- Home
- Entertainment
- వెంకటేష్ అంత పెద్ద కోటీశ్వరుడా?.. ఆస్తుల లెక్కలు వైరల్.. మామూలు బిగ్ షాట్ కాదుగా!
వెంకటేష్ అంత పెద్ద కోటీశ్వరుడా?.. ఆస్తుల లెక్కలు వైరల్.. మామూలు బిగ్ షాట్ కాదుగా!
విక్టరీ వెంకటేష్ టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరు. ఒకప్పుడు ఆ నలుగురిలో ఒకరు. ఆయన ఆస్తులు కూడా అదే రేంజ్‌లో ఉంటాయట. ఆ నలుగురిలో ఒకరిలా ఉంటాయట.

లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడి రెండో కొడుకు వెంకటేష్. పెద్ద కొడుకు సురేష్ బాబు నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశాడు రామానాయుడు. గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన ఓ సినిమా చేస్తుంటే చివరి నిమిషంలో హీరో హ్యాండిచ్చాడట. దీంతో విదేశాల్లో చదువుతున్న వెంకటేష్‌ని అర్జెంట్‌గా పిలిపించి హీరోని చేశాడు రామానాయుడు. అలా యాక్సిడెంటల్‌గా నటుడు అయ్యాడు వెంకీ.
నిజానికి హీరో కాకపోయి ఉంటే వెంకటేష్ ని ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. ఉద్యోగంలో ఏ స్థాయిలో ఉన్నా, బిజినెస్ మ్యాన్‌గా ఓ పొజిషన్‌లో ఉనన్నా, సినిమా తెచ్చె గుర్తింపు, అభిమానం, ఫాలోయింగ్ మరే దాంట్లోనూ రాదు. ఒక్క రాజకీయాల్లో తప్ప. ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరిగా, లక్షలాది మంది అభిమానులు ఆరాధించే హీరోగా రాణిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు.
ఈ క్రమంలో రామానాయుడు స్టూడియోకి, బ్యానర్‌కి ఆయన ఓ ఫోకస్ పాయింట్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచాడు వెంకటేష్. అనేక సినిమాలు తమ బ్యానర్‌లోనే చేసి విజయాలుఅందుకున్నాడు. టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోగా నిలిచారు. ఆయన ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసినా తెలుగులో విశేష ఆదరణ పొందాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేశాయి.
Venakatesh
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి పోటీని తట్టుకుని నిలబడ్డాడు. తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు వెంకీ. తాజాగా ఆయన ఆస్తుల లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ అంత పెద్ద కోటీశ్వరుడా అని ఆశ్చర్యపోయే డిటెయిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌లోనే అత్యంత కోటీశ్వరుడు అంటూ ప్రచారం నడుస్తుంది.
వెంకటేష్‌కి 2200కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఆయన టాలీవుడ్‌లోనే రెండో అతిపెద్ద సంపన్నుడు అంటున్నారు. నాగార్జునకి ఎక్కువగా ఉన్నాయని, ఆయన తర్వాత వెంకీనే నిలుస్తారని అంటున్నారు. హైదరాబాద్‌లో వెంకీకి లగ్జరీ హోమ్ ఉంది. అది కోట్ల విలువ చేస్తుంది. దీంతోపాటు రామానాయుడు స్టూడియో ఉంది. ప్రొడక్షన్ ఉంది. హైదరాబాద్ లో రెండు స్టూడియోలు, వైజాగ్‌లో ఓ స్టూడియో ఉంది. వీటితోపాటు లగ్జరీ కార్లు, బైకులు ఉన్నాయి.
వీటితోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారట. నాన్న రామానాయుడు నుంచి ఇది కొనసాగుతుందని, వందల ఎకరాల భూములు కొన్నట్టు తెలుస్తుంది. మద్రాసులోనూ ల్యాండ్‌లు ఉన్నాయట, అలాగే హైదరాబాద్‌లోనూ ల్యాండ్స్ ఉన్నాయని చెబుతున్నారు. అన్న సురేష్ బాబుతో కలిసే పెట్టుబడులు పెట్టారని అంటున్నారు. కలిసే మెయింటేన్ చేస్తున్నారట. అలా అయితే ఉన్న ఆస్తుల్లో ఎవరికి వాళ్లు పంచుకున్నా రెండు వేల కోట్లకుపైగా ఉంటాయని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇది కేవలం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం మాత్రమే.
అయితే వెంకటేష్‌కి ఎంత ఆస్తులున్నా ఆయన చాలా నిరాడంభరంగా ఉంటారు. హంగామా చేయరు. ఆస్తులున్నాయని షోకేస్ చేయరు. చాలా సింపుల్‌గా ఉంటారు. సింపుల్ లైఫ్‌నే లీడ్ చేస్తుంటారు. ఒక సెలబ్రిటీగా కొన్ని మినిమమ్ లగ్జరీలు మెయింటేన్ చేస్తాడు తప్ప, ఉన్నాయని చూపుంచుకోవాలని ఎప్పుడూ అనుకోరు. ఆయన చాలా వరకు ఆథ్మాత్మిక చింతనలోనే ఉంటారు. లైఫ్ చాలా చిన్నదని, దాన్ని ఆస్వాదించాలని చెబుతుంటారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు అర్జున్ ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కూతుళ్ల వివాహం చేశారు. అర్జున్‌ని సినిమాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఇక ఇటీవల వెంకటేష్‌కి విజయాలు లేవు. `ఎఫ్2` తర్వాత చెప్పుకునే విజయం రాలేదు. `వెంకీమామ`, `నారప్ప`, `దృశ్యం2`, `ఎఫ్3, `సైంధవ్` చిత్రాలతో వచ్చారు. కానీ ఈ మూవీస్ డిజప్పాయింట్ చేశాయి. ఇప్పుడు హిట్ కోసం మళ్లీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారట. త్వరలోనే ఇది షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. దీనికి `శీలవతి`అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట.