MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • 100 సినిమాల్లో నటించిన వెంకటేష్ హీరోయిన్, అంత్యక్రియలకు డబ్బులు లేని దీన స్థితిలో మరణం, ఎవరామె?

100 సినిమాల్లో నటించిన వెంకటేష్ హీరోయిన్, అంత్యక్రియలకు డబ్బులు లేని దీన స్థితిలో మరణం, ఎవరామె?

విక్టరీ వెంకటేష్ ఫస్ట్ హీరోయిన్, 100 సినిమాల్లో నటించిన తార, లక్షల్లో రెమ్యునరేషన్, కోట్లలో ఆస్తులు సంపాదించిన నటి, చివరకు అత్యక్రియలకు కూడా డబ్బులు లేక హీరో సహాయంతో స్మశానానికి చేరిన తార ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 03 2026, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన హీరోయిన్
Image Credit : Ashwini

ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన హీరోయిన్

సినీతారల జీవితాలు వెండితెరపై చూపించినంత అందంగా ఉండవు. పేరుకి లగ్జరీ లైఫ్, లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయటకు కనిపించవు. లక్షల్లో రెమ్యునరేషన్, కోట్లలో ఆస్తులు సంపాదించని తారలు కూడా.. చివరకు దిక్కులేకుండా మరణించిన సందర్భాలు ఉన్నాయి. 

తెలుగు సినీ పరిశ్రమలో అటువంటి తారలు చాలామంది ఉన్నారు. వెంకటేష్, బాలకృష్ట లాంటి స్టార్ హీరోల జతగా నటించిన ఓ హీరోయిన్ చివరకు చిన్న వయసులోనే మరణిస్తే.. అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేక ఆమె కుటుంబం ఇబ్బందులు పడింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు అశ్విని.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
100 సినిమాల్లో నటించిన అశ్విని..
Image Credit : Asianet News

100 సినిమాల్లో నటించిన అశ్విని..

అశ్విని అచ్చతెలుగు నటి. నెల్లూరులో పుట్టి పెరిగింది. భక్త ధ్రువ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆతరువాత చదువుకోసం గ్యాప్ ఇచ్చి.. కొన్ని సంవత్సరాల తరువాత మళ్లీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో వెంకటేష్ ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు సినిమాలో హీరోయన్ గా అశ్విని నటించింది. తెలుగులో , బాలకృష్ణ సరసన ‘భలే తమ్ముడు’ వంటి భారీ సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. 1980వ దశకం నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఆమె సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.

Related Articles

Related image1
Monalisa:10 సార్లు లైంగికంగా వేధించాడు, డైరెక్టర్ పై కుంభమేళా మోనాలిసా సంచలన ఆరోపణలు
Related image2
మహేష్ బాబు అభిమానులను టెన్షన్ పెట్టిన సినిమా ఏదో తెలుసా? ఎన్టీఆర్ తప్పించుకుని మహేష్ ను బుక్ చేశాడుగా?
36
భర్త చేతిలో మోసపోయిన హీరోయిన్
Image Credit : volga videos / screenshot

భర్త చేతిలో మోసపోయిన హీరోయిన్

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా దూసుకుపోయింది అశ్విని. ఆమె కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా.. ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత అశ్విని జీవితం పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెను మోసం చేశారు. అశ్విని ఆస్తులు, డబ్బు తీసుకుని ఇబ్బందులు పెట్టాడు. దాంతో ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయిన అశ్విని, ఆ ఒత్తిడిని భరించలేకపోయింది. ఒంటరితనంతో ఇబ్బంది పడింది. డిప్రెషన్ లోకి వెళ్లి సినిమాలు చేయడం మానేసింది.

46
ఆర్ధికంగా చితికిపోయిన తార..
Image Credit : Ashwini

ఆర్ధికంగా చితికిపోయిన తార..

కొంత కాలానికి తేరుకన్నా.. అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. అప్పటి వరకూ వచ్చిన అవకాశాలు ఆగిపోయాయి. అయినా సరే ఒంటరిగా బ్రతకలేక కార్తీక్ అనే పిల్లాడిని దత్తత తీసుకుని పెంచుకుంది. వెండితెరపై అవకాశాలు తగ్గడంతో బుల్లితెర వైపు అడుగులు వేసింది అశ్విని. కొన్ని సీరియల్స్ లో నటించింది. కానీ మునుపటి వైభవం మాత్రం సాధించలేకపోయింది.

56
45 ఏళ్ల చిన్న వయసులో మరణం..
Image Credit : volga videos / screenshot

45 ఏళ్ల చిన్న వయసులో మరణం..

హీరోయిన్ గా స్టార్ డమ్, కోట్లలో సంపాదించినా.. ఆ డబ్బు మొత్తం పోగొట్టుకుని కటిక పేదరికంలోకి వెళ్లిపోయింది అశ్విని. దానికి తోడు అనారోగ్యం వెంటాడటంతో ఉన్న కొంత డబ్బు ట్రీట్మెంట్ కు అయిపోయింది. 

అయినా డబ్బు సరిపోకపోవడంతో చెన్నైలో ఆమెకు మిగిలిన ఏకైక ఆస్తి ఆమె ఇంటిని కూడా అమ్మేసి వైద్యం చేయించుకుంది. లంగ్ క్యాన్సర్ తో ఇబ్బంది పడ్డ అశ్విని.. 45 ఏళ్ల చిన్న వయసులో చెన్నైలోని ఒక అద్దె ఇంట్లో కన్నుమూసింది. అప్పటికే ఆమె కుటుంబం పేదరికంతో ఇబ్బందిపడుతున్నారు.

66
అత్యక్రియలకు సహాయం చేసిన హీరో..
Image Credit : volga videos / screenshot

అత్యక్రియలకు సహాయం చేసిన హీరో..

100 సినిమాలు చేసిన హీరోయిన్, లక్షల్లో రెమ్యునరేషన్, కోట్లలో ఆస్తులు సంపాదిచిన అశ్విని.. చివరకు మరణించిన తర్వాత పార్థివదేహాన్ని సొంత ఊరైన నెల్లూరుకు తరలించడానికి కూడా కుటుంబం దగ్గర డబ్బు లేక ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో తమిళ నటుడు, దర్శకుడు, పార్థిబన్ విషయం తెలుసుకుని వారికి ఆర్థిక సహాయం చేశారు. ఇండస్ట్రీలో గొప్పగా బ్రతికిన ఆమె జీవితం.. చివరకు ఇలా ముగిసింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
దగ్గుబాటి వెంకటేష్
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Related Stories
Recommended image1
Monalisa:10 సార్లు లైంగికంగా వేధించాడు, డైరెక్టర్ పై కుంభమేళా మోనాలిసా సంచలన ఆరోపణలు
Recommended image2
మహేష్ బాబు అభిమానులను టెన్షన్ పెట్టిన సినిమా ఏదో తెలుసా? ఎన్టీఆర్ తప్పించుకుని మహేష్ ను బుక్ చేశాడుగా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved