్ చేసి మీ కోడలు ఐపీఎస్ చేసే విషయంలో మీ నిర్ణయం చెప్పలేదు అని అడుగుతారు. దాంతో జ్ఞానాంబ రేపు నా కొడుకు కోడలు వచ్చి నిర్ణయం ఏంటో చెబుతారు అని అంటుంది. ఇక ఆ మాటలను జానకి (Janaki) కూడా వింటుంది.
ఆ మాటలు విన్న జానకి, జ్ఞానాంబ (Jnanaamba) దగ్గరికి వచ్చి రామచంద్ర వింటుండగా నాకు చదవడం ఇష్టం లేదని చెప్పాకదా అత్తయ్య గారు అని జ్ఞానాంబ తో అంటుంది. ఇక జ్ఞానాంబ ఈ విషయాన్ని రేపు మీరిద్దరూ వెళ్లి చెప్పి రండి అని అంటుంది. దానికి రామచంద్ర (Ramachandra) ఎంతో భాదను వ్యక్తం చేస్తాడు.
ఇక ఆ తర్వాత రామచంద్ర (Ramachandra) ఐపీఎస్ ఎందుకు చదవడం లేదని జానకిని గట్టిగా అడుగుతాడు. దాంతో జానకి (Janaki) కొన్ని అబద్ధపు కారణాలు చెప్పి నేను ఐపియస్ చదవకూడదని నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది. దాంతో రామచంద్ర ఆ నిర్ణయానికి కారణం మా అమ్మే కదా అని అంటాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.