MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వెంకటేష్‌ రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? విషయం ఫాదర్‌కి తెలియడంతో పెద్ద రచ్చ

వెంకటేష్‌ రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? విషయం ఫాదర్‌కి తెలియడంతో పెద్ద రచ్చ

హీరో వెంకటేష్‌ కి సంబంధించి ఒక వార్త అప్పట్లో బాగా వినిపించింది. ఓ స్టార్‌ హీరోయిన్‌తో వెంకీ పెళ్లి వరకు వెళ్లారని. మరి ఆ హీరోయిన్‌ ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 28 2025, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సోగ్గాడి తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన వెంకటేష్‌
Image Credit : our own

సోగ్గాడి తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన వెంకటేష్‌

విక్టరీ వెంకటేష్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి వివాదాలు లేని హీరో. క్లీన్‌ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాలతో ఆకట్టుకున్నారు. అనేక విజయాలు అందుకున్నారు. అదే సమయంలో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సోగ్గాడు శోభన్‌ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కి, ముఖ్యంగా మహిళా ఆడియెన్స్ కి దగ్గరైన హీరో వెంకటేష్‌ అని చెప్పాలి. తన సినిమాలు కుటుంబంతో కలిసి చూసేలా ఉంటే వాటి రేంజ్‌ ఎలా ఉంటుందో, ఏ రేంజ్‌లో సక్సెస్‌ అవుతాయో ఈ సంక్రాంతికి వచ్చిన `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో నిరూపించారు. ఈ చిత్రం మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టడం విశేషం.

25
త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్న వెంకటేష్‌
Image Credit : our own

త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్న వెంకటేష్‌

అంతకు ముందు పలు యాక్షన్‌ చిత్రాలు, ఇతర విభిన్నమైన సినిమాలు చేసి చేదు అనుభవాలు ఫేస్‌ చేశారు. కానీ ఇప్పుడు సరైన ట్రాక్‌లో పడ్డారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు వెంకటేష్‌. ఇటీవలే ఇది ప్రారంభమైంది. ఇలా తనకు బలంగా నిలిచే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వెంకటేష్‌కి సంబంధించిన ఒక వార్త ఎవర్‌ గ్రీన్‌గా వినిపిస్తుంటుంది. అది ఎప్పుడు విన్నా క్రేజీగా అనిపిస్తుంది. అదే సౌందర్యతో పెళ్లి వరకు వెళ్లారనే వార్త.

Related Articles

Related image1
నివేతా పేతురాజ్ మ్యారేజ్ చేసుకునేది ఇతన్నే.. రహస్యంగా ఎంగేజ్‌మెంట్‌ ? పెళ్లి కూడా అలానే
Related image2
మహానటి సావిత్రి తన తమ్ముడికి రాసిన లెటర్‌ చూశారా? కూతురు, కొడుకు గురించి ఏం చెప్పిందంటే?
35
వెంకటేష్‌, సౌందర్య ల మధ్య కెమిస్ట్రీకి మంచి పేరు
Image Credit : stockPhoto

వెంకటేష్‌, సౌందర్య ల మధ్య కెమిస్ట్రీకి మంచి పేరు

వెంకటేష్‌ హీరోయిన్‌ సౌందర్యతోనే ఎక్కువగా సినిమాలు చేశారు.. వీరిద్దరి పెయిర్‌కి అప్పట్లో మంచి క్రేజ్‌ ఉండేది. వెండితెరపై వీరు ఎంతో చూడముచ్చటగానూ ఉండేవాళ్లు. ఇద్దరు కలిసి ఐదారు సినిమాలు చేశారు. `రాజా`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `దేవిపుత్రుడు`, `జయం మనదేరా`, `పవిత్ర బంధం`, `పెళ్లి చేసుకుందాం`, `సూపర్‌ పోలీస్‌` వంటి సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరు కలిసి నటించారంటే సినిమా హిట్టే అనేట్టుగా వాటి ఫలితాలుండేవి. ఒకటి రెండు తప్పితే ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. దీంతో ఈ జంట నటించిన సినిమాలకు మంచి డిమాండ్‌ ఉండేది.

