విష్ణు ప్రియా, రీతూ చౌదరీ, టేస్టీ తేజ, హర్ష సాయి, సుప్రితలపై కేసులు.. పల్లవి ప్రశాంత్ కూడా ఈ స్కామ్‌లో?
విష్ణు ప్రియా, రీతూచౌదరీ, హర్ష సాయి, సుప్రిత వంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్‌పై కూడా కేసు నమోదు చేయబోతున్నారట. మరి ఇంతకి వీళ్లు ఏం తప్పు చేశారనేది చూస్తే.

harsha sai, Vishnu Priya, rithu Chowdary, tasty teja, Pallavi Prashanth,
బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకి పోలీసులు షాక్ ఇస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. విష్ణు ప్రియా, రీతూ చౌదరీ, సుప్రిత, టేస్టీ తేజ, హర్ష సాయి వంటి వారిపై తాజాగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీలోనూ చాలా మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు అవుతున్నాయి. మరి ఇంతకి ఏం జరిగింది? ఎందుకు వీరిపై కేసులు నమోదవుతున్నాయంటే?

ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్‌లు విరివిగా వస్తున్నాయి. వీటివల్ల అమాయకులు బలవుతున్నారు. ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కారణం ఇన్‌ఫ్టూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడమే.
అందుకే హర్ష సాయి, విష్ణు ప్రియా, రీతూ చౌదరీ, టేస్టీ తేజ, సుప్రితతోపాటు పరేషాన్ బాయ్స్, లోకల్ బాయ్ నాని వంటి వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. జనాలను చెడగొట్టే ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు కేసులు పెడుతున్నారు.

ఇందులో వైసీపీ నాయకురాలు శ్యామల కూడా ఉన్నారని తెలుస్తుంది. అంతేకాదు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పేరు కూడా వినిపిస్తుంది. ఆయన కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి బాగా సంపాదిస్తున్నాడని, ఆయనపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రైతు బిడ్డ ట్యాగ్‌తో వచ్చి సంచలనం సృష్టించాడు. కానీ ఇప్పుడు ఆయనపై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టుగా ఆరోపణలున్నాయి. త్వరలోనే పోలీసులు యాక్షన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

వీళ్లు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్‌ల వల్ల చాలా మంది అప్పులపాలయ్యారు. ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ కేసులు వరుసగా పెరిగిపోతున్నాయి. దీనిపై దృష్టిపెట్టిన పోలీసులు.. ఇలా తప్పుడు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు విష్ణు ప్రియా, రీతూ చౌదరీ, హర్ష సాయి, టేస్టీ తేజ, సుప్రిత, శ్యామల, పరేషాన్ బాయ్స్ వంటి 11 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేశారు.

YouTuber, Harsha Sai, YouTuber Harsha Sai, police complaint
ఈ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి హర్ష సాయి చాలాకీలకంగా ఉన్నారట. ఆయన సోషల్ మీడియాలో తన ఇన్‌ఫ్లూయెన్స్ ని ఉపయోగించి ఇలాంటి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశాడట. ఆయన్ని చూసి చాలా మంది ఆ ఊబిలోకి దిగినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో హర్ష సాయిపై పోలీసులు కఠినంగా వ్యవహరించబోతున్నారట.
ఇదిలా ఉంటే ఈ బెట్టింగ్ యాప్ స్కామ్ ఇటీవల నా అన్వేషణ అన్వేష్ ద్వారా బయటకు వచ్చింది. ఆయనకు సూర్యపేట కు చెందిన సన్నీ యాదవ్ కు మధ్య చోటు చేసుకున్న గొడవలే కారణమని తెలుస్తుంది. నా అన్వేషణ అన్వేష్‌ని ఐపీఎస్ అధికారి సజ్జనార్ కలిసి ఓ వీడియో చేశారు. వీరి మధ్య ఇంటరాక్షన్ ఏర్పడింది.
ఈ క్రమంలో సన్నీ యాదవ్ ప్రస్తావన వచ్చింది. బైక్ రైడర్ కోట్లు సాంపదిస్తున్నాడు. ఎలా సాధ్యమనేది ఆరా తీస్తే ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ అని తెలిసింది. దీంతో అలర్ట్ అయిన సజ్జనార్ పోలీస్ అధికారులకు రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఈ విషయం చెప్పడంతో ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు వరుసగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల సుప్రీత, రీతూ చౌదరీ, టెస్టీ తేజ వంటి వారు వరుసగా వీడియోలు విడుదల చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశామని, తప్పు చేశామని, క్షమించాలని వీడియో చేశారు. సే నోటూ బెట్టింగ్ యాప్ అంటూ వీడియోలు విడుదల చేశారు. ఇలా కేసులు పెట్టబోతున్నారని తెలిసే ముందుగానే అలర్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. కానీ జరగాల్సిన నష్టం జరిగింది. వీరిపై తాజాగా కేసులు నమోదయ్యాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకోబోతున్నారని తెలుస్తుంది.
read more: సావిత్రి నటించిన ఏకైక ఐటెమ్ సాంగ్ ఏంటో తెలుసా? అప్పట్లో సంచలనం.. దెబ్బకి జాతకం మారిపోయింది
also read: `ఉప్పెన` విలన్‌తో పూరీ జగన్నాథ్ సినిమా.. ఛార్మి స్థానంలో కొత్త ప్రొడక్షన్, క్రేజీ డిటెయిల్స్

