- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: ఫుల్ గా తాగొచ్చిన యష్.. ఖుషి కోసం మానేస్తానని వేదకు మాట ఇచ్చిన యష్!
Ennenno Janmala Bandham: ఫుల్ గా తాగొచ్చిన యష్.. ఖుషి కోసం మానేస్తానని వేదకు మాట ఇచ్చిన యష్!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లలో కాస్త భిన్నమైన కథతో ప్రసారమవుతున్న సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం ( Ennenno Janmala Bandham). మంచి ఎంటర్టైన్మెంట్ గా ఈ సీరియల్ కొనసాగుతుంది. ఈ సీరియల్ కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది ఓ సారి తెలుసుకుందాం.

ఇక యష్ (Yash) బాగా తాగి మాళవిక ఇంటిదగ్గర బాగా రచ్చ రచ్చ చేసి తన ఇంటికి కారులో బయలుదేరుతాడు. అక్కడ జరిగిన విషయాన్ని తలచుకుంటాడు. డ్రైవర్ రాము (Ramu) తో.. తాగినప్పుడు అన్ని నిజాలే మాట్లాడుతారా అని అడుగుతాడు. ఇక రాము తనకు తెలియదని అంటాడు.
మరోవైపు వేద (Vedha).. యష్ గురించి ఆలోచనలలో పడుతుంది. రేపు పూజ పెట్టుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అని కోపంతో రగిలిపోతుంది. అప్పుడే యష్ వాళ్ళ అక్క రావటంతో తనతో యష్ (Yash) గురించి అడుగుతుంది. తను బ్యాచిలర్ పార్టీ అని చెప్పటంతో.. అప్పుడు వేద చూపించే కోపంలో ప్రేమ కనిపిస్తుంది.
మొత్తానికి తనకు తెలియకుండానే యష్ (Yash) పై ప్రేమ చూపించినట్లు కనిపిస్తుంది. ఇక యష్ మొత్తానికి అక్కడికి రావడంతో వేద యష్ తాగాడని గుర్తుపట్టి కాసేపు క్లాస్ పీకుతుంది. రేపు పూజ పెట్టుకొని ఇప్పుడు ఇలా ఉండటం ఏంటి అని అడుగుతుంది. ఖుషి (Khushi) కోసం ఈ అలవాటు మార్చుకోవాలి అని అంటుంది.
ఇక యష్ (Yash) ఖుషి కోసం ఇది మార్చుకోలేనా అని ఇకపై మందు తాగను అని అంటాడు. ఇక ఉదయాన్నే అందరూ పూజా కార్యక్రమం కోసం గుడికి వెళ్తారు. అక్కడ మొదట వేద ఫ్యామిలీ వెళ్తారు. ఇక సులోచన (Sulochana) వాళ్లు దేవుడికి అంత మంచి జరగాలని దండం పెట్టుకుంటారు.
అబ్బాయి వాళ్ళకి మర్యాద చేయాలి అని సిద్ధంగా ఉంటారు. ఇక ఆ సమయానికి మాలిని (Maalini) వాళ్లు గుడి కి వస్తారు. మంచి మర్యాద చేయాలనుకున్న సులోచన (Sulochana).. మాలిని అతిగా చేయడంతో తాను కూడా తిరిగి వారికి మరో రకంగా మర్యాద చేస్తుంది. అలా కాసేపు అక్కడ కాస్త ఫన్నీగా అనిపిస్తుంది.
అప్పుడే యష్ (Yash) రావటంతో సులోచన భర్త యష్ కు మర్యాద చేస్తూ తన వైపు తీసుకొని వెళ్తాడు. దానికి కూడా మాలిని కాస్త వెటకారం చేస్తూ ఉంటుంది. మాలిని (Maalini) వాళ్ళు కూడా అమ్మవారికి.. మంచి జరగాలని దండం పెట్టుకుంటుంది. ఇక తరువాయి భాగంలో వేద, యష్ పూజలో జంట గా కూర్చుంటారు.