MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Venkatesh: వెంకటేష్‌ కెరీర్‌ ని మార్చిన సంఘటన.. లవ్‌ స్టోరీస్‌ చేయడం వెనుక అసలు కథ ఇదే

Venkatesh: వెంకటేష్‌ కెరీర్‌ ని మార్చిన సంఘటన.. లవ్‌ స్టోరీస్‌ చేయడం వెనుక అసలు కథ ఇదే

Venkatesh: వెంకటేష్‌ లవ్‌ స్టోరీస్‌తో ఎక్కువగా విజయాలు అందుకున్నారు. స్టార్‌ హీరోగా ఎదిగారు. అయితే ఆయన ప్రేమ కథా చిత్రాలు చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉందట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 25 2026, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వెంకటేష్‌ బౌన్స్ బ్యాక్‌
Image Credit : Facebook / Venkatesh

వెంకటేష్‌ బౌన్స్ బ్యాక్‌

విక్టరీ వెంకటేష్‌.. చాలా ఏళ్ల తర్వాత బౌన్స్ బ్యాక్‌ అయ్యారు. ఆయన రేంజ్‌ ఏంటో ఇండస్ట్రీకి చూపించారు. ఫ్యామిలీ స్టోరీస్‌లో ఉన్న సత్తా ఏంటో గతేడాది వచ్చిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో చూపించారు. ఈ ఏడాది `మన శంకర వరప్రసాద్‌ గారు`లోనూ మెరిసి అదరగొట్టారు. ఇప్పుడు త్రివిక్రమ్‌తో మరో ఫ్యామిలీ స్టోరీతో రాబోతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శోభన్ బాబు తర్వాత వెంకటేషే
Image Credit : Asianet News

శోభన్ బాబు తర్వాత వెంకటేషే

వెంకటేష్‌ ఫ్యామిలీ సినిమాలు, లవ్‌ స్టోరీస్‌తో ఎక్కువగా ఆకట్టుకున్నారు. వాటిద్వారానే ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. శోభన్‌ బాబు తర్వాత మహిళల్లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరో వెంకటేష్‌ అని చెప్పొచ్చు. కానీ వెంకటేష్‌ కెరీర్‌ ప్రారంభించింది మాత్రం యాక్షన్‌ చిత్రాలతోనే. ఆయన ప్రారంభంలో మాస్‌ హీరోగా నిలబడేందుకు చాలా యాక్షన్‌ చిత్రాలు చేశారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ మాస్‌, యాక్షన్‌ మూవీ చేసి విజయాలు కూడా అందుకున్నారు. మంచి స్టార్‌ హీరోగా ఎదిగారు.

35
అనూహ్యంగా లవ్‌ స్టోరీస్‌ వైపు వెంకీ టర్న్
Image Credit : Facebook / Venkatesh

అనూహ్యంగా లవ్‌ స్టోరీస్‌ వైపు వెంకీ టర్న్

కానీ అనూహ్యంగా ఆయన లవ్‌ స్టోరీస్‌ వైపు టర్న్ తీసుకున్నారు. `రక్త తిలకం`, `బ్రహ్మపుత్రుడు`, `కూలీ నెం 1` ఇలా వరుసగా మాస్‌ సినిమాలు చేసిన వెంకటేష్‌ ఆ తర్వాత నెమ్మదిగా లవ్‌ స్టోరీస్‌ చేశాడు. ఫ్యామిలీ అంశాలకు పెద్ద పీఠ వేసే చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. అయితే ఇలా తాను టర్న్ తీసుకోవడం వెనక ఓ గాయం ఉందట. వరుసగా యాక్షన్‌ సినిమాలు చేసే సమయంలో వెంకటేష్‌ మెడకి బలంగా దెబ్బ తగిలిందట. అది చాలా సివియర్‌గా ఉండేదట. దీంతో యాక్షన్‌ సినిమాలు చేస్తే, స్టంట్స్ చేయాల్సి వస్తుందని చెప్పి, అవి తగ్గించారట. ఆ తర్వాత నుంచి వరుసగా లవ్‌ స్టోరీస్‌ కి ప్రయారిటీ ఇచ్చారట.

45
గాయం మంచే చేసింది
Image Credit : our own

గాయం మంచే చేసింది

అలా తాను అనుకోకుండా లవ్‌ స్టోరీస్‌ చేయాల్సి వచ్చిందని తెలిపారు వెంకటేష్‌. ఓ రకంగా గాయం తగలడం కూడా బెటరే అయ్యిందని, మంచి సినిమాలు చేసే అవకాశం దొరికిందని చెప్పారు వెంకటేష్‌. ఆ టైమ్‌లో ఏది జరిగినా అది మన మంచికే అనిపించిందని వెల్లడించారు. దాదాపు 13ఏళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

55
ఏకే 47తో రాబోతున్న వెంకటేష్‌
Image Credit : Facebook / Venkatesh

ఏకే 47తో రాబోతున్న వెంకటేష్‌

వెంకటేష్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తొలిసారి సినిమా చేస్తున్నారు. దీనికి `ఆదర్శ కుటుంబం ఇంటి నెం 47`(ఏకే 47). ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమాని దసరా స్పెషల్‌గా అక్టోబర్‌ 16న విడుదల చేయబోతున్నారు. దీంతోపాటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వెంకటేష్‌. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
దగ్గుబాటి వెంకటేష్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Recommended image2
Nani: ఇక జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్లను..నాని సంచలన కామెంట్స్, కారణం ఏంటంటే?
Recommended image3
NTR మార్ఫింగ్ వీడియో వివాదం.. సెలబ్రిటీలదే తప్పు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Sameera Bharadwaj Remuneration: సింగర్‌ సమీరా భరద్వాజ్‌ ఒక్కో పాటకి తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?
Recommended image2
Boyapati Top 5 Movies: బోయపాటి శ్రీను టాప్‌ 5 మూవీస్‌.. తిరుగులేని స్టార్‌ డైరెక్టర్‌ని చేసింది ఈ ఒక్క హీరోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved