MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Monalisa:10 సార్లు లైంగికంగా వేధించాడు, డైరెక్టర్ పై కుంభమేళా మోనాలిసా సంచలన ఆరోపణలు

Monalisa:10 సార్లు లైంగికంగా వేధించాడు, డైరెక్టర్ పై కుంభమేళా మోనాలిసా సంచలన ఆరోపణలు

మోనాలిసా కేసు ఇప్పట్లో తేలేట్లు లేదు. ఓవర్ నైట్ స్టార్ గా మారి వార్తల్లో కెక్కిన ఈ అమ్మాయి.. పెళ్లి చేసుకుని మరోసారి వైరల్ అయ్యింది. తాజాగా డైరెక్టర్ పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనంగా మారింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 03 2026, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మోనాలిసా లైంగిక ఆరోపణలు
Image Credit : PTI

మోనాలిసా లైంగిక ఆరోపణలు

కుంభమేళాలో పూసలమ్ముకున్న అమ్మాయి.. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస అవకాశాలు సాధించింది. స్టార్ హీరోలకు పోటీ ఇస్తుందని అంతా అనుకున్న టైమ్ లో.. సడెన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది మోనాలిసా. తాజాగా ఆమె బాలీవుడ్ దర్శకుడు సహా నలుగురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నలుగురిపై కేసు నమోదు..
Image Credit : Instagram

నలుగురిపై కేసు నమోదు..

మోనాలిసా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసులు పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా, అలాగే విశ్వ హిందూ పరిషత్ నాయకుడు , న్యాయవాది అనిల్ విలయిల్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం.

34
10 సార్లు లైంగికంగా వేధించాడు..
Image Credit : stockPhoto

10 సార్లు లైంగికంగా వేధించాడు..

మోనాలిసా తన కంప్లైంట్ లో చెప్పిన వివరాల ప్రకారం, ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. కొచ్చిలో జరిగిన ఒక ఈవెంట్ లో దర్శకుడు సనోజ్ మిశ్రా తనను చాలా సార్లు అసభ్యంగా తాకాడని మోనాలిసా ఆరోపించింది. “షూటింగ్ సెట్‌లో దాదాపు 10 సార్లు నన్ను లైంగికంగా వేధించాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పినా వారు పట్టించుకోలేదు” అని ఆమె తన వాంగ్మూలంలో తెలిపింది. పీటీఐ రిపోర్ట్  ప్రకారం ఏప్రిల్ 29న ఈ ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఏప్రిల్ 30న ఆమె కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇచ్చింది.

44
ఫ్యామిలీతో మోనాసిసా విభేదాలు..
Image Credit : Instagram

ఫ్యామిలీతో మోనాసిసా విభేదాలు..

ఈ ఘటనలు మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్నందున, కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల మోనాలిసా తన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కూడా వివాదానికి దారితీసింది. ఆమె మైనర్ అని, ఈ వివాహం ‘లవ్ జిహాద్’కు సంబంధించినదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే మోనాలిసా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది.ఇప్పటికే కుటుంబ వివాదాలు కొనసాగుతున్న సమయంలో, ఈ లైంగిక వేధింపుల ఆరోపణలతో మోనాలిసా పరిస్థితి మరింత ఇబ్బందుల్లో పడింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Recommended image3
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Related Stories
Recommended image1
16 ఏళ్లకే స్టార్ హీరోయిన్, 18 ఏళ్లకు పెళ్లి, 19 ఏళ్లకే అనుమానాస్పదంగా మరణించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
మహేష్ బాబు అభిమానులను టెన్షన్ పెట్టిన సినిమా ఏదో తెలుసా? ఎన్టీఆర్ తప్పించుకుని మహేష్ ను బుక్ చేశాడుగా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved