- Home
- Entertainment
- మీరు ఎప్పటికీ అందంగా ఉండాలా? అయితే పెళ్లి చేసుకోకండి.. బాలయ్య హీరోయిన్ సంచలన స్టేట్‌మెంట్
మీరు ఎప్పటికీ అందంగా ఉండాలా? అయితే పెళ్లి చేసుకోకండి.. బాలయ్య హీరోయిన్ సంచలన స్టేట్‌మెంట్
Vedika: బాలకృష్ణతో `రూలర్` చిత్రంలో నటించి మెప్పించిన హీరోయిన్ వేదిక.. 18 ఏళ్లకే హీరోయిన్‌గా పరిచయమై ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఆమె అందం, పెళ్లి గురించి షాకింగ్ కామెంట్ చేసింది.

Vedika
Vedika: ముంబైలో పుట్టి పెరిగిన నటి వేదిక. మోడలింగ్ రంగంలో దృష్టి పెట్టిన ఆమెకి అర్జున్ హీరోగా నటించిన `మద్రాసి` చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది.
Vedika
ఆ తర్వాత `సక్కరకట్టి`, `మలై మలై`, `పరదేశి`, `కావ్య తలైవ`న్, `కాంచన 3`, `పేట రేప్` చిత్రాల్లో నటించారు. `ముని` తర్వాత `పరదేశి` హిట్ అయింది. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ నటించారు. తెలుగులోకి `విజయదశమి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. `బాణం`, `దగ్గరగా దూరంగా` చిత్రాల్లో నటించింది. `బాణం`ఆమెకి మంచి పేరుని తెచ్చిపెట్టింది.
Vedika
బాలకృష్ణతో `రూలర్` చిత్రంలో నటించింది. కానీ అది ఆడలేదు. ఇక చివరగా వేదిక `రజాకార్`, `ఫీయర్` చిత్రాల్లో నటించింది. అలరించింది. చివరిగా ప్రభుదేవా నటించిన 'పేట రేప్' చిత్రంలో నటించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం `కనా` అనే కన్నడ చిత్రం, `గజానా` అనే తమిళ చిత్రం ఉన్నాయి.
Vedika
వేదిక సినిమా రంగంలోకి వచ్చి 19 ఏళ్లు అవుతున్నా, ఇంకా మొదటి సినిమాలో చూసినట్లే ఉన్నారు. ఇరవై ఏళ్లు అయినా ఆమెలో మార్పు లేదు. అంతే అందంగా ఉంది. ఇంకా అందం పెరుగుతుంది. దీని గురించి అడిగినప్పుడు... ఇంకా పెళ్లి కాలేదని సమాధానమిచ్చారు.
Vedika
అలాగే చివరి వరకు పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. అందాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి పెళ్ళే వద్దనడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
also read: సావిత్రి నటించిన ఏకైక ఐటెమ్ సాంగ్ ఏంటో తెలుసా? అప్పట్లో సంచలనం.. దెబ్బకి జాతకం మారిపోయింది