MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'వీరసింహా రెడ్డి' లో జగన్ సర్కార్‌పై వేసిన పంచ్ డైలాగ్స్ ఇవే

'వీరసింహా రెడ్డి' లో జగన్ సర్కార్‌పై వేసిన పంచ్ డైలాగ్స్ ఇవే

 కలెక్షన్స్ విషయం ప్రక్కన పెడితే ఈ సినిమా లో పెట్టిన  కొన్ని పొలిటికల్ డైలాగ్స్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఈ డైలాగులుని  సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

3 Min read
Surya Prakash
Published : Jan 12 2023, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Balakrishna surprises fans at Bramaramba theatre on Veera Simha Reddy release day

Balakrishna surprises fans at Bramaramba theatre on Veera Simha Reddy release day


బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహా రెడ్డి' సినిమా రూపొందింది. మైత్రీ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు  వచ్చింది.  ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హనీరోజ్ అలరించింది. ఇక విలన్ షేడ్స్ కలిగిన భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించగా, ఐటమ్ నెంబర్ లో చంద్రిక రవి మెరిసింది. మొత్తానికి ఈ సినిమా ఓపినింగ్స్ కొత్త రికార్డులకు తెరతీసిందనేది ట్రేడ్ టాక్. కలెక్షన్స్ విషయం ప్రక్కన పెడితే ఈ సినిమా లో పెట్టిన  కొన్ని పొలిటికల్ డైలాగ్స్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఈ డైలాగులుని  సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రిలీజ్ ముందు విడుదలైన ట్రైలర్ లో పొలిటికల్ డైలాగ్స్ పేల్చిన బాలయ్య.. మూవీలో మరిన్ని పొలిటికల్ సైటర్లు వేసారు. వాటిలో కొన్ని చూద్దాం.

28
veera simha reddy

veera simha reddy


‘ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి.. ప్రజల్ని వేధించడం కాదు.. జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమేయడం కాదు.. పని చేయడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు.. నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం కాదు.. పరిశ్రమలను తీసుకుని రావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలను మూయడం కాదు. బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో..’ అంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ని టార్గెట్ చేస్తూ బాలయ్య  పంచ్ ఇచ్చాడు. 

38
veera simha reddy

veera simha reddy


హోమ్‌ మంత్రి నుంచి వీర సింహారెడ్డి ఫోన్‌ వచ్చినపుడు..

సైడ్‌ క్యారెక్టర్‌ : నువ్వు వెళ్లటం ఏమిటి పెద్దన్నా!!
వీర సింహారెడ్డి : ప్రజలు ఎన్నుకున్న వెధవలు వాళ్లు ...వాళ్లను గౌరవించడం మన ధర్మం.. బాధ్యత
 

48

వీర సింహారెడ్డి, హోం మంత్రికి మధ్య సంభాషణ
హోం మంత్రి : మేము అధికారంలో ఉన్నాం.
బాలకృష్ణ : కాంగ్రాచ్యులేషన్స్.
హోం మంత్రి : నేను హోమ్ మినిష్టర్‌ను.
బాలకృష్ణ : గ్లాడ్ టు మీట్ యు.
హోం మంత్రి : ఇక్కడ ఏం జరగాలో, ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు?.
బాలకృష్ణ : చెప్పుకునే అలవాటు నాకు లేదు. జీవోని యాజిటీజ్ గా అమలు చేస్తూ ఉంటాను.
హోం మంత్రి : జీవోనా?.
బాలకృష్ణ : మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్. నా జీవో గాడ్స్ ఆర్డర్.
హోం మంత్రి : నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుతుంది.
బాలకృష్ణ : రారు.. రానివ్వను. నాట్ అలవుడ్.
హోం మంత్రి : నీకు ఎదురుగా నేనే వస్తా.
బాలకృష్ణ : బై ఎలక్షన్ జనాలకు భారం, నాట్ అలవుడ్!
హోం మంత్రి : ఏం చూసుకుని నీకు ఈ పొగరు?
బాలకృష్ణ : పదవి చూసుకుని నీకు ఆ పొగరు ఏమో!? బై బర్త్ నా డీఎన్ఏకు పొగరు ఎక్కువ
 

58


 
"వాడు దోచుకోవడానికి వచ్చాడు.. నాట్ అలౌడ్".
"మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా"
"ఎన్నివందల మందినైనా వెంటేసుకునిరా.. చివరి తల తెగేవరకూ కత్తి వదలను చేయి మార్చను. ఒంటిచేత్తో ఊచకోత కోస్తా నా కొడకా.."
 'నువ్వు సవాలు విసిరితే నేను శవాలు విసురుతా' .. 

68


 'మగతనం గురించి నువ్వు మాట్లాడితే మొలతాళ్లు సిగ్గుపడతాయ్' 
 'సీతకి దూరమైనా రాముడు దేవుడే'
‘సంతకం పెడితే బోర్డుపై పేరు మారొచ్చేమోగాని… చరిత్ర సృష్టించినవారి పేరు మారదు,.. మార్చలేరు …కోస్తా నాకొడకా’.
 ‘పదవి చూసుకుని నీకు పొగరేమే..బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ’.
 ‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్… నా జీవో గాడ్స్ ఆర్డర్’. 

78


"ఇది రాయల సీమ.. రాయల్ సీమా.. గజరాజులు నడిచిన దారిలో గజ్జకుక్కలు కూడా నడుస్తుంటాయి.. రాజుని చూడు కుక్కని కాదు."
"ఎన్నివందల మందినైనా వెంటేసుకునిరా.. చివరి తల తెగేవరకూ కత్తి వదలను చేయి మార్చను. ఒంటిచేత్తో ఊచకోత కోస్తా నా కొడకా.."

"కాపు కాసిన కర్నూలోళ్లు.. చుట్టుముట్టిన చిత్తూరోళ్లు.. కమ్ముకొస్తున్న కడపోళ్లు.. కత్తికట్టిన అనంతపురమోళ్లు.. ఎగసికొస్తున్నారు. ఎండనడినెత్తికి ఎక్కేలోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరువేసి పోదాం."


" సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు.. ముందు తరాల కోసం. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమపై ఎఫెక్షన్."

88


ఈ సినిమాలో చాలా డైలాగ్‌లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేసినట్లుగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ఏపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.  ప్రభుత్వ నిర్ణయాలపై బాలయ్య తన మార్క్‌ డైలాగ్‌ డెలివరీతో ఘాటుగా స్పందించినట్లుగా చెప్పుకుంటున్నారు.
  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved