- Home
- Entertainment
- పెళ్లి వద్దు, బ్యాచిలర్ బ్రతుకే బాగుంది అంటోన్న బాలయ్య హీరోయిన్, రీజన్ తెలిస్తే షాక్ అవుతారు
పెళ్లి వద్దు, బ్యాచిలర్ బ్రతుకే బాగుంది అంటోన్న బాలయ్య హీరోయిన్, రీజన్ తెలిస్తే షాక్ అవుతారు
18 ఏళ్లకే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబయ్ బ్యూటీ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేసింది. ఏజ్ బార్ అవుతున్న పెళ్ళి మాత్రం వద్దంటోంది బాలకృష్ణ హీరోయిన్. కారణం ఏంటి అని అడిగితే.. షాకింగ్ రీజన్ చెపుతోంది.

నటి వేదిక మొదటి సినిమా
ముంబైలో పుట్టి పెరిగిన వేదిక మోడలింగ్ రంగంలో రాణిస్తూ, సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది వేదిక. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన మద్రాసి సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఆ తర్వాత రాఘవ లారెన్స్ ముని సినిమాలో నటించి బాగా పాపులర్ అయింది.
Also Read: నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?
వరుస సినిమాలతో బిజీగా ఉన్న వేదిక
ఆ తర్వాత వరుసగా పరదేశి, కాంచన 3, కళ్యాణ్ రామ్ తో విజయదశమి, బాలయ్య బాబుతో రూలర్ , దొంగ దొంగ లాంటి సినిమాల్లో నటించింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా హీరోయిన్‌గా నటించింది వేదిక.
Also Read: 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సౌత్ స్టార్ హీరోయిన్లు, బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న నటీమణులు
'పేట రేప్':
చివరిగా ప్రభుదేవా నటించిన 'పేట రేప్' సినిమాలో నటించింది. ఈ సినిమాకి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినా తమిళ్‌లో ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో కన అనే కన్నడ సినిమా, గజాన అనే తమిళ్ సినిమా ఉన్నాయి.
19 ఏళ్లు పూర్తి చేసుకున్న వేదిక:
వేదిక సినిమాల్లోకి వచ్చి 19 ఏళ్లు అవుతున్నా ఇంకా మొదటి సినిమాలో ఎలా ఉందో అలాగే ఉంది. ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా చూసుకుంటోంది. ఈ విషయం గురించి ఆమెను ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఇంకా పెళ్లి చేసుకోలేదని కూల్‌గా సమాధానం ఇచ్చింది. 37 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇదే నా ఫిట్‌నెస్ సీక్రెట్ అని చెప్పింది.
పెళ్లి వద్దనుకున్న వేదిక
ఇలా ఉండాలి అనుకుంటే.. అలాగే చివరి వరకు పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పి షాక్ ఇచ్చింది వేదిక. అందాన్ని కాపాడుకోవడానికి, ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేయడానికి పెళ్లి వద్దనుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.