Ennenno Janmala Bandham: ఖుషి మీద చెయ్యెత్తిన మాళవిక.. కోపంతో రగిలిపోయిన వేద?
Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అపార్ధాల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక దంపతుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో యష్, వేద ఇద్దరూ చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోవైపు పూజకి అన్ని సామాన్లు సర్దుతూ మా అమ్మ లేని లోటు నాకు బాగా కనిపిస్తుంది అంటుంది సుహాసిని. నాకైతే ప్రాణానికి హాయిగా ఉంది, లేదంటే పూజ అంతా చిందర వందర చేసేసేది అంటుంది మాలిని. మా అమ్మని అంత మాట అంటారా అంటుంది సుహాసిని.
మీ అమ్మ గొప్ప ఏంటి, తను ఊరెళ్ళి నా నెత్తిన పాలు పోసింది, ముద్దపప్పు అంటుంది మాలిని. ఈ మాటలు వింటున్న రత్నం మా సిస్టర్ ని ఏమీ అనొద్దు అంటూ సులోచన ని వెనకేసుకొస్తాడు. అలా అని మీరు మా చెల్లిని ఏమైనా అంటే నేను ఊరుకోను అంటూ రత్నంతో గొడవకి దిగుతాడు శర్మ. ఇదంతా వింటున్న మాలిని ఇంక ఆపండి గొడవపడితే మా వియ్యపురాళ్లు ఇద్దరమే గొడవపడాలి.
కలిసిపోతే మేమే కలుసుకోవాలి అంతేగాని మా పేర్లు చెప్పుకొని మీరు గొడవ పడకూడదు అంటూ ఖుషి ని రెడీ చేయడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాలిని. మరోవైపు నార్మల్ డ్రెస్ లో ఉన్న వసంత్ ని చూసి ఇంట్లో సాంప్రదాయబద్ధంగా పూజ జరుగుతున్నప్పుడు నువ్వు కూడా ట్రెడిషనల్ గా ఉండాలి కదా ఏంటీ బట్టలు అంటూ కొత్త డ్రెస్ తీసుకొని వచ్చి ఇస్తుంది చిత్ర. అది వేసుకున్న వసంత్ ని చూసి ఆనందంతో మురిసిపోతుంది.
పూజ దగ్గర అన్ని సర్దుతూ మనం కూడా ఈ పూజ చేద్దామా అంటాడు వసంత్. ఇది పెళ్ళైన వాళ్ళు చేస్తారు అంటుంది చిత్ర. మనం పూజ చేశాక పెళ్లి చేసుకుందాం అంటూ వెటకారం ఆడతాడు వసంత్. సంతోషించాంలే కానీ అరేంజ్మెంట్స్ చూడు అంటూ మందలిస్తుంది చిత్ర. అంతలో అనుకొని అతిధిలా వచ్చిన మాళవికని చూసి షాక్ అవుతుంది మాలిని.
ఎవరినడిగి ఇక్కడికి వచ్చావు, అసలు పిలువని పేరంటకానికి ఎందుకు వచ్చావు అంటూ కసురుకుంటుంది. నేనేమీ పిలవని పేరంటకానికి రాలేదు మీ కోడలు పిలిస్తేనే వచ్చాను అంటుంది మాళవిక. పూజకి వస్తాను అంటే కాదనలేకపోయాను అంటుంది వేద. అతి మంచితనం అన్నివేళలా మంచిది కాదు అంటూ వేదని మందలిస్తుంది. పూజకు వచ్చావు పద్ధతిగా ఉండు జాగ్రత్త అంటూ మాళవిక ని హెచ్చరించి వెళ్ళిపోతుంది మాలిని.
లోపలికి వచ్చిన మాళవిక, నీ స్థానంలో నేను ఉంటే మరో ఆడదాన్ని అసలు రానిచ్చేదాన్ని కాదు అంటుంది. నీ స్థానంలో నేను ఉంటే అసలు ఫంక్షన్ కి వచ్చేదాన్నే కాదు. మర్యాద కోసం పిలిచాను, మర్యాదగా ఉండు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వేద. ఇంతకీ నా మాజీ భర్త ఎక్కడ ఉన్నాడు, తన భార్యతో నిజంగానే సంతోషంగా ఉన్నాడా? ఒకవేళ ఉంటే గనుక నేను ఉండనివ్వను కదా అనుకుంటూ యష్ ని వెతుక్కుంటూ వెళ్తుంది మాళవిక. మరోవైపు ముత్తయిదుగుల పాదాలకి పసుపు రాస్తుంది వేద. అలా ఎందుకు చేస్తున్నావు అంటుంది ఖుషి. ఇలా చేస్తే అమ్మవారి ఆశీర్వచనం ఉంటుంది ఇలా చేయడం చాలా మంచిది అంటుంది వేద.
ఆమె దగ్గర నుంచి ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతుంది ఖుషి. నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి యష్ చైన్ ఆమె తలకి చిక్కు పడుతుంది. ఆ చిక్కుని విప్పటానికి ఇద్దరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతలో మాళవిక అక్కడికి వచ్చి నేను విప్పనా అని అడుగుతుంది. వద్దు అంటుంది వేద. నేను విప్పుతాను అంటుంది చిక్కుముడిని మాత్రమే మీ బ్రహ్మముడిని కాదు అంటుంది మాళవిక. ఇంతలో చిక్కుముడి విడిపోవడంతో మాళవిక దగ్గరికి వచ్చి మమ్మల్ని విడదీయడం నీ తరం కాదు. సంతోషంగా ఉండడం అంటే మనం మాత్రమే ఆనందంగా ఉండటం కాదు ఎదుటివారిని చూసి ఏడకపోవడం కూడా ఆనందమే.
నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద. మరోవైపు పూజ పూర్తయిన తర్వాత మీజంట ఏడు జన్మలపాటు పదిలంగా ఉండాలి అంటూ దీవిస్తారు పూజారి గారు. నా కొడుకు మీద వాడి కాపురం మీద ఎవరి దృష్టి పడకుండా ఆశీర్వదించండి అంటూ మాళవిక ని చూస్తూ కోపంగా చూస్తూ పూజారి గారికి చెప్తుంది మాలిని. తరువాయి భాగంలో పసుపు చేత్తో అనుకోకుండా మాళవికని తాకటం వల్ల ఆ చీరకి పసుపు రంగు అంటుకుంటుంది. నా చీరనే పాడు చేస్తావా అంటూ ఖుషి మీద చేయి ఎత్తుతుంది మాళవిక. అంతలోనే అక్కడికి వచ్చిన వేద నా కూతురు మీద చెయ్యి ఎత్తటానికి నీకు ఎంత ధైర్యం అంటూ ఆమె చేతిని అడ్డుకుంటుంది.