- Home
- Entertainment
- నివేతా పేతురాజ్ మ్యారేజ్ చేసుకునేది ఇతన్నే.. రహస్యంగా ఎంగేజ్‌మెంట్ ? పెళ్లి కూడా అలానే
నివేతా పేతురాజ్ మ్యారేజ్ చేసుకునేది ఇతన్నే.. రహస్యంగా ఎంగేజ్‌మెంట్ ? పెళ్లి కూడా అలానే
తెలుగులో హీరోయిన్‌గా డీసెంట్ హిట్లతో ఆకట్టుకున్న నివేతా పేతురాజ్ పెళ్లికి సిద్ధమయ్యింది. తాజాగా తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది. రహస్యంగా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది.

కాబోయే భర్తని పరిచయం చేసిన నివేతా పేతురాజ్
హీరోయిన్ నివేతా పేతురాజ్ త్వరలో ఓ ఇంటికి ఇల్లాలు కాబోతుంది. ఆమె పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టి తన ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసింది. ఇన్ స్టాగ్రామ్‌లో ఫోటోలు పంచుకుంటూ ఇన్‌స్టా స్టోరీలో `ఇప్పటి నుంచి జీవితమంతా ప్రేమమయమే` అని పేర్కొంది. ప్రియుడితో ఉన్న ఫోటోలను పంచుకుంటూ వీటికి లవ్ సింబల్స్, రింగ్ ఎమోజీలను జోడించింది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు నివేతా పేతురాజ్ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో నివేతా మ్యారేజ్
నివేతా పేతురాజ్ పెళ్లి చేసుకోబోయేది ఎవరనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆమె కాబోయే భర్త వివరాలు బయటకు వచ్చేశాయి. నివేతా.. రాజ్‌హిత్ ఇబ్రాన్‌ని వివాహం చేసుకోబోతుంది. ఆయన బిజినెస్ మ్యాన్. దుబాయ్ బేస్డ్ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారట. ఇది పూర్తిగా ప్రైవేట్ సెర్మనీగా ఉండబోతుందని పీఆర్ టీమ్ వెల్లడించింది. కేవలం కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే ఈ ఈవెంట్‌కి హాజరుకాబోతున్నట్టు తెలిపింది. వీరి మ్యారేజ్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రహస్యంగా నివేతా పేతురాజ్ ఎంగేజ్‌మెంట్
ఇదిలా ఉంటే నివేతా పేతురాజ్, రాజ్‌హిత్ ఇబ్రాన్ కి ఆల్ రెడీ ఎంగేజ్‌మెంట్ అయినట్టు తెలుస్తోంది. తన పోస్ట్ లో రింగ్‌ని షేర్ చేసింది నివేతా. అంతేకాదు కాబోయే వాడితో చాలా క్లోజ్‌గా ఫోటోలు దిగింది. ఆల్మోస్ట్ లవర్స్ లాగా వీరి ఫోటోలున్నాయి. దీంతో ఎంగేజ్‌మెంట్ కూడా ప్రైవేట్‌గా జరిగిపోయిందని తెలుస్తోంది. వినాయకచవితి పండగని పురస్కరించుకుని తన పెళ్లి విషయాన్ని ఆమె వెల్లడించడం విశేషం. ఇప్పుడు వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగులో నివేతా పేతురాజ్ నటించిన సినిమాలు
మదురైకి చెందిన నివేతా పేతురాజ్.. 2016లో `ఓరు నాల్ కూథు` అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఏడాది `మెంటల్ మదిలో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాగానే ఆడింది. ఇందులో ఆమె యాక్టింగ్‌కి, ఎక్స్ ప్రెషన్స్ కి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్లనే దక్కించుకుంది. `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా`, `అల వైకుంఠపురములో`, `రెడ్`, `పాగల్`, `బ్లడీ మ్యారీ`, `విరాటపర్వం`, `దాస్ కా ధమ్కీ` వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది. అయితే నివేతాకి డీసెంట్ హిట్లు పడ్డాయి, కానీ హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చే సక్సెస్ రాలేదు. దీంతో తెలుగుకి దూరమయ్యింది. ఇప్పుడు ఏకంగా మ్యారేజ్‌కి రెడీ అయి లైఫ్‌లో సెటిల్ కాబోతుంది. పెళ్లి తర్వాత నటిస్తుందా? సినిమాలకు గుడ్ బై చెబుతుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే నివేతాతో తెలుగు హీరో విశ్వక్ సేన్ డేటింగ్ చేశారనే రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. `దాస్ కా ధమ్కీ` తర్వాత బ్రేకప్ అయినట్టుగా వార్తలు రావడం గమనార్హం.