MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎట్టకేలకు వెంకీ కోరిక నెరవేరబోతోంది.. వెంకటేశ్వర్లు, నందు, ఆశా, పింకీ చేసే రచ్చకి గెట్ రెడీ

ఎట్టకేలకు వెంకీ కోరిక నెరవేరబోతోంది.. వెంకటేశ్వర్లు, నందు, ఆశా, పింకీ చేసే రచ్చకి గెట్ రెడీ

ఎట్టకేలకు వెంకటేష్ కోరిక నెరవేరబోతోంది. వెంకీ, విజయ భాస్కర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 29 2025, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నువ్వు నాకు నచ్చావ్ మూవీ
Image Credit : Jiohotstar

నువ్వు నాకు నచ్చావ్ మూవీ

తెలుగు ప్రేక్షకులు బుల్లితెరపై అత్యధికంగా చూసిన సినిమాల జాబితాలో నువ్వు నాకు నచ్చావ్ కూడా ఉంటుంది. ఈ సినిమా చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. మీమ్స్ లో ఈ సినిమా సీన్లే ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. దీనితో నువ్వు నాకు నచ్చావ్ మేకర్స్ కూడా మరోసారి ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రీ రిలీజ్ అవుతున్న నువ్వు నాకు నచ్చావ్
Image Credit : Instagram/@venkateshdaggubati

రీ రిలీజ్ అవుతున్న నువ్వు నాకు నచ్చావ్

2026 జనవరి 1న ఈ చిత్రం గ్రాండ్ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా, యూరప్ లలో కూడా నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఎట్టకేలకు వెంకటేష్ కోరిక నెరవేరబోతోంది. సైంధవ్‌ మూవీ ప్రమోషన్స్ సమయంలో తనకి నువ్వు నాకు నచ్చావ్ మూవీ రీ రిలీజ్ కావాలని ఉన్నట్లు వెంకీ మనసులో కోరిక బయట పెట్టారు.

35
త్రివిక్రమ్ డైలాగులు
Image Credit : Instagram/@venkateshdaggubati

త్రివిక్రమ్ డైలాగులు

విజయ భాస్కర్ దర్శకత్వంలో, త్రివిక్రమ్ రచయితగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో దాదాపుగా ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్ ఆడియన్స్ కి గుర్తుండిపోతుంది. వెంకటేశ్వర్లు(వెంకీ)గా వెంకటేష్ చేసిన అల్లరి, నందు పాత్రలో ఆర్తి అగర్వాల్ గ్లామర్, ప్రకాష్ రాజ్ తో కామెడీ సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్స్. అదే విధంగా పింకీ పాత్రలో సుదీప, ఆశా పాత్రలో ఫ్లోరా షైనీ చేసిన రచ్చ కూడా అంతా ఇంతా కాదు. త్రివిక్రమ్ రాసిన డైలాగులు, ఫన్నీ వన్ లైనర్స్ ఈ చిత్రంలో మరో హైలైట్. 

45
వెంకీ కెరీర్ లో మెమొరబుల్ మూవీ
Image Credit : Instagram/@venkateshdaggubati

వెంకీ కెరీర్ లో మెమొరబుల్ మూవీ

ఈ రీ రిలీజ్ తో వీరందరి పెర్ఫార్మెన్స్ ని వెండితెరపై మరోసారి చూసే అవకాశం ఆడియన్స్ కి దక్కింది. నువ్వు నాకు నచ్చావ్ 2001లో విడుదలై సంచలన విజయం సాధించింది. వెంకీ కెరీర్ లో ఇది మరచిపోలేని చిత్రంగా నిలిచిపోయింది.

55
ఇన్నేళ్ల తర్వాత వెంకీ, త్రివిక్రమ్ కాంబో
Image Credit : Instagram/@venkateshdaggubati

ఇన్నేళ్ల తర్వాత వెంకీ, త్రివిక్రమ్ కాంబో

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో సునీల్, బ్రహ్మానందం, సుధ, హేమ, ఎమ్మెస్ నారాయణ ఇతర పాత్రల్లో నటించారు. నువ్వు నాకు నచ్చావ్ రిలీజైన 24 ఏళ్ళ తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ రాబోతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దగ్గుబాటి వెంకటేష్
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇళయరాజాకు అరుదైన గౌరవం.. పోస్టల్ స్టాంప్ రిలీజ్
Recommended image2
kayadu lohar: కయాదు లోహర్ పేరులో ఇంత అర్థం ఉందా? జెన్ జీ బ్యూటీలో మైథాలజీ యాంగిల్
Recommended image3
Mahaveer Karna First Look: పౌరాణిక యోధుడిగా రాఘవ లారెన్స్.. ఫస్ట్ లుక్ ఎలా ఉంది, రిలీజ్ ఎప్పుడంటే?
Related Stories
Recommended image1
చిరంజీవితో నాగార్జున పోటీ పడితే ఇలానే ఉంటుంది, వార్ వన్ సైడ్ మాత్రం కాదు.. శివ తర్వాత చుక్కలు కనిపించాయి
Recommended image2
ప్రభాస్ 'స్పిరిట్' లో స్టార్ హీరో భార్య ? వంగా ప్లానింగ్ నెక్స్ట్ లెవల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved