- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: డ్యాన్స్ చేస్తున్న యశోదర్, వేదలను చూసిన మాళవిక.. ఆతర్వాత ఏం జరిగిందంటే?
Ennenno Janmala Bandham: డ్యాన్స్ చేస్తున్న యశోదర్, వేదలను చూసిన మాళవిక.. ఆతర్వాత ఏం జరిగిందంటే?
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇది వరల్డ్ లోనే బెస్ట్ గిఫ్ట్, ఇంత గొప్ప గిఫ్ట్ ఇంతవరకు నాకు ఎవరూ ఇవ్వలేదు అని ఖుషి తో అంటూ వేద (Veda) ఎంతో ఆనందం వ్యక్తం చెందుతుంది.

ఆ తర్వాత రెండు ఫ్యామిలీలు కలిసి సంగీత్ ఈవెంట్లో ఆనందంగా పాల్గొంటారు. ఇక వేద (Veda), యశోదర్ లు కూడా వచ్చి పక్క పక్కన కూర్చుంటారు. ఈలోపు ప్రోగ్రాం స్టార్ట్ చేసి సులోచన చిన్న కూతురు స్టేజ్ పై భరత నాట్యం చేస్తుంది. మరోవైపు మాళవిక (Malavika), వేద కు నక్లెస్ ను గిఫ్ట్ గా ఇవ్వడానికి బయలుదేరుతుంది.
మాళవిక ( Malavika) బయలుదేరుతున్న క్రమంలో అభిమన్యు ఎదురవ్వగా.. వేదకు ఖరీదైన నెక్లెస్ ను గిఫ్ట్ గా ఇచ్చి మనకు దగ్గర చేసుకుంటాను అని చెబుతోంది. అంతేకాకుండా ఖుషి తీసుకున్న గిఫ్ట్ ను అభిమన్యు (Abhimanyu) కు చూపించి నాకోసమే తీసుకుంది అని గొప్పగా చెబుతుంది.
మరోవైపు మాలిని (Malini) , కంచులు ఫ్రూట్ జ్యూస్ లో ఫన్నీ గా ఆల్కహాల్ కలుపుతారు. ఆ తర్వాత యశోదర్, వేద (Vedala) ల మధ్య ఫన్నీ మాటల యుద్ధం జరుగుతోంది. ఆ తర్వాత మాలిని ఫ్యామిలీ లెక్కలు లిక్కర్ విత్ కూల్ డ్రింక్ అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు.
ఈ దెబ్బతో ఆడపెళ్ళి వారి పని అయిపోయిందంటూ.. మాలిని (Malini) వాళ్ళ కూతురితో తో సహా ఆనందంగా చిందులు వేస్తూ ఉంటారు. మరోవైపు యశోదర్ (Yasodar) , వేదలు రొమాంటిక్ గా స్టేజ్ పై డాన్స్ చేస్తూ ఉంటారు.
ఇక యశోదర్, వేద (Veda) లు ఒకరికొకరు చేతులు పట్టుకుని డాన్స్ చేస్తూ ఉండగా మాళవిక అక్కడికి వస్తుంది. ఇక వారిద్దరూ అలా డాన్స్ చేయడాన్ని చూసి యశోదర్ (Yasodar) పెళ్లి చేసుకునే అమ్మాయి వేదన అని మనసులో అనుకుంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.