45
సౌందర్య, వెంకీ పెళ్లి వరకు వెళ్లారా?
Image Credit : stockPhoto

సౌందర్య, వెంకీ పెళ్లి వరకు వెళ్లారా?

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ వార్తలు బయటకు వచ్చాయి. ఇద్దరు క్లోజ్‌గా ఉండటంతో, సినిమాల్లో వారి మధ్య కెమిస్ట్రీ అంతే బాగా వర్కౌట్‌ కావడంతో కొన్ని వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. వెంకీని సౌందర్య ప్రేమించిందట. అంతేకాదు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. సౌందర్య సోదరుడి వివాహానికి కేవలం టాలీవుడ్‌ నుంచి వెంకటేష్‌ మాత్రమే గెస్ట్ గా హాజరయ్యారు. దీంతో వీరి మధ్య లవ్‌ ట్రాక్‌ ఉందనే రూమర్లు వచ్చాయి. అప్పటికే వెంకటేష్‌కి మ్యారేజ్‌ అయ్యింది. అయినా మరో పెళ్లికి రెడీ అయ్యారనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. వెంకీ, సౌందర్య కలిసి తిరిగే విషయం, పెళ్లికి కూడా రెడీ అయ్యారనే వార్త కాస్త వెంకీ ఫాదర్, నిర్మాత రామానాయుడు వరకు చేరింది. ఆయన ఇన్‌ వాల్వ్ అయి ఇద్దరిని మందలించాడట. ఆ తర్వాత నుంచి ఈ ఇద్దరు దూరమయ్యారనే వార్తలున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికీ ఈ రూమర్స్ ఇంట్రెస్ట్‌ ని క్రియేట్‌ చేస్తున్నాయి. అయితే వెంకీ అలాంటి వారు కాదని, ఆయన ఫ్యామిలీ పర్సన్‌ అని ఆయన సన్నిహితులు చెప్పేమాట.

55
కొడుకు అర్జున్‌ని హీరో చేయబోతున్న వెంకటేష్‌?
Image Credit : our own

కొడుకు అర్జున్‌ని హీరో చేయబోతున్న వెంకటేష్‌?

ఏదేమైనా సినిమాల్లో ఇలాంటి రూమర్స్ కామనే. కలిసి సినిమాలు చేస్తే, కాస్త క్లోజ్‌గా ఉంటే ఇలాంటి రూమర్స్ వ్యాపిస్తూనే ఉంటాయి. పైగా ఒకే జంట రెండు మూడు సినిమాలు చేసిందంటే ఆ వార్తలు మరింత బలంగా విస్తరిస్తాయి. వెంకటేష్‌, సౌందర్య విషయంలోనూ అదే జరిగి ఉండొచ్చు. ఇందులో ఏది నిజమనేది వారికి మాత్రమే తెలుసు. వెంకటేష్‌కి 1985లో నీరజతో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి ముగ్గురుకూతుళ్లు. ఒక కొడుకు అర్జున్‌ ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కూతుళ్ల వివాహం చేశారు వెంకీ. కొడుకు అర్జున్‌ స్టడీస్‌ చేస్తున్నాడు. భవిష్యత్‌లో అర్జున్‌ని హీరో చేసే అవకాశం ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
దగ్గుబాటి వెంకటేష్
సౌందర్య
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Related Stories
Recommended image1
నివేతా పేతురాజ్ మ్యారేజ్ చేసుకునేది ఇతన్నే.. రహస్యంగా ఎంగేజ్‌మెంట్‌ ? పెళ్లి కూడా అలానే
Recommended image2
మహానటి సావిత్రి తన తమ్ముడికి రాసిన లెటర్‌ చూశారా? కూతురు, కొడుకు గురించి ఏం చెప్పిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved