MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు

George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు

శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న జార్జ్ క్రిష్ గ్లింప్స్ విడుదలైంది. ఇందులో శర్వానంద్ జార్జ్, క్రిష్‌గా రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 24 2026, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శ్రీను వైట్లతో శర్వానంద్ తొలి కాంబినేషన్
Image Credit : Asianet News

శ్రీను వైట్లతో శర్వానంద్ తొలి కాంబినేషన్

శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జార్జ్ క్రిష్. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇది. ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మానస వారణాసి కథానాయికగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి 2027 సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెండు విభిన్న షేడ్స్‌లో శర్వానంద్
Image Credit : Asianet News

రెండు విభిన్న షేడ్స్‌లో శర్వానంద్

శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా జార్జ్ క్రిష్ చిత్రబృందం ప్రత్యేక వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో శర్వానంద్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను చూపించారు. వీడియోలో శర్వానంద్ రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించారు. ఒక పాత్రలో క్రిస్టియన్‌గా, మరో పాత్రలో హిందువుగా కనిపించారు. జార్జ్, క్రిష్ అనే రెండు పేర్లతో ఆయన కనిపించడంతో సినిమాలో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

35
మానస వారణాసి ఎంట్రీ
Image Credit : Asianet News

మానస వారణాసి ఎంట్రీ

జార్జ్ క్రిష్ గ్లింప్స్ చివర్లో మానస వారణాసి ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఓ రెస్టారెంట్‌లోకి రావడంతో వీడియో ముగుస్తుంది. గ్లింప్స్‌లో అనూప్ రూబెన్స్ స్వరపరిచిన టైటిల్ సాంగ్‌ను కూడా వినిపించారు. శర్వానంద్ రెండు విభిన్న లుక్స్, మానస వారణాసి ఎంట్రీతో ఈ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచింది.

45
సంక్రాంతి బరిలో శర్వానంద్
Image Credit : Asianet News

సంక్రాంతి బరిలో శర్వానంద్

జార్జ్ క్రిష్ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జనవరి 12న వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న జనవరి 12 విడుదల సినిమా, జనవరి 13న చిరంజీవి నటిస్తున్న కాకా సినిమా విడుదల కానున్నాయి. ఇలా భారీ చిత్రాలు వరుసగా విడుదలవుతున్నప్పటికీ శర్వానంద్ తగ్గడం లేదు. జనవరి 14న జార్జ్ క్రిష్ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

55
తీవ్ర పోటీలో శర్వానంద్ సినిమా
Image Credit : Asianet News

తీవ్ర పోటీలో శర్వానంద్ సినిమా

జనవరి 12, 13, 14 తేదీల్లో వరుసగా సినిమాలు విడుదల కానుండటంతో 2027 సంక్రాంతి బరిలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇంతటి భారీ చిత్రాలు పోటీలో ఉన్న సమయంలో జార్జ్ క్రిష్ కూడా బరిలోకి దిగుతోంది. ఈ తీవ్రమైన పోటీలో శర్వానంద్ సినిమా ఎలా ముందుకు సాగుతుందనేది పరిశ్రమలో ఆసక్తిగా మారింది. మరోవైపు గ్లింప్స్‌లో శర్వానంద్ రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Movie Copied Scenes: బ్లాక్ బస్టర్ సినిమాల్లో అదిరిపోయే సీన్లు..మొత్తం కాపీ చేసినవే, ఎక్కడ నుంచి లేపేశారంటే
Recommended image2
Radhika Apte: ఆ వీడియో మా వాచ్‌మన్, కారు డ్రైవర్ కూడా చూశారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Paradise Mistakes: ప్యారడైజ్‌ సినిమాపై నెగటివ్‌ టాక్‌కి 5 కారణాలు.. శ్రీకాంత్‌ ఓడెల చేసిన మిస్టేక్‌ ఏంటంటే?
Related Stories
Recommended image1
Movie Copied Scenes: బ్లాక్ బస్టర్ సినిమాల్లో అదిరిపోయే సీన్లు..మొత్తం కాపీ చేసినవే, ఎక్కడ నుంచి లేపేశారంటే
Recommended image2
Radhika Apte: ఆ వీడియో మా వాచ్‌మన్, కారు డ్రైవర్ కూడా చూశారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved