- Home
- Entertainment
- రాజమౌళి ఊర మాస్ సినిమాకి పోటీగా దిగిన వెంకటేష్.. క్లాస్ మూవీతో దుమ్ము దులిపేశాడు, దటీజ్ వెంకీ
రాజమౌళి ఊర మాస్ సినిమాకి పోటీగా దిగిన వెంకటేష్.. క్లాస్ మూవీతో దుమ్ము దులిపేశాడు, దటీజ్ వెంకీ
క్లాస్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టగలనని విక్టరీ వెంకటేష్ ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రానికి పోటీగా దిగి వెంకటేష్ సృష్టించిన సంచలనం గురించి ఈ కథనంలో తెలుసుకోండి.

సింహాద్రి మూవీ
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వస్తుందంటే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సైతం పక్కకి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి తన సినిమాలతో వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ని ఆకర్షిస్తున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 తో కెరీర్ ప్రారంభించిన రాజమౌళి ఆ తర్వాత క్రమంగా అగ్ర దర్శకుడిగా ఎదిగారు. రాజమౌళి రెండవ చిత్రం కూడా ఎన్టీఆర్ తోనే. 2003లో విడుదలైన సింహాద్రి మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది.
ఎన్టీఆర్ మాస్ విశ్వరూపం
సింహాద్రి చిత్రంలో ఎన్టీఆర్ మాస్ విశ్వరూపం ప్రదర్శించారు. ఈ సినిమాతో తారక్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. లాంటి సింహాద్రి సినిమాకి పోటీగా విడుదలై నిలదొక్కుకోవాలి అంటే మరో మాస్ సినిమానే రిలీజ్ కావాలి. కానీ విక్టరీ వెంకటేష్ స్టయిలే వేరు.
సింహాద్రికి పోటీగా క్లాస్ మూవీతో వచ్చిన వెంకీ
సింహాద్రి విడుదలైన 2 రోజుల తర్వాత వెంకటేష్ తన వసంతం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వసంతం కంప్లీట్ గా క్లాస్ మూవీ. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా తెరకెక్కించిన చిత్రం అది. విక్రమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు.
సూపర్ హిట్ గా నిలిచిన వసంతం
ఈ మూవీలో ఆర్తి అగర్వాల్, కళ్యాణి హీరోయిన్లుగా నటించారు. ఒకవైపు మాస్ ఆడియన్స్ తో సింహాద్రి చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు వసంతం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో సత్తా చాటింది. సూపర్ హిట్ గా నిలిచింది.
క్లాస్ సినిమాతో కలెక్షన్స్ కొల్లగొట్టే వెంకటేష్
వసంతం చిత్రంలో భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ గెస్ట్ రోల్ లో కొన్ని సెకండ్ల పాటు మెరిశారు. వెంకటేష్, కళ్యాణి మధ్య ఎమోషనల్ ఫ్రెండ్ షిప్.. ఆర్తి అగర్వాల్ రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. బరిలో ఎన్ని మాస్ సినిమాలు ఉన్నా తాను క్లాస్ మూవీతో హిట్ కొట్టగలనని వెంకీ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి సీజన్ లో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లాంటి మాస్ సినిమాలు ఉన్నప్పటికీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో రికార్డు వసూళ్లు రాబట్టారు.